Hyper Aadi On Akhil Sarthak Property in Dhee Show Latest Promo
Hyper Aadi : బిగ్ బాస్ షోతో అఖిల్ సార్థక్‌కు అంతో ఇంతో క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు లక్ కొద్దీ రన్నర్‌గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ ఓటీటీలోనూ తన బిహేవియర్, నేచర్‌తో రన్నర్‌గానే నిలిచాడు. బిగ్ బాస్ షో తప్ప అఖిల్‌కు చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంతకు ముందు సీరియల్స్‌లో విలన్ రోల్స్ చేసినా, సహాయ పాత్రల్లో నటించినా కూడా అంతగా గుర్తింపురాలేదు. బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చాక అంతగా ఆఫర్లు కూడా ఏమీ రాలేదు. మోనాల్‌తో లవ్ ట్రాక్ అంతో ఇంతో వర్కవుట్ అయింది. మోనాల్ అఖిల్ కాంబోలో ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేశారు.
కానీ ఇంత వరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన అయితే రాలేదు. అలా మొత్తానికి అఖిల్‌కు మాత్రం ఇంకా సరైన బ్రేక్ రాలేదు. ఈ సమయంలోనే ఢీ షోకు వచ్చాడు. ఆ మధ్య ఢీ షోలో అఖిల్ బాగానే సందడి చేశారు. మళ్లీ ఓటీటీ నాన్ స్టాప్ షోకు వెళ్లడంతో ఢీ షోకు బ్రేక్ ఇచ్చాడు. నాన్ స్టాప్ నుంచి బయటకు వచ్చిన అఖిల్.. మళ్లీ కాస్త గ్యాప్ తీసుకుని అదే ఢీ షోకు వచ్చాడు. అసలే ఢీ షోలో ఆది ఆధిపత్యమే నడుస్తుంటుంది. అతగాడే అందరి మీద పంచులు వేస్తుంటాడు. వేరే వాళ్లకు చాన్స్ ఇవ్వడు.
Hyper Aadi On Akhil Sarthak Property in Dhee Show Latest Promo
అలాంటి ఆది వరుసగా అఖిల్ మీద సెటైర్లు వేస్తుంటాడు. షోలో అఖిల్ పరువుతీస్తుంటాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ అఖిల్ మీద పంచులు వేశాడు. ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నేళ్లు అవుతోంది.. అని అఖిల్‌ను ఆది అడుగుతాడు. పదేళ్లు అవుతుంది అని అఖిల్ సమాధానం ఇస్తాడు. అబ్బో పదేళ్లు అంటే.. ఎంత సంపాదించావ్ అని మళ్లీ అడుగుతాడు. బాగానే సంపాదించాను అని అఖిల్ అంటాడు. అంటే ఏం చేయకుండానే అంత సంపాదించావ్ అంటే.. చేసి ఉంటే ఇంకెంత సంపాదించేవాడివో అని కౌంటర్లు వేశాడు. అంటే అఖిల్‌కు కనీసం నటన కూడా రాదని ఆది కౌంటర్లు వేశాడు.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.