Hyper Aadi : ఇంటి మొత్తంలో నచ్చిన గది అదేనట.. అసలు విషయం చెప్పిన రోజా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : ఇంటి మొత్తంలో నచ్చిన గది అదేనట.. అసలు విషయం చెప్పిన రోజా

 Authored By bkalyan | The Telugu News | Updated on :12 February 2022,7:00 am

Hyper Aadi : బుల్లితెరపై మొదటిసారిగా ఇలాంటిది జరిగింది. యూట్యూబ్‌లో ప్రస్తుతం హోం టూర్ అనే టాపిక్ ఎంతో ట్రెండింగ్‌లో ఉంటుంది. సెలెబ్రిటీల ఇంటి గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే ఎమ్మెల్యే రోజా, జబర్దస్త్ జడ్జి అయిన రోజా హోం టూర్ చేస్తే ఎలా ఉంటుంది.. అది కూడా తన స్కిట్లో భాగంగా ఆది చేస్తే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

రోజా మీద ఆది దారుణంగా పంచులు వేశాడు. గుమ్మం చూశావా? ఎంత విశాలంగా ఉందో అని రోజా అంటుంది. మీరు వెళ్లాలంటే ఆ మాత్రం విశాలంగా ఉండాలని భారీకాయం మీద కౌంటర్లు వేశాడు ఆది. అలా రోజా మీద నాన్ స్టాప్‌గా పంచులు పడుతూనే వచ్చాయి. అయితే రోజా తన ఇంటిని మొత్తం చూపించింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంటూ చూపించింది.

Hyper Aadi Roja Home Tour Skit In Jabardasth

Hyper Aadi Roja Home Tour Skit In Jabardasth

Hyper Aadi : రోజా హోం టూర్..

అయితే ఫస్ట్ ఫ్లోర్‌లోని వంటగదిని రోజా చూపించింది. అయితే తనకు ఎంతో ఇష్టమైన గది అంటూ పూజ గదిని చూపించింది. ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు రోజూ ఇక్కడే దండం పెట్టుకుని వస్తాను అంటూ రోజా చెప్పుకొచ్చింది. ఈ పూజ గది తరువాత తన బెడ్రూం అంటే ఇష్టమని రోజా అది కూడా చూపించింది. మొత్తానికి రోజా హోం టూర్ స్కిట్ మాత్రం అదిరిపోయింది.

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది