Hyper Aadi : రెచ్చిపోయిన పరదేశీ ఐశ్వర్య.. పరువుతీసిన హైపర్ ఆది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : రెచ్చిపోయిన పరదేశీ ఐశ్వర్య.. పరువుతీసిన హైపర్ ఆది

Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై ఎంత సందడి చేస్తాడో అందరికీ తెలిసిందే. ఆది వేసే పంచ్‌లు మామూలుగా ఉండవు. ఎవరి మీదైనా సరే ఆది పంచ్‌లు చకచకా వేసేస్తుంటాడు. అలాంటి ఆదికి ఎదురు ఎవరు నిలబడలేరు. ఇప్పుడు ఆది శ్రీదేవీ డ్రామా కంపెనీతో బిజీగా ఉంటున్నాడు. ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ కోసం ఆది.. జబర్దస్త్ షోను వదిలేశాడు. మధ్యలో గ్యాప్ ఇచ్చేశాడు. ఇప్పటికీ రెండు నెలలు అవుతోంది. ఆది ఇంకా జబర్దస్త్ షోలోకి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 July 2022,2:30 pm

Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై ఎంత సందడి చేస్తాడో అందరికీ తెలిసిందే. ఆది వేసే పంచ్‌లు మామూలుగా ఉండవు. ఎవరి మీదైనా సరే ఆది పంచ్‌లు చకచకా వేసేస్తుంటాడు. అలాంటి ఆదికి ఎదురు ఎవరు నిలబడలేరు. ఇప్పుడు ఆది శ్రీదేవీ డ్రామా కంపెనీతో బిజీగా ఉంటున్నాడు. ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ కోసం ఆది.. జబర్దస్త్ షోను వదిలేశాడు. మధ్యలో గ్యాప్ ఇచ్చేశాడు. ఇప్పటికీ రెండు నెలలు అవుతోంది. ఆది ఇంకా జబర్దస్త్ షోలోకి రావడం లేదు. కానీ శ్రీదేవీ డ్రామా కంపెనీలో మాత్రం రెట్టింపు వినోదాన్ని ఇస్తున్నాడు. అందరినీ కౌంటర్లతో రఫ్పాడిస్తున్నాడు. గత ఆదివారం నాడు ప్రసారమైన ఈ ఎపిసోడ్‌లో ఆది అందరినీ ఆడేసుకున్నాడు.

ఒక్కొక్కరినీ పంచులతో ఏడిపించేశాడు. అందరికీ జోడిలు ఇచ్చారు.. నాకు మాత్రం ఎందుకు ఇవ్వలేదు అని బుల్లెట్ భాస్కర్ అంటాడు. నీకు ఏ జోడిని తీసుకురావాలో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉండి తీసుకురాలేదు.. దానికి మేం ఏం చేయాలంటూ ఆది పంచ్ వేశాడు. ఇక అలా ప్రతీ ఒక్కరి మీద కౌంటర్లు వేశాడు. ఇక చివరకు పరదేశీ లైన్‌లోకి వచ్చాడు. తనకు జోడిగా ఐశ్వర్యను పట్టుకొచ్చాడు. ఐశ్వర్యతో నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా? ఫ్యూచర్‌లో ఐశ్వర్య ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఫ్యూచర్‌లో ఐశ్వర్య అంటూ ఇలా పొగుడుకుంటూ వెళ్తాడు పరదేశీ. ఇక ఆది తన స్టైల్లో కౌంటర్లు వేసి నోర్మూయిస్తాడు.

Hyper Aadi Satires on Paradesi and Aishwarya

Hyper Aadi Satires on Paradesi and Aishwarya

అసలు దానికి ఫ్యూచర్ ఉందా? అంటూ ఆది సెటైర్లు వేయడంతో అంతా నవ్వుతారు. ఐశ్వర్య నోరెళ్లెబెట్టేస్తుంది. అలా మొత్తానికి పరదేశీ, ఐశ్వర్యల జోడి గాలి తీసేస్తాడు ఆది. ఇక ఐశ్వర్యను రాం ప్రసాద్ పట్టుకెళ్తుంటే.. అది నా జోడి.. నువ్వెందుకు పక్కకు తీసుకెళ్తున్నావ్ అని పరదేశీ అంటాడు. నువ్వైనా కూడా పక్కకే కదా? తీసుకెళ్లేది అని ఆది కౌంటర్లు వేస్తాడు. అలా మొత్తానికి పరదేశీ ఐశ్వర్య జోడిని ఆది ఆడేసుకున్నాడు. నరేష్ పవిత్ర, బుల్లెట్ భాస్కర్ తండ్రి, ఫైమా ప్రవీణ్ జోడిలను కూడా ఆది వదిల పెట్టలేదు. ఆది దెబ్బకు అందరూ బలయ్యారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది