Hyper Aadi : నాకు నీ అంత దాహం లేదు!.. సుడిగాలి సుధీర్ పరువుతీసిన హైపర్ ఆది
Hyper Aadi : బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వారి కెరియర్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలాంటి జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రస్తుతం బిజీగా ఉన్న వారిలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ఒకరని చెప్పవచ్చు. ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ప్రోగ్రామో లో భాగంగా సుడిగాలి సుధీర్ హైపర్ ఆది ఆచార్య సీన్ తో స్కిట్ చేశారు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ చెరువులో నీళ్లు తాగుతూ ఉంటే చిరు ఏవిధంగా కాపలా ఉంటారో అదే విధంగా ఈ స్కిట్ లో సుధీర్ కాపలా ఉంటే హైపర్ ఆది నీళ్లు తాగుతూ ఉంటారు. ఇలా నీళ్లు తాగుతూ హైపర్ ఆది పైకి లేవగానే సుధీర్ అప్పుడే పైకి లేచావేంటి మరి కాసేపు తాగొచ్చు కదా అంటాడు.

Hyper aadi satires on sudigali sudheer in jabardasth latest promo
Hyper Aadi : నీ అంత దాహం నాకు లేదు..
సుడిగాలి సుధీర్ హైపర్ ఆదిని ఆ మాట అనగానే హైపర్ ఆది వెంటనే తనదైన శైలిలో సెటైర్ వేస్తూ.. నాకు నీ అంత దాహం లేదన్నా ఏదో చిన్న చిన్న దాహాలు ఉన్నాయని హైపర్ ఆది తనదైన శైలిలో సుధీర్ పై పంచ్ వేయడంతో అక్కడున్న వారందరూ కడుపుబ్బ నవ్వారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఎపిసోడ్ కి సంబంధించి మరింత వినోదాన్ని చూడాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాలి.