Sudigali Sudheer : తెలుగు బుల్లి తెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేసిన జబర్దస్త్ ఈ మధ్య కాలంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ స్టార్ కమెడియన్ లుగా పేరు దక్కించుకున్న హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మరియు గెటప్ శ్రీను వీళ్ళందరూ కూడా జబర్దస్త్ వీడి వెళ్లి పోయారు. వీరు జబర్దస్త్ వదిలి వెళ్లి పోవడానికి కారణం ఏంటి అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఇటీవల జబర్దస్త్ ఎపిసోడ్ చూసిన వారెవరికైనా వీరు ఇక ఈటీవీలో కనిపించరు అని క్లారిటీ వచ్చేసింది.
జబర్దస్త్ నుండి సుధీర్ వెళ్లిపోయిన క్రమం చూపిస్తూ ఒక కామెడీ స్కిట్ ని కూడా పండించే ప్రయత్నం చేశారు. ఆ స్కిట్టు నవ్వులు పూయించలేదు కాని అందరికీ కన్నీళ్లు పెట్టించింది. ఆ విషయం పక్కన పెడితే సుధీర్ మరియు రాంప్రసాద్ మళ్ళీ కలిసి ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం లో సందడి చేస్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. కానీ ఇప్పటికే సుధీర్ ఈటీవీకి చాలా దూరం అయ్యాడు అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీ లో అడుగు పెట్టి సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తున్న సుధీర్ కు ఈ మధ్య వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మరో వైపు స్టార్ మా వారు కూడా సుధీర్ కి మంచి ప్యాకేజీ ప్రకటించడం జరిగిందట.దాంతో సుధీర్ మరియు ఇతర కమెడియన్స్ వరుసగా అటువైపు వెళ్ళారు అంటూ టాక్ వినిపిస్తుంది.
ఈ టీవీ మల్లెమాల వారితో అసలు ఏం గొడవ జరిగింది అనేది క్లారిటీ రాలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పారితోషికంలో వ్యత్యాసం కారణంగానే సుధీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు. సుధీర్ మాత్రమే కాకుండా ఇంకా పలువురు కూడా జబర్దస్త్ నుండి వెళ్ళిపోవడానికి కారణం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఆ కారణం వారు ఎప్పుడు ఎప్పుడు చెప్తారా అంటూ వారి అభిమానులు మరియు జబర్దస్త్ యొక్క ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుధీర్ మరియు హైపర్ ఆది లు వారి యొక్క సైలెన్స్ ను ఎప్పుడు బ్రేక్ చేస్తారో… వారు నోరు తెరిచే ఎప్పుడు క్లారిటీ ఇస్తారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.