Prabhas : ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఆ హీరోకి పట్టిన గతే పడుతుంది.. వేణుస్వామి కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఆ హీరోకి పట్టిన గతే పడుతుంది.. వేణుస్వామి కామెంట్స్

 Authored By aruna | The Telugu News | Updated on :16 August 2022,7:40 pm

Prabhas : డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రస్తుతం ఒక విషయం వైరల్ అవుతోంది. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే తన కెరీయర్ ముగిసిపోతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇది ఏదో జోక్ అనుకుని కొట్టిపారేయాల్సిన విషయం కాదని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ జ్యోతిష్కుడు అయిన వేణుస్వామి ప్రభాస్ జాతకం చూసి చేసిన వ్యాఖ్యలని అంటున్నారు. వేణుస్వామి చెప్పిన జాతకం నిజం అవుతుందని కూడా అంటున్నారు.

గతంలో సమంత, నాగచైతన్య ప్రేమపెళ్లి చేసుకున్న సమయంలో వీరి నాలుగేళ్లకే విడాకులు తీసుకుంటారని వేణుస్వామి జోస్యం చెప్పారు. సరిగ్గా అదే జరిగింది. ఇక చిరంజీవి కూతురు మూడు నుంచి నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటుందని కూడా పేర్కొన్నారు. చిరు కూతురు ఇప్పటివరకు రెండు చేసుకుంది.త్వరలోనే తన స్నేహితుడిని మూడో పెళ్లి చేసుకోబోతుందని కూడా ఆయన జోస్యం చెప్పారు. అది నిజం అవుతుందా? లేదా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.

If Prabhas gets married will the hero suffer the same fate

If Prabhas gets married, will the hero suffer the same fate

Prabhas : ప్రభాస్ కూడా ఉదయ్ లాగా అవుతాడా?

సినిమా కెరీర్ విషయానికొస్తే ప్రభాస్ చాలా మంచి స్థానంలో వెలుగొందుతున్నాడు. బాహుబలి బిగినింగ్, కన్‌క్లూసన్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్‌లో ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. దేశంలోనే అంతరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ప్రభాస్ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం డార్లింగ్ సినినమాకు వంద కోట్లకు పైగా తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఇక ప్రభాస్ పెళ్లి విషయంలో మాత్రం అభిమానులు కొంత నిరాశతో ఉన్నారట.. సినీ కెరీర్ బానే ఉన్నా అందరూ హీరోల వలే ప్రభాస్ కూడా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండదు. కానీ ప్రభాస్ పెళ్ళి చేసుకోకపోతేనే ఆనందంగా ఉంటాడని, వివాహం జరిగితే ఉదయ్ కిరణ్ మాదిరి ప్రాణగండం ఉందని జ్యోతిష్కుడు వేణుస్వామి చెబుతున్నాడు.అందులో వాస్తవంత ఎంతుందో తెలియదు గానీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. ఆయన గతంలో చెప్పిన జోస్యాలు కొన్ని ఫలించడంతో ఆయన చెప్పేదానికి బలం ఉందని కొందరు నమ్ముతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది