Senior NTR : సీనియర్ ఎన్టీఆర్ పక్కన ఆ హీరోయిన్ ఉంటే సినిమాకి టికెట్లు కూడా దొరికేవి కావు.. అంత తోపు ఫిగరా?
Senior NTR : సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ఏపీకి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను ప్రపంచానికి మొదట తెలియజేసింది ఆయనే. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే సీనియర్ ఎన్టీఆర్. అప్పట్లో ఆయనకు ఉన్న క్రేజ్ అటువంటిది. ఆయనతో సినిమా తీయాలని, ఆయన సరసన హీరోయిన్ గా నటించాలని ఎందరో ఆశపడ్డారు. ఆయన కోసం క్యూ కట్టారు. అది సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న పాపులారిటీ. ఎన్టీఆర్ తో కలిసి చాలామంది హీరోయిన్లు నటించారు.
అందులో బెస్ట్ కాంబో అంటే ఎన్టీఆర్, సావిత్రిదే. వాళ్ల సినిమా వస్తోందంటే ఇక అది బ్లాక్ బస్టర్ హిట్ అని ముందే రాసుకోవాల్సిందే. అంత హిట్ పెయిర్ వాళ్లిద్దరిదీ. ఆ తర్వాత ఎన్టీఆర్, జయలలిత పెయిర్. జయలలిత, ఎన్టీఆర్ జంటగా సినిమా వస్తోందంటే చాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు ప్రజలు కూడా ఆ సినిమాను తెగ ఆదరించేవారు. ఆ సినిమాలను దాదాపు ఒక ఏడాది పాటు థియేటర్లలో ప్రదర్శించేవారంటే.. వాళ్ల జంట ఎంత హిట్టో అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఎన్టీఆర్, సావిత్రి కాంబోలో సినిమాలకు బ్రహ్మరథం పట్టిన సినీ అభిమానులు ఆ తర్వాత సావిత్రి కొంచెం బొద్దుగా మారడంతో ఆమె ప్లేస్ ను జయలలిత భర్తీ చేసేది. అందులోనూ అప్పట్లో జయలలిత వయసులో ఉండటం..

if that senior heroine acted in senior ntr movie it would become block buster hit
Senior NTR : సావిత్రి కంటే జయలలితకే ఎక్కువ క్రేజ్
ఇంకా అందంగా ఉండటం వల్ల.. ఎన్టీఆర్, జయలలిత కాంబినేషన్ మూవీ అంటే ఇక మామూలుగా ఉండేది కాదట. నెలలకు నెలలు ఆ సినిమాలకు టికెట్లు కూడా దొరికేవి కావట. తెలుగు మాత్రమే కాదు.. తమిళంలోనూ సీనియర్ ఎన్టీఆర్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఒకానొక దశలో అయితే.. ఎన్టీఆర్, జయలలిత కాంబోలో వచ్చిన మూవీ తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ రోజులు ఆడేదట. ఎందుకంటే.. జయలలిత కంటే కూడా ఎన్టీఆర్ ను తమిళ ప్రజలు అంతలా ఆదరించేవారు. అందుకే.. ఆ హిట్ పెయిర్ కాంబోలో సినిమా వచ్చిందంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవడం ఉండదు. చొక్కాలు చించుకోవడమే.. సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం పడిగాపులు పడటమే.