NTR : ఎన్టీఆర్ వర్ధంతి.. తెలుగుతననానికి నిలువెత్తు రూపం..!
ప్రధానాంశాలు:
NTR : ఎన్టీఆర్ వర్ధంతి.. తెలుగుతననానికి నిలువెత్తు రూపం..!
NTR : టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు nandamuri taraka rama rao వర్ధంతి నేడు కాగా, ఆయన మరణించి నేటికి 29 ఏళ్లు గడిచిన సందర్భంగా హైదరాబాద్‌లోని Hyderabad ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ BalaKrishna , రామకృష్ణ ఘాట్‌కు చేరుకుని అంజలి ఘటించారు. నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు.యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు.తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందారు, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు.
NTR యుగ పురుషుడు..
తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాతగారే నాకు నిత్యస్ఫూర్తి. ఆయన వర్థంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు’’ అని నారా లోకేష్ స్మరించుకున్నారు.తెలుగు రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలపైన ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. నందమూరి తారక రామారావు NTR సినిమాల్లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డులను నెలకొల్పారు. అదే సమయంలో రాజకీయాల్లో అతి తక్కువ సమయంలో పెను సంచలనమే సృష్టించారు.
13 యేళ్ల రాజకీయ జీవితంలో 4 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీఆర్. 1983, 1984, 1985 సంవత్సరాలలో వరుసగా మూడేళ్లు ఆంధ్ర ప్రదేశ్‌గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుంది. ఎన్టీఆర్ రావడంతో రాజకీయాల్లో సినీ నటులకు విలువ పెరిగింది. ఆయన కంటే ముందు కొంత మంది నటులు పొలిటికల్ Political గా రాణించారు. ప్రాంతీయ పార్టీలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. తెలుగు దేశం పార్టీ అధినేతగా చైతన్య రథంపై ఆయన చేసిన యాత్రసంచలనం సృష్టించింది. అద్వానీ మిగతా నాయకులకు రథయాత్రలకు ఎన్టీఆర్ యాత్ర ప్రేరణగా నిలిచింది.
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన Sr Jtr సీనియర్ ఎన్టీఆర్… పరిపాలనలో సమూల మార్పులకు ఆద్యుడు. అప్పటి కాంగ్రెస్ Congress ప్రభుత్వం.. తెలుగు నేతలను, తెలుగు వారిని చులకనగా చూస్తున్నారనే కారణంతో తెలుగోడి ఆత్మాభిమానం చాటాలనే లక్ష్యం పెట్టుకున్నారు. దానిలో భాగంగానే 1982లో తెలుగు దేశం అని పేరుతో పార్టీని స్థాపించారు. 1983లో తెలుగు నేలపై మొట్టమొదటి కాంగ్రెసేతర సీఎంగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో నవశఖానికి నాంది పలికారు.