Indian 2 Movie : రిలీజ్‌కి ముందే రచ్చ చేస్తున్న భారతీయుడు2.. బుకింగ్స్ మాములుగా లేవుగా..!
Indian 2 Movie : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ , సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’ చిత్రం జూలై 12న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
28 ఏళ్ల కిందట భారతీయుడు వచ్చినప్పుడు నేను గానీ, శంకర్ గానీ అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. కానీ ఆ చిత్రం నమ్మశక్యం కాని రీతిలో సక్సెస్ సాధించింది. భారతీయుడు-2 మనందరి సినిమా. భారతీయుడు సినిమాలో గుంపులో నిలబడే పాత్ర అయినా లభిస్తే చాలని సముద్రఖని గారు ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఇప్పుడాయన భారతీయుడు-2లో నటించారు. ఇక నా దృష్టి అంతా ప్రతిభావంతులను ఇండస్ట్రీకి తీసుకురావడంపైనే ఉంటుంది. ఇక, భారతీయుడు-2 చిత్రం గురించి అందరూ చెప్పారు… నేనేమీ చెప్పనక్కర్లేదు… ఆ సినిమాయే మాట్లాడుతుంది అని అన్నారు.
Indian 2 Movie : రిలీజ్‌కి ముందే రచ్చ చేస్తున్న భారతీయుడు2.. బుకింగ్స్ మాములుగా లేవుగా..!
చాలా ఏళ్లకి వస్తున్న సీక్వెల్ మీద హైప్ ఓ రేంజ్ లో ఉంది. ఓవర్సీస్ లో సినిమా బుకింగ్స్ జోరుగా స్టార్ట్ అయ్యాయి…నార్త్ అమెరికాలో ఆల్ మోస్ట్ 150K డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసిన సినిమా ఓవరాల్ గా ఓవర్సీస్ లో వారం ముందు బుకింగ్స్ తోనే 180K డాలర్స్ మార్క్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ ఇండియన్ కరెన్సీలో సినిమా కి 1.5 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ జరగగా ఓవరాల్ గా బుకింగ్స్ జోరు బాగానే ఉందని చెప్పాలి ఇప్పుడు. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది మేకర్స్ మరింత ప్రమోషన్స్ చేస్తే రీచ్ మరింత పెరిగే అవకాశం ఉన్న సినిమా ఎక్కువగా అయితే మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కాబోతుంది…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
This website uses cookies.