Pawan Kalyan : ఇరు రాష్ట్ర సీఎంల మీటింగ్‌కి పవన్ డుమ్మా కొట్టడం వెనక కారణం ఇదా..!
Pawan Kalyan : ఇటీవల రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు హాజరుకాలేదు. ఈ విషయం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, జనసేన కార్యకర్తల్లోనూ సాగుతోంది. అసలు ఈ సమావేశానికి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం. సమావేశానికి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించినప్పటికీ ఆయన వెళ్లలేదనేది అంటున్నారు. సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రులు పాల్గొనాల్సి ఉంది. ఆ రకంగానే ఏపీ తెలంగాణ నుంచి హాజరయ్యే నేతలు, అధికారుల జాబితాను రూపొందించారు.
అయితే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఏపీ, తెలంగాణ నుంచి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం హాజరుకాలేదు. ఆయన ఎందుకు హాజరుకాలేదని చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ తరపున ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి ఎం. జానకి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా పాల్గొంటారని జాబితా విడుదల చేశారు. అయితే వీరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తప్ప అందరూ సమావేశానికి హాజరయ్యారు.
Pawan Kalyan : ఇరు రాష్ట్ర సీఎంల మీటింగ్‌కి పవన్ డుమ్మా కొట్టడం వెనక కారణం ఇదా..!
అయితే ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరుకాకపోవడం కారణం అమ్మవారి వారాహి దీక్ష శనివారం ముగిసింది. దీక్ష సమయంలో ద్రవ ఆహారమైన పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకునేవారు. అయితే ఈ దీక్ష శనివారంతో ముగిసింది. అదే రోజు ముఖ్యమంత్రులు సమావేశం జరిగింది. అందువల్లనే పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి హాజరుకాలేదని అంటున్నారు. మరో కారణం ఏంటంటే 2014 మార్చి 14న హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ హోటల్‌లో జనసేన పార్టీ పెట్టినప్పుడు నిర్వహించిన సభలో కాంగ్రెస్‌పై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు. రెండు గంటలకుపైగా చేసిన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విమర్శలకే అధిక భాగాన్ని ఉపయోగించారు.”కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో” అంటూ నినదించారు. తాను పార్టీ పెట్టినప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించే పార్టీతో సమావేశం పవన్ కి ఇష్టం లేకే ఆయన సమావేశానికి వెళ్లలేదనే చర్చ నడుస్తుంది.
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
This website uses cookies.