Mahesh – Namrata Marriage : మహేశ్ నమ్రత పెళ్ళికి కృష్ణ ఒప్పుకోకపోతే.. ఇందిరా దేవి ఒప్పించారా?
Mahesh – Namrata Marriage : సెలబ్రిటీల గురించి తెలుసు కదా. వాళ్లు ఏం చేసినా సెన్సేషనే. సెలబ్రిటీల ఇంట్లో చీమ చిటుక్కుమన్నా అది వార్తే. సాధారణంగా సెలబ్రిటీల ఇంట్లోకి, వాళ్ల పర్సనల్ విషయాల్లోకి తొంగిచూడటం అందిరికీ అలవాటే. సెలబ్రిటీల గురించి ఎక్కువగా అందరూ తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే.. సెలబ్రిటీల కుటుంబ సభ్యులు మాత్రం పెద్దగా మీడియా ముందుకు రారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సరదాగా ఏదో పేరుకు పోస్టులు చేస్తుంటారు. కొందరైతే అది కూడా ఉండదు. అసలు.. కొందరు సెలబ్రిటీల తల్లిదండ్రులు ఎలా ఉంటారో కూడా తెలియదు. వాళ్ల భార్యలు, భర్తల గురించి కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఇటీవల మరణించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి కూడా అంతే. తను ఎక్కువగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడేవారు కాదు. అందుకే ఆమె గురించి మీడియాలోనూ వార్తలు ఉండేవి కావు.
చాలా ఏళ్ల తర్వాత మహేశ్ బాబు ద్వారానే తన తల్లి గురించి జనాలకు తెలిసింది. ఏదో ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన తల్లి గురించి చెప్పారు మహేశ్. తనకు సంబంధించిన ఒకటి రెండు ఫోటోలు తప్పితే పెద్దగా బయటికి వచ్చిన పోటోలు కూడా ఏం లేవు. కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరా దేవి ఒంటరిగానే బతికారు. అయితే.. విజయనిర్మలతో పిల్లలను కనవద్దు అని ఇందిరా దేవి దగ్గర మాట తీసుకున్నాకే కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు.
Mahesh – Namrata Marriage : తన ఐదుగురు పిల్లలను తానే స్వయంగా పెంచి పెద్దచేసిన ఇందిరా దేవి
కృష్ణ.. ఎక్కువగా విజయ నిర్మలతో ఉండటం వల్ల.. తన ఐదుగురు పిల్లలను తానే స్వయంగా పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించారు ఇందిరా దేవి. తను ఎక్కువగా తన పిల్లలతోనే గడిపేవారు. వాళ్ల బాధ్యతలను ఆమె చూసుకున్నారు. అలాగే.. అందరికీ దగ్గరుండి పెళ్లి చేసింది ఇందిరా దేవి. కానీ.. మహేశ్ బాబు నమ్రతను ప్రేమించాడని తెలుసుకున్న కృష్ణ మాత్రం వాళ్ల పెళ్లికి ముందు ఒప్పుకోలేదట. నిజానికి వాళ్లు ఇద్దరూ ముంబైలో పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం తెలిసి కృష్ణ చాలా బాధపడ్డారట. తనకు నచ్చిన అమ్మాయిని మహేశ్ బాబుకు ఇచ్చి పెళ్లి చేయాలని కృష్ణ భావించారు. కానీ.. ఇందిరా దేవి.. మహేశ్ బాబు పెళ్లి విషయంలో కృష్ణను ఒప్పించిందట. అలా.. మహేశ్, నమ్రతల వివాహాన్ని కృష్ణ ఒప్పుకున్నారట. మరోవైపు తన పెద్దకొడుకు రమేశ్ బాబు తన కళ్లెదుటే చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఇందిరా దేవి.. అప్పటి నుంచి మానసికంగా కృంగిపోయారు. అనారోగ్యంతో మంచానపడ్డారు. చివరకు అనారోగ్యంతోనే తుది శ్వాస విడిచారు.