Indraja : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో విపరీతంగా ప్రేక్షకాదరణ సంపాదించుకున్న వాటిలో జబర్దస్త్ కార్యక్రమం, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలు ఒకటి అని చెప్పాలి. ఈటీవీలో ముందుగా జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం కాగా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణయితలుగా నాగబాబు రోజా వ్యవహరించేవారు. అయితే రోజా అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి ఇంద్రజ న్యాయ నిర్ణయితగా వచ్చారు.అయితే తిరిగి రోజ ఈ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి న్యాయ నిర్ణయితగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది.
ఇకపోతే రోజాకు మంత్రి పదవి రావడంతో ఈమె పూర్తిగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.రోజా జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడంతో ఆస్థానంలో పర్మనెంట్ జడ్జిగా ఇంద్రజ స్థిరపడ్డారు. ఇలా ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి బయటకు రావడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించగా ఇక్కడ నేను కనిపించి అక్కడ కూడా నేనే కనిపడితే ప్రజలు ఛీ కొడతారు అందుకే వాళ్ళు ఛీకొట్టక ముందే నేనే బయటకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక ఈవారం బోనాల జాతర కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ విధంగా ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి రీఎంట్రీ ఇవ్వడంతో ఇకపై ఈ కార్యక్రమంలో పర్మినెంట్ గా ఉండిపోతారని అందరు భావిస్తున్నారు. మరి ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా పర్మినెంట్ జడ్జిగా ఉంటారా? లేకపోతే ఈ కార్యక్రమం నుంచి తప్పకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.