
Indraja Gets Emotional At Sridevi Drama Company
Indraja : బుల్లితెరపై ఇంద్రజ ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. వెండితెరపై ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అయితే ఇప్పుడు ఇంద్రజ మాత్రం బుల్లితెరపై స్టార్‌గా తన సత్తాను చాటుతోంది. ఇంత వరకు బుల్లితెరపై రోజా క్వీన్‌లా ఉండేది. ఇప్పుడు మంత్రి అవ్వడంతో బుల్లితెరకు దూరం కావాల్సి వచ్చింది. ఇంతలోపే ఇంద్రజ తన స్థానాన్ని పదిల పర్చుకుంది. దీంతో ఇంద్రజ ఇప్పుడు బుల్లితెరపై నెంబర్ వన్ స్థానంలో ఉంది. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, పండుగ ఈవెంట్లు ఇలా అన్నింట్లో సత్తా చాటుతోంది.ఇప్పుడు ఇంద్రజ మల్లెమాల నిర్వహిస్తోన్న షోలకు న్యాయనిర్ణేతగా దిక్కైంది.
అయితే ఆమె ఇప్పటికే ప్రేక్షకుల్లో అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే తాజాగా ఇంద్రజ తన పర్సనల్ లైఫ్‌లోని ఓ విషాదకర ఘటన గురించి చెప్పుకొచ్చింది. ఇంద్రజకు శ్రీదేవీ డ్రామా కంపెనీలో షోలో ఆడియెన్స్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండే మీకు.. చేదు ఘటన ఎదురైన సందర్భం ఉందా? అని అడిగేశారు. దీంతో ఇంద్రజ ఓ విషయాన్ని చెప్పింది.80వ దశకంలో తనకు ఎదురైన ఘటన గురించి చెప్పింది. అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని, ఇళ్లు కట్టుకున్నాను అని చెప్పింది. డబ్బు అంతా కూడా ఆ ఇంటి లోన్ కట్టేందుకే సరిపోయేదని చెప్పింది.
Indraja Gets Emotional At Sridevi Drama Company
పని చేస్తేనే డబ్బులు వచ్చేవి.. వాటికి కట్టేదాన్ని అని చెప్పింది. అయితే ఇంతలో తన తల్లికి హార్ట్ ఎటాక్ వచ్చిందని, చేతిలో డబ్బుల్లేవ్ అని ఆ సమయంలో తెగ ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. అప్పుడు తాను పని చేస్తున్న కంపెనీలో చెక్కులు ఇచ్చారని అంది.అయితే అవి చెక్ బౌన్స్ అయ్యాయని, ఎలాగైనా సరే తల్లిని కాపాడుకోవాలని ఒంటి మీద బంగారం అమ్మేసి, అలా ఏదో ఒకటి చేసి ఆపరేషన్ చేయించాను అంటూ ఇంద్రజ ఎమోషనల్ అయింది. ఆ కష్టాలు తనకు తెలుసని అందుకే ఎవరైనా కష్టంలో ఉంటే సాయం చేస్తానని చెప్పుకొచ్చింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.