Home » Entertainment » Indraja On Hyper Aadi Whatsapp Secrets
Entertainment

Hyper Aadi : హైపర్ ఆది వాట్సప్ సీక్రెట్స్.. పరువుతీసేసిన ఇంద్రజ

Authored By
aruna
The Telugu News | Published on: August 24, 2022, 4:40 pm
Advertisement

Hyper Aadi : బుల్లితెరపై ఈటీవీది ఓ చరిత్ర. గత 27 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. ఇక ఈటీవీలో మల్లెమాలది ఎంతో ప్రత్యేకమైన జర్నీ. మల్లెమాల ఎన్నెన్నో కొత్త కొత్త ప్రోగ్రాంలు చేస్తూ ఈటీవీకి వన్నె తెచ్చింది. ఇప్పుడు ఈటీవీ 27వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త ప్రోగ్రాంను చేసింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఈటీవీ ఆర్టిస్టులు, జబర్దస్త్ కమెడియన్లు, ధారావాహిక తారలు, సినిమా సెలెబ్రిటీలు ఇలా ఎంతో మంది వచ్చారు. సందడి చేశారు. ఇందులో పోసాని కృష్ణమురళీ అందరి మీద పంచులు వేశాడు. ఈటీవీ నాకు జీవితాన్ని ఇచ్చింది.. పెళ్లి చేసింది..

Advertisement

అని హరిత అంటే.. మరి ఈటీవీ వీడికి పెళ్లాన్ని ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రదీప్ మీద కౌంటర్లు వేశాడు పోసాని. ఇక మరో సందర్భంగా యమునతో స్కిట్ చేస్తూ నువ్ నా పెళ్లానివి అంటూ కౌంటర్లు వేస్తాడు. ఇలా ప్రతీ స్కిట్లో పోసాని తన మార్క్ చూపిస్తుంటాడు. అయితే ఆదిని అందరి ముందు ఇరికించే ప్రయత్నం చేశాడు పోసాని. నీ వాట్సప్‌లో ఎంత మంది అమ్మాయిలున్నారో చూపించు అని అడుగుతాడు. దీంతో ఆది తెల్లమొహం వేస్తాడు. ఇంతలో ఇంద్రజ మధ్యలోకి దూరుతుంది. ఆయన్ను అలా అడగొద్దు.. ఆయన ఫోన్‌లో అన్నీ కూడా అమ్మాయిల నంబర్లే ఉంటాయి..

Indraja On Hyper Aadi Whatsapp secrets

Advertisement

ఎక్కైడానా ఒకటో రెండో అబ్బాయిల నంబర్లున్నాయా? అని అడగాలి అంటూ ఇంద్రజ దారుణంగా అనేస్తుంది. దీంతో ఆది మొహం మరింత మాడుతుంది. మొత్తానికి ఆది చుట్టూ అందరూ చేరిపోయారు. ఇందులో ఆది తన పెళ్లి కోసం బాగానే ప్రయత్నించినట్టున్నాడు. ఓ సీరియల్ హీరోయిన్ మీద మనసు పారేసుకున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ ప్రోమోలో ఆది, రాం ప్రసాద్‌ల అల్లరి, కామెడీ అందరినీ ఆకట్టుకుంటోంది. 27వ వార్షికోత్సవం అంటూ చేస్తోన్న భలే మంచి రోజులు ఈవెంట్‌ను బాగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో సుధీర్, అనసూయలు కనిపించడం మాత్రం నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి