Indraja : శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి ఇంద్రజ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అలాంటి నిర్ణయం అంత హఠాత్తుగా ఎందుకు తీసుకున్నదో తెలియడం లేదు. సుధీర్ వెళ్లిపోవడంతోనే ఆమె కూడా వెళ్లిపోయిందనే టాక్ వినిపిస్తుంటుంది. ఇంద్రజ ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగింది. పెళ్లి తరువాత ఇంద్రజ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దిక్కులు చూడకు రామయ్య అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇంద్రజ ఇప్పుడు బుల్లితెరపై ఫుల్ ఫేమ్‌ను సంపాదించుకుంది. మొదట్లో గెస్ట్ జడ్జ్‌గా వచ్చిన ఇంద్రజ చివరకు పర్మనెంట్ జడ్జ్‌గా వచ్చేసింది. రోజాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, హాస్పిటల్ బెడ్డు మీదున్న సమయంలో ఇంద్రజ వచ్చింది.
అప్పుడు వరుసగా ఓ ఐదారు వారాలు కనిపించింది. ఆ సమయంలో రోజా వద్దు ఇంద్రజ ముద్దు అనే స్లోగన్‌లు కూడా వచ్చాయి. అలా ఇంద్రజకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆమె నవ్వుకు అందరూ ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు శ్రీదేవీ డ్రామా కంపెనీ బాధ్యతలను అప్పగించారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు పర్మనెంట్ జడ్జ్‌గా చేశారు. అక్కడ బాగానే మ్యానేజ్ చేసింది ఇంద్రజ. సుధీర్ ఇంద్రజ బాండింగ్ కూడా బాగానే ఆకట్టుకుంది. అయితే సుధీర్ కొంచెం కొంచెంగా మల్లెమాలకు దూరంగా వచ్చేశాడు. ఇప్పుడు మొత్తంగా ఈటీవీ నుంచి దూరంగా పోయాడు.
సుధీర్ వెళ్లడంతో శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి ఇంద్రజ కూడా బయటకు వచ్చేసిందని అంతా అనుకున్నారు. ఇక మరో వైపు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు రోజా దూరమైంది. మంత్రిగా ప్రమోషన్ రావడంతో ఈ షోలను వదిలిపెట్టేసింది. దీంతో ఆ రెండు షోలకు ఇంద్రజ జడ్జ్‌గా ఫిక్స్ అయింది. అయితే శ్రీదేవీ డ్రామా కంపెనీని వదిలివేయడంపై క్లారిటీ ఇచ్చింది. అన్ని చోట్లా నేను కనిపిస్తాను.. ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ చేస్తున్నాను.. ఇంకా శ్రీదేవీ డ్రామా కంపెనీలో కూడా కనిపిస్తే.. జనాలు మళ్లీ చీ కొట్టే అవకాశం ఉంది.. అన్నిచోట్లా ఆమే కనిపిస్తోంది.. అని చీచీ అనిపించుకోవడం కంటే వదిలేయడం బెటర్.. కొత్తదనం కావాలి కదా?.. అంటూ ఇంద్రజ చెప్పుకొచ్చింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.