Indraja : చీ చీ అనిపించుకోవడం కంటే అదే బెటర్.. శ్రీదేవీ డ్రామా కంపెనీపై ఇంద్రజ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Indraja : చీ చీ అనిపించుకోవడం కంటే అదే బెటర్.. శ్రీదేవీ డ్రామా కంపెనీపై ఇంద్రజ కామెంట్స్

Indraja : శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి ఇంద్రజ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అలాంటి నిర్ణయం అంత హఠాత్తుగా ఎందుకు తీసుకున్నదో తెలియడం లేదు. సుధీర్ వెళ్లిపోవడంతోనే ఆమె కూడా వెళ్లిపోయిందనే టాక్ వినిపిస్తుంటుంది. ఇంద్రజ ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగింది. పెళ్లి తరువాత ఇంద్రజ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దిక్కులు చూడకు రామయ్య అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇంద్రజ ఇప్పుడు బుల్లితెరపై ఫుల్ ఫేమ్‌ను సంపాదించుకుంది. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 July 2022,12:30 pm

Indraja : శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి ఇంద్రజ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అలాంటి నిర్ణయం అంత హఠాత్తుగా ఎందుకు తీసుకున్నదో తెలియడం లేదు. సుధీర్ వెళ్లిపోవడంతోనే ఆమె కూడా వెళ్లిపోయిందనే టాక్ వినిపిస్తుంటుంది. ఇంద్రజ ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగింది. పెళ్లి తరువాత ఇంద్రజ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దిక్కులు చూడకు రామయ్య అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇంద్రజ ఇప్పుడు బుల్లితెరపై ఫుల్ ఫేమ్‌ను సంపాదించుకుంది. మొదట్లో గెస్ట్ జడ్జ్‌గా వచ్చిన ఇంద్రజ చివరకు పర్మనెంట్ జడ్జ్‌గా వచ్చేసింది. రోజాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, హాస్పిటల్ బెడ్డు మీదున్న సమయంలో ఇంద్రజ వచ్చింది.

అప్పుడు వరుసగా ఓ ఐదారు వారాలు కనిపించింది. ఆ సమయంలో రోజా వద్దు ఇంద్రజ ముద్దు అనే స్లోగన్‌లు కూడా వచ్చాయి. అలా ఇంద్రజకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆమె నవ్వుకు అందరూ ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు శ్రీదేవీ డ్రామా కంపెనీ బాధ్యతలను అప్పగించారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు పర్మనెంట్ జడ్జ్‌గా చేశారు. అక్కడ బాగానే మ్యానేజ్ చేసింది ఇంద్రజ. సుధీర్ ఇంద్రజ బాండింగ్ కూడా బాగానే ఆకట్టుకుంది. అయితే సుధీర్ కొంచెం కొంచెంగా మల్లెమాలకు దూరంగా వచ్చేశాడు. ఇప్పుడు మొత్తంగా ఈటీవీ నుంచి దూరంగా పోయాడు.

Indraja Reveals Quitting Sridevi Drama Company

Indraja Reveals Quitting Sridevi Drama Company

సుధీర్ వెళ్లడంతో శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి ఇంద్రజ కూడా బయటకు వచ్చేసిందని అంతా అనుకున్నారు. ఇక మరో వైపు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు రోజా దూరమైంది. మంత్రిగా ప్రమోషన్ రావడంతో ఈ షోలను వదిలిపెట్టేసింది. దీంతో ఆ రెండు షోలకు ఇంద్రజ జడ్జ్‌గా ఫిక్స్ అయింది. అయితే శ్రీదేవీ డ్రామా కంపెనీని వదిలివేయడంపై క్లారిటీ ఇచ్చింది. అన్ని చోట్లా నేను కనిపిస్తాను.. ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ చేస్తున్నాను.. ఇంకా శ్రీదేవీ డ్రామా కంపెనీలో కూడా కనిపిస్తే.. జనాలు మళ్లీ చీ కొట్టే అవకాశం ఉంది.. అన్నిచోట్లా ఆమే కనిపిస్తోంది.. అని చీచీ అనిపించుకోవడం కంటే వదిలేయడం బెటర్.. కొత్తదనం కావాలి కదా?.. అంటూ ఇంద్రజ చెప్పుకొచ్చింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది