Ileana : హీరోయిన్ కడుపు గురించి ఇండస్ట్రీ మొత్తం డిస్కషన్… తండ్రి ఎవరో ఇప్పటికీ తెలీదు !

Authored By Breaking News | The Telugu News | Published on: July 17, 2023, 4:00 pm

Ileana : గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలామంది టాప్ హీరోల సరసన నటించింది. “దేవదాసు” సినిమాతో తెలుగు తెర పై హీరోయిన్ గా జర్నీ స్టార్ట్ చేసిన ఇలియానా రెండో సినిమా “పోకిరి” తోనే ఇండస్ట్రీ హిట్ అందుకుంది. పోకిరి విజయంతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోలతో నటించి అప్పట్లో బిజీ హీరోయిన్ గా చేతినిండా అవకాశాలతో దూసుకుపోయింది. కానీ ప్రజెంట్ అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

Ileana: మొదటి సారి ప్రియుడి ఫొటోలు షేర్‌ చేసిన ఇలియానా | ileana finally  shares pictures of her boyfriend

సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్న ఇలియానా తన వ్యక్తిగత విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంది. ఈ క్రమంలో పెళ్లి అవకుండానే తాను తల్లి అయినట్లు అధికారికంగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. దీంతో ఇలియానా భర్త ఎవరు అన్నదానిపై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ గా మారింది. ఇలియానా కడుపులో ఉన్న బిడ్డకు ఎవరు తండ్రి అన్న చర్చ బాగా జరుగుతుంది. ఈ క్రమంలో ఇలియానా మాత్రం ఆ అజ్ఞాత వ్యక్తిని రహస్యంగా ఉంచుతూ అందరిలో సస్పెన్స్ ఉండేలా చేస్తూ ఉంది.

ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలు కూడా తెలియకుండానే.. గర్భవతిగా తన అనుభవాలు మరియు బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె 9వ నెలలో అడుగుపెట్టడంతో.. చాలా ఇబ్బందిగా మరియు నీరసంగా ఉన్నట్లు.. ఒక పోస్టును షేర్ చేసింది. దీంతో అసలు హీరోయిన్ ఇలియానా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో అనే డిస్కషన్ ఇండస్ట్రీలో సైతం జరుగుతోంది. అయినా గాని ఇలియానా ఆమె అతను ఎవరో ఇప్పటికీ చెప్పలేదు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp