Prabhas : ప్రభాస్ సొంత అన్న సినిమాల్లోకి ఎందుకు రాలేదు.. అసలు ఆయన ఏం చేస్తాడు?

Authored By Tech Desk | The Telugu News | Published on: October 2, 2022, 12:30 pm

Prabhas : రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడుగా ఆయన తమ్ముడి కొడుకు అయినా ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ ని తన నట వారసుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన కృష్ణంరాజు ఎందుకు తన తమ్ముడు పెద్ద కొడుకు అయినా ప్రబోధ్‌ ను హీరోగా పరిచయం చేయలేదు అంటూ ఇప్పుడు ప్రచారం మొదలైంది. ఇన్నాళ్లు ప్రభాస్ కి ఒక అన్నయ్య ఉన్నాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇటీవల కృష్ణంరాజు  చనిపోయిన సమయంలోనే ప్రభాస్ యొక్క సోదరుడు ప్రబోధ్‌ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగబోతున్నాయని వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే ప్రబోధ్‌ ఎలా ఉంటాడు అనే విషయం చాలా మందికి బయటికి వచ్చింది.

ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ప్రబోధ్‌ అసలు ఏం చేస్తాడు.. సినిమాల్లో ఎందుకు రాలేదు అంటూ చర్చలు జరుగుతున్నాయి. ప్రబోధ్‌ కి చిన్నప్పటి నుండే వ్యాపారంపై మక్కువ.. అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. కృష్ణంరాజు అప్పట్లో అడిగినా కూడా హీరోగా నటించేందుకు ఆసక్తి చూపించని ప్రబోధ్‌ సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపించలేదట. ప్రభాస్ సన్నిహితులు యూవీ క్రియేషన్స్ మొదలు పెట్టిన సమయంలో ప్రబోధ్‌ ని కూడా భాగస్వామిగా అనుకున్నారట.. కానీ ఆయన మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చాడట. అందుకే మీడియా ముందుకు కూడా ప్రబోధ్‌ ఎప్పుడూ రాడు.

interesting facts about prabhas brother prabhodh

interesting facts about prabhas brother prabhodh

ఆ మధ్య తండ్రి చనిపోయిన సమయంలో కూడా ప్రబోధ్‌ గురించి ఎక్కువ మందికి తెలియలేదు. ఇన్నాళ్లకు ప్రభాస్ కి జాతీయ స్థాయిలో ఇమేజ్ వచ్చిన కారణంగా ఆయన అన్న ప్రబోధ్‌ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ప్రబోధ్‌ ముందు ముందు అయినా సినిమాల్లో లేదా మరి ఏదైనా ఎంటర్టైన్మెంట్ రంగంలో కనిపిస్తాడా అంటే కచ్చితంగా లేదని సన్నిహితులు అంటున్నారు. కానీ ప్రబోధ్‌ కి రాజకీయాలంటే ఆసక్తి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో కృష్ణంరాజు కి ఉన్న రాజకీయ నేపథ్యంతో ప్రబోధ్‌ రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు రాజకీయ వారసుడిగా ప్రబోధ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆశ్చర్యం లేదు.

Tech Desk

No bio available for this author.

  1. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  2. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  3. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  4. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  5. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  6. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  7. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp