Prabhas : రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడుగా ఆయన తమ్ముడి కొడుకు అయినా ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ ని తన నట వారసుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన కృష్ణంరాజు ఎందుకు తన తమ్ముడు పెద్ద కొడుకు అయినా ప్రబోధ్ ను హీరోగా పరిచయం చేయలేదు అంటూ ఇప్పుడు ప్రచారం మొదలైంది. ఇన్నాళ్లు ప్రభాస్ కి ఒక అన్నయ్య ఉన్నాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇటీవల కృష్ణంరాజు చనిపోయిన సమయంలోనే ప్రభాస్ యొక్క సోదరుడు ప్రబోధ్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగబోతున్నాయని వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే ప్రబోధ్ ఎలా ఉంటాడు అనే విషయం చాలా మందికి బయటికి వచ్చింది.
ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ప్రబోధ్ అసలు ఏం చేస్తాడు.. సినిమాల్లో ఎందుకు రాలేదు అంటూ చర్చలు జరుగుతున్నాయి. ప్రబోధ్ కి చిన్నప్పటి నుండే వ్యాపారంపై మక్కువ.. అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. కృష్ణంరాజు అప్పట్లో అడిగినా కూడా హీరోగా నటించేందుకు ఆసక్తి చూపించని ప్రబోధ్ సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపించలేదట. ప్రభాస్ సన్నిహితులు యూవీ క్రియేషన్స్ మొదలు పెట్టిన సమయంలో ప్రబోధ్ ని కూడా భాగస్వామిగా అనుకున్నారట.. కానీ ఆయన మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చాడట. అందుకే మీడియా ముందుకు కూడా ప్రబోధ్ ఎప్పుడూ రాడు.
ఆ మధ్య తండ్రి చనిపోయిన సమయంలో కూడా ప్రబోధ్ గురించి ఎక్కువ మందికి తెలియలేదు. ఇన్నాళ్లకు ప్రభాస్ కి జాతీయ స్థాయిలో ఇమేజ్ వచ్చిన కారణంగా ఆయన అన్న ప్రబోధ్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ప్రబోధ్ ముందు ముందు అయినా సినిమాల్లో లేదా మరి ఏదైనా ఎంటర్టైన్మెంట్ రంగంలో కనిపిస్తాడా అంటే కచ్చితంగా లేదని సన్నిహితులు అంటున్నారు. కానీ ప్రబోధ్ కి రాజకీయాలంటే ఆసక్తి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో కృష్ణంరాజు కి ఉన్న రాజకీయ నేపథ్యంతో ప్రబోధ్ రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు రాజకీయ వారసుడిగా ప్రబోధ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆశ్చర్యం లేదు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.