Senior NTR : తెలుగు తెరపై పౌరాణిక కథల పాత్రలకు జీవం పోసిన నటుల్లో సీనియర్ ఎన్టీఆర్ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన పట్ల ఆయనకు ఎంత మక్కువో నేటికీ ఎన్నో సినిమాల్లో మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ఆయన తీసిన పలు భక్తిరస చిత్రాలు నేటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. రాముడైనా, రావణుడైనా నటించి మెప్పించగల సత్తా ఆయనకే చెల్లింది. ఓ పక్కా కమర్షియల్‌గా సినిమాలు చేస్తూనే.. మరోపక్కా పౌరాణిక చిత్రాలను చేస్తూ ఎన్నో సూపర్ హిట్లను ఆయన కథలో వేసుకున్నారు. శ్రీ కృష్ణ తులాభారం చిత్రం తర్వాత.. అసలు కృష్ణ భగవానుడు ఇలాగే ఉండేవార అని అనిపించక మానదు. ఏ పాత్ర నచ్చినా.. వెంటనే నిర్మాతలను ఒప్పించి మొండి ధైర్యంతో ఆ చిత్రాన్ని మొదలు పెట్టేవారట.
అయితే ఒక చిత్రం మాత్రం.. అంతగా ఆడదు అని తెలిసినా, ఆ చిత్రాన్ని పూర్తి చేశారట ఎన్టీఆర్. అయితే సినిమాలో నటన పరంగా ఆయనకు ఎంత పేరొచ్చినా, కమర్షియల్ గా సినిమా సక్సెస్ కాలేదు.అప్పటికే పురాణ కథల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కు.. ఓసారి శ్రీనాథుడి కథపై మనసు పడిందట. ఇదే విషయమై.. ఆయన అప్పట్లో ఫుల్ ఫామ్ లో ఉన్న బాపు, రమణ గారిని కలిసి తన మనసులో మాటను వారికి చెప్పారట. అయితే శ్రీనాథుడి కథ గురించి ప్రజలకు అంతగా అవగాహన లేదని అది సినిమాగా తెరకెక్కిస్తే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని వారు సీనియర్ ఎన్టీఆర్ కు సూచించారట.
అయితే ఆయన మాత్రం, ఆర్థిక నష్టాలు వచ్చినా సరే, సినిమా జనాల్లోకి తప్పక వెళ్ళాలి అని నిర్ణయించుకున్నట్లు తెలిపారట. సినిమా చూసి కొందరైనా తృప్తి పడినా చాలు అంటూ శ్రీనాథుడి పాత్ర ధరించాలన్నదే తన కోరిక అని తేల్చి చెప్పారట. ఇక వెంటనే బాపు దర్శకత్వంలో ఎన్టీఆర్ – జయసుధ జంటగా శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా తెరకెక్కించారట. కె వి మహదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు మంచి పేరు వచ్చింది. ఆ పాత్ర. ధరించాలన్న ఆయన కోరిక కూడా నెరవేరింది. అయితే ఆ సినిమా మాత్రం బాపు – రమణ ముందుగా చెప్పినట్లే కమర్షియల్ గా అంత సక్సెస్ అవ్వలేదంట.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.