Senior NTR : ఆ సినిమా ఆడదు అని తెలిసి కూడా సీనియర్ ఎన్టీఆర్ చేసినా చిత్రం ఏంటో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Senior NTR : ఆ సినిమా ఆడదు అని తెలిసి కూడా సీనియర్ ఎన్టీఆర్ చేసినా చిత్రం ఏంటో తెలుసా..?

Senior NTR : తెలుగు తెరపై పౌరాణిక కథల పాత్రలకు జీవం పోసిన నటుల్లో సీనియర్ ఎన్టీఆర్ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన పట్ల ఆయనకు ఎంత మక్కువో నేటికీ ఎన్నో సినిమాల్లో మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ఆయన తీసిన పలు భక్తిరస చిత్రాలు నేటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. రాముడైనా, రావణుడైనా నటించి మెప్పించగల సత్తా ఆయనకే చెల్లింది. ఓ పక్కా కమర్షియల్‌గా సినిమాలు చేస్తూనే.. మరోపక్కా పౌరాణిక చిత్రాలను […]

 Authored By kranthi | The Telugu News | Updated on :17 February 2022,6:00 am

Senior NTR : తెలుగు తెరపై పౌరాణిక కథల పాత్రలకు జీవం పోసిన నటుల్లో సీనియర్ ఎన్టీఆర్ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన పట్ల ఆయనకు ఎంత మక్కువో నేటికీ ఎన్నో సినిమాల్లో మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ఆయన తీసిన పలు భక్తిరస చిత్రాలు నేటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. రాముడైనా, రావణుడైనా నటించి మెప్పించగల సత్తా ఆయనకే చెల్లింది. ఓ పక్కా కమర్షియల్‌గా సినిమాలు చేస్తూనే.. మరోపక్కా పౌరాణిక చిత్రాలను చేస్తూ ఎన్నో సూపర్ హిట్లను ఆయన కథలో వేసుకున్నారు. శ్రీ కృష్ణ తులాభారం చిత్రం తర్వాత.. అసలు కృష్ణ భగవానుడు ఇలాగే ఉండేవార అని అనిపించక మానదు. ఏ పాత్ర నచ్చినా.. వెంటనే నిర్మాతలను ఒప్పించి మొండి ధైర్యంతో ఆ చిత్రాన్ని మొదలు పెట్టేవారట.

అయితే ఒక చిత్రం మాత్రం.. అంతగా ఆడదు అని తెలిసినా, ఆ చిత్రాన్ని పూర్తి చేశారట ఎన్టీఆర్. అయితే సినిమాలో నటన పరంగా ఆయనకు ఎంత పేరొచ్చినా, కమర్షియల్ గా సినిమా సక్సెస్ కాలేదు.అప్పటికే పురాణ కథల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కు.. ఓసారి శ్రీనాథుడి కథపై మనసు పడిందట. ఇదే విషయమై.. ఆయన అప్పట్లో ఫుల్ ఫామ్ లో ఉన్న బాపు, రమణ గారిని కలిసి తన మనసులో మాటను వారికి చెప్పారట. అయితే శ్రీనాథుడి కథ గురించి ప్రజలకు అంతగా అవగాహన లేదని అది సినిమాగా తెరకెక్కిస్తే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని వారు సీనియర్ ఎన్టీఆర్​ కు సూచించారట.

interesting facts about senior Ntr mythological movie shree nadhudu

interesting facts about senior Ntr mythological movie shree nadhudu

Senior NTR : కమర్షియల్ సక్సెస్ అవ్వదని ముందే తెలిసినా..!

అయితే ఆయన మాత్రం, ఆర్థిక నష్టాలు వచ్చినా సరే, సినిమా జనాల్లోకి తప్పక వెళ్ళాలి అని నిర్ణయించుకున్నట్లు తెలిపారట. సినిమా చూసి కొందరైనా తృప్తి పడినా చాలు అంటూ శ్రీనాథుడి పాత్ర ధరించాలన్నదే తన కోరిక అని తేల్చి చెప్పారట. ఇక వెంటనే బాపు దర్శకత్వంలో ఎన్టీఆర్ – జయసుధ జంటగా శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా తెరకెక్కించారట. కె వి మహదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు మంచి పేరు వచ్చింది. ఆ పాత్ర. ధరించాలన్న ఆయన కోరిక కూడా నెరవేరింది. అయితే ఆ సినిమా మాత్రం బాపు – రమణ ముందుగా చెప్పినట్లే కమర్షియల్ గా అంత సక్సెస్ అవ్వలేదంట.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది