Home » Entertainment » Intinit Gruhalakshmi 25 November 2021 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 25 Nov Today Episode : తులసికి క్యాన్సర్… అందరూ షాక్.. లాస్య విషయంలో నందు షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Published on: November 25, 2021, 11:20 am
Advertisement

Intinti Gruhalakshmi 25 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 నవంబర్ 2021, గురువారం 486 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు మీకో గుడ్ న్యూస్ చెప్పాలి అంటుంది లాస్య. ఏంటది అని అంటాడు నందు. ఇంతకుముందే పంతులుగారితో మాట్లాడాను. రేపు మంచి ముహూర్తం ఉంది అన్నాడు అంటుంది లాస్య. అదేంటి.. అంత సడెన్ గా. ఎందుకు ఇంత తొందరగా పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. కొన్ని రోజులు పెళ్లిని పక్కన పెడదాం.. అంటాడు నందు.కానీ.. లాస్య వినదు. పరందామయ్యతో నువ్వు అన్న మాటలు నేను విన్నాను అంటుంది లాస్య. నాన్నతో డిస్కస్ చేసింది లాస్య వినేసింది అన్నమాట.. అనుకొని ఆ మాట విన్నదానివి మా నాన్నగారితో జరిగిన డిస్కసన్ మొత్తం విన్నావు కదా అంటాడు నందు.

Advertisement

intinit gruhalakshmi 25 november 2021 full episode

మీ నాన్న గారికి ఉన్న క్లారిటీ కూడా నీకు లేదు అంటుంది లాస్య. నువ్వు అలా చెప్పడం నాకు నచ్చడం లేదు నందు. రేపే మన పెళ్లి జరిగిపోవాలి నందు అంటుంది లాస్య. అదేమన్నా ఆటా అంటాడు నందు. నువ్వు మాత్రం దాన్ని ఆటలాగే చూస్తున్నావు అంటుంది లాస్య.రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్లి జరగాల్సిందే అంటుంది లాస్య. దీంతో రేపు మన పెళ్లి జరిగే ప్రసక్తే లేదు అంటాడు నందు. ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు. సరే అయితే నా ఇష్టం వచ్చినట్టే చేసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య.మరోవైపు తులసి, లక్కీ.. ఇద్దరూ కలిసి సరదాగా ఉంటారు. తులసి.. లక్కీకి కథలు చెబుతూ ఉంటుంది. ఇంతలో లాస్య వస్తుంది. పదా.. అంటూ లక్కీని తీసుకెళ్తుంది. మరోవైపు ఛీ.. ఈ పాడు బతుకు మీద విరక్తి వస్తోంది. ఈ ఇంట్లో ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు.. అంటూ తనకు తానే బాధపడతాడు నందు.

Advertisement

లక్కీని తీసుకొచ్చి రూమ్ లో పడేస్తుంది లాస్య. బ్యాగులో బట్టలు సర్దుతుంది. ఏడుస్తూ ఉంటే లక్కీ బయపడతాడు. నా జీవితంలో నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు.. నా లైఫ్ నే కాదు.. నీ లైఫ్ ను కూడా నాశనం చేశాయి. నన్ను నమ్ముకున్న వాళ్లు నన్ను మోసం చేశారు. నేను నిన్ను మోసం చేశాను.. అని ఏడుస్తుంది లాస్య.

Intinti Gruhalakshmi 25 Nov Today Episode : కొడుకుతో సహా ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్ధం అయిన లాస్య

లాస్య.. బ్యాగు, లక్కీని తీసుకొని బయటికి వచ్చేస్తుంది. తులసి చూసి.. లాస్య ఏమైంది అంటుంది. నువ్వే గెలిచావు తులసి. నువ్వు అనుకున్నదే జరిగింది కదా.. అంటుంది. ఆగు లాస్య.. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు.. అంటుంది తులసి.

Advertisement

నేను నిన్ను పెళ్లి చేసుకోను. నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు నందు అంటుంది లాస్య. నందు వల్ల మేము అనాథలుగా మిగిలిపోయాం. నడి రోడ్డు మీద మమ్మల్ని నిలబెట్టాడు.. అంటుంది లాస్య. అలా అనకూడదు ఆయన అంటుంది తులసి. అలా.. నందు అనడానికి కారణం నువ్వే అంటుంది లాస్య.

నన్ను నమ్ము లాస్య. మీ పెళ్లి నేను జరిపిస్తాను. నా జీవితంలో నందు ఎప్పుడూ ఉండడు అంటుంది తులసి. నీ మాటలు వింటుంటే నాకు జీవితం మీద మళ్లీ ఆశ కలుగుతోంది.. నీ మాట నమ్మి ఈ ఇంట్లో అడుగు పెడతాను అంటుంది లాస్య. నన్ను నమ్మిన వాళ్లన నేను ఏనాడూ మోసం చేయను.. లోపలికి వెళ్లు అంటుంది తులసి.

మరోవైపు తులసి.. నందు దగ్గరికి వెళ్తుంది. వచ్చిన విషయం ఏంటో చెప్పు అంటుంది. లాస్య పెళ్లి విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను అంటుంది. మీరు లాస్యను పెళ్లి చేసుకోవాలి అంటుంది తులసి. నా పెళ్లి విషయం నీకు సంబంధం లేదు అంటాడు నందు.

పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చి.. ఎందుకు తప్పారు. లాస్యను పెళ్లి చేసుకోండి.. అంటే నేను ఇప్పుడు మాట్లాడలేను.. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు నందు. ఇలా మాట్లాడటానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా.. అంటుంది తులసి. అనిపించడం లేదు. మిమ్మల్ని అందరినీ వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోతా అంటాడు నందు. ఇంతలో తులసి కింద పడిపోతుంది. తనను ఆసుపత్రికి తీసుకెళ్తారు. తనకు గర్భాశయంలో పుండు అయిందని చెబుతారు డాక్టర్లు. అంటే క్యాన్సరా అని అడుగుతారు. దీంతో అవునని చెబుతారు డాక్టర్లు. దీంతో ఏం చేయాలో తెలియదు. అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి