Drushyam 2 Movie Review : తెలుగులో విక్టరీ వెంకటేశ్, మీనా హీరో హీరోయిన్లుగా చాలా కాలం తర్వాత వచ్చిన మూవీ ‘దృశ్యం’. క్రైం, సస్పెన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి కంటిన్యూ పార్ట్ -2 మళయాలంలో ‘దృశ్యం -2’విడుదలైన గ్రాండ్ విక్టరీ కొట్టింది. అదే సినిమాను దర్శకుడు తెలుగులోనూ తెరకెక్కించారు. పాత నటీనటులే ఇందులోనూ కనిపించారు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్ ఫాం అయినా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతమేర ఆకట్టుకుందో ఇప్పుడు చూసేద్దాం..
దృశ్యం-2 మూవీలో హీరోగా వెంకటేష్, హీరోయిన్‌గా మీనా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నరేష్, నదియా, సంపత్ రాజ్, తనికెళ్ల భరణి, జయ కుమార్, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. డి. సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి, ఆంటోని పెరంబవూర్ లు నిర్మాతలు కాగా, జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.దృశ్యం సినిమా మళయాలం రీమెక్. అక్కడ మోహన్‌లాల్, మీనా నటీనటులుగా 2013లో ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అన్ని భాషల్లోకి అనువదించగా అన్నిచోట్లా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక కథ విషయానికొస్తే ఫస్ట్ పార్ట్‌లో ఎక్కడైతే మూవీ అయిపోతుందో..
అక్కడి నుంచి రెండో పార్ట్ స్టార్ట్ అవుతుంది. తన కూతురిని లైంగికంగా వేధిస్తున్న వరుణ్ హత్యను రాంబాబు తెలివిగా డీల్ చేస్తాడు. శశాన్ని పోలీస్‌స్టేషన్‌లోనే పూడ్చి ఎవరికీ తెలీకుండా చేస్తాడు వెంకీ.. ఇక తన కొడుకు కోసం నదియా, నరేశ్ ఆరేళ్లుగా ఎదురుచూస్తుంటారు. కంటిన్యూ పార్ట్‌లో కొత్తగా వచ్చిన ఓ పోలీస్ అధికారికి ఈ కేసు అప్పగించగా అతను రాంబాబు (వెంకీ)కి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు సేకరిస్తాడు. ఇక్కడి నుంచి మళ్లీ రెండో భాగం ప్రారంభమవుతుంది. అయితే, ఈ కేసు నుంచి తన భార్య, పిల్లలను రాంబాబు ఎలా భయపడ్డాడనేది దృశ్యం-2 స్టోరీ..
ఇప్పటికే మళయాలంలో గ్రాండ్ విక్టరీ కొట్టిన దృశ్యం-2ను దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు. అయితే, సినిమా ప్రారంభంలో మొదట కొంత భాగం చాలా బోరింగ్ ఉంటుంది. నెమ్మదిగా కథనం సాగుతుంది. 40 నిమిషాలు గడిచాక కథనంలో స్పీడ్, ట్విస్టులు మొదలవుతాయి. ‘దృశ్యం 2’లో కూడా చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. జీతూ జోసెఫ్ రెండో పార్ట్కు కూడా మంచి సీన్స్, స్క్రీన్ ప్లేను సమకూర్చుకున్నాడు. రెండో భాగం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ‘దృశ్యం 2’లో టెక్నికల్ టీం పనితరం బాగా కనపడింది. కెమెరామెన్ సతీష్ కురూప్ అద్భుతం దృశ్యాలను ఆవిష్కరించారు.
చివరగా ఈ సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల యాక్టింగ్, కెమెరా మెన్ పనితనం ప్లస్ అవ్వగా.. మొదటి భాగం కొంత నెమ్మదించడం, అక్కడక్కడ సస్పెన్స్ లోపించడం మైనస్.. మొత్తం దృశ్యం -2కు మేము ఇచ్చే రేటింగ్ 3/5….
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.