intinti gruhalakshmi 06 january 2023 full episode
Intinti Gruhalakshmi 6 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 జనవరి 2023, శుక్రవారం ఎపిసోడ్ 835 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సొంత ఇంట్లోనే జైలులో బతుకుతున్నట్టు బతుకుతున్నాం. తాతయ్య గారికి షుగర్ డౌన్ అయినప్పుడు చెక్కర కావాలన్నా రాక్స్ కీ ఇవ్వలేదు. తాతయ్య, అమ్మమ్మ.. ఇద్దరూ రోజూ డికాషన్ తాగుతున్నారు. ఫ్రిడ్జ్ కి కూడా తాళం వేసింది.. అంటూ లాస్య గురించి అంకిత, శృతి, దివ్య చెబుతారు. దీంతో నందుకు కోపం వస్తుంది. తప్పు మీదే.. తప్పు మీ నుంచే ఉంది అని తులసి చెబుతుంది. అంతా బాగానే ఉందనుకున్నా కానీ.. ఇంత జరుగుతుందని నాకు తెలియదు అంటాడు నందు. మీకు ఈ విషయం చెప్పకుండా తాతయ్య మా నోళ్లు నొక్కేశాడు అంటాడు ప్రేమ్. ఏదో ఒకరోజు మీకు ఇవన్నీ తెలుస్తాయని వాళ్లు ఊరుకున్నారు అంటుంది తులసి.
intinti gruhalakshmi 06 january 2023 full episode
ఇవన్నీ నాకు కూడా తెలియలేదు. పరోక్షంగా తెలుసుకున్నా. అందుకే నా వాళ్లు ఇక నుంచి అలాంటి కష్టాలు పడకూడదు. అందుకే ఇవన్నీ తీసుకొచ్చా. ఈ ఇంటి పెద్దగా మీరు మీ బాధ్యతను ఫెయిల్ అయినన్ని రోజులు నేను ఈ ఇంటి విషయాలను పట్టించుకుంటూనే ఉంటాను. వాళ్లకు అన్నీ తీసుకొస్తాను. నా వాళ్లను కష్టపెడితే మాత్రం చూస్తూ ఊరుకోను.. అంటూ నందుతో అంటుంది తులసి. కోపంతో నందు అక్కడి నుంచి పైకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఈరోజు నుంచి ఈ ఇంట్లో నా వాళ్లు ఎవరూ బాధపడటానికి వీలు లేదు అంటుంది తులసి. ఆ తర్వాత సరుకులు అన్నీ తెచ్చి వాళ్లకు ఇస్తుంది. శృతి నీకోసం పుల్లటి మామిడి కాయలు తీసుకొచ్చా అంటుంది తులసి.
మరోవైపు నందు టెర్రస్ మీదికి వెళ్లి చిరాకు పడతాడు. దీంతో లాస్య వస్తుంది. నందు.. అంటూ మాట్లాడబోగా.. షటప్ అంటాడు నందు. నాతో మాట్లాడుకు. కాసేపు నా కళ్ల ముందు కనబడకు. గెట్ అవుట్ అంటాడు. నేను చెప్పేది కూడా ఒకసారి విను అంటే అస్సలు వినడు.
నా వాళ్లను నా ఇంటికి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడ్డాను. తులసి ముందు కూడా నిలబడి చేతులు కట్టుకున్నాను. నా వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటా అని మాటిచ్చాను. కానీ.. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అనేది నాకు కావాలి అంటాడు.
వంటింట్లో ర్యాక్స్ కు, ఫ్రిడ్జ్ కు తాళం వేశావా లేదా? తిండి విషయంలో, కాఫీ విషయంలో రిస్ట్రిక్ట్ పెట్టడానికి నువ్వు ఎవరు. హవ్ డేర్ యూ.. నిన్ను గదిలో పడేసి వారం రోజులు తిండి తిప్పలు లేకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు.. అని లాస్యపై సీరియస్ అవుతాడు నందు.
నా ఇంట్లో నా వాళ్లకు తులసి సరుకులు తెచ్చి ఇస్తోంది. అది నీ చేతకానితనం వల్లనే అంటూ తులసి చెప్పుకొచ్చింది. నా వాళ్ల ముందు ఇంకా ఎలా తలెత్తుకొని నిలబడాలి అంటాడు నందు. దీంతో అసలు నేను చెప్పేది విను నందు అంటుంది. పిల్లల చాలీచాలని జీతంతో ఇంటిని నడిపించాలి కదా. అందుకే తప్పని సరై నియంతలా మారాను అంటుంది లాస్య.
ఫ్యామిలీ మంచి కోసమే అని అనుకొని చెడ్డదాన్ని అనిపించుకోవడానికి డిసైడ్ అయ్యాను అంటుంది లాస్య. వాళ్లు ఏదో అన్నారని నేను బాధపడటం లేదు. చివరకు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. అందుకే నా బతుకు మీద నాకు విరక్తి పుడుతోంది నందు అంటుంది లాస్య.
మనం ఆటల పాలు కాకూడదనే ఇలా చేశా తప్పితే… ఎవరి మీద కోపంతో కాదు. అత్తయ్య, మామయ్య పట్ల నాకు బాధ్యత ఉంది. నా ప్రవర్తన హార్ష్ గా ఉండొచ్చు కానీ.. నా ఆలోచనలు సాఫ్ట్ గా ఉన్నాయి నందు అంటుంది లాస్య. కట్ చేస్తే నేను మీ అబ్బాయితో కలిసి ఉండమన్నాను కానీ.. కష్టపడమనలేదు కదా అంటుంది తులసి.
నాకు ఈ విషయాలన్నీ చెప్పాలి కదా మామయ్య అంటుంది తులసి. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంచానని కోపమా అంటుంది తులసి. ఇంకొకరికి బరువుగా మారి బతుకుతున్న జీవితాలు మావి. ఒకరి మీద కంప్లయింట్ ఇచ్చే వయసు కాదు మాది అంటాడు పరందామయ్య.
ఆ తర్వాత తులసి తన ఇంటికి వెళ్తుంది.. తనకు కళ్లు తిరగినట్టుగా అవుతుంటే కాసిన్ని మంచినీళ్లు తాగుతుంది. ఇంతలో సామ్రాట్ కాల్ చేస్తాడు. దీంతో నేనే మీకు కాల్ చేద్దామని అనుకుంటున్నా అంటుంది తులసి. ఇంతకుముందే తెలిసింది. బెనర్జీ ప్రాజెక్ట్ ను లాస్య, నందు టేకప్ చేయబోతున్నారు అని చెబుతాడు సామ్రాట్.
దీంతో వాళ్లకు అసలు ఈ లైన్ లో ఏం అనుభవం ఉందని ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటుంది. ఆ ప్రాజెక్ట్ తీసుకోవద్దని బెనర్జీ ఫ్రాడ్ అని నేను నచ్చచెప్పుతాను అంటుంది తులసి. మరోవైపు నందుకు బెనర్జీ ప్రాజెక్ట్ గురించి చెబుతుంది లాస్య. మన కంపెనీ లాంచ్ కు కూడా ఆయన ఫండింగ్ ఇస్తా అన్నారు అని చెబుతుంది లాస్య. బెనర్జీ ప్రాజెక్ట్ గురించి నందుకు లాస్య చెబుతుండగానే తులసి అక్కడికి వస్తుంది.
బెనర్జీ మోసగాడని నందు, లాస్యకు చెబుతుంది తులసి. కానీ వాళ్లు వినరు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.