Crime News : మనిషి జీవితం ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నిజానికి మనకు ఉండేది ఒకటే జీవితం. కానీ.. ఈ జీవితానికి ఎన్నో సమస్యలు. సుఖం కంటే సంతోషం కంటే ఎక్కువగా కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. దీంతో ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు. జీవితం అనగానే సంతోషాలు మాత్రమే కాదు.. బాధలను కూడా అనుభవించాలి. ఆ బాధలను మేము పడలేం అని చెప్పి చివరకు జీవితాన్ని ముగించేసుకోకూడదు.
కానీ.. చాలామంది జీవితాన్ని ఈదలేక తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నారు. అలా తెలంగాణకు చెందిన హారిక అనే 19 ఏళ్ల యువతి కూడా తన జీవితాన్ని ముగించేసుకుంది. తనది మంచిర్యాల జిల్లా దొనబండ అనే గ్రామం. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే గత మూడేళ్ల నుంచి హారికకు అంతుచిక్కని వ్యాధి సోకింది. దాని వల్ల తను చాలా బాధపడింది. దీంతో తన తల్లిదండ్రులు తనను పలు ఆసుపత్రులకు తిప్పారు. లక్షలు ఖర్చు పెట్టారు. దీంతో కాస్త నయం అయింది. కానీ.. కొన్ని రోజులకే ఆ రోగం మళ్లీ తిరగబడింది. దీంతో హారికకు ఏం చేయాలో అర్థం కాలేదు.
ఆ రోగంతో మళ్లీ నరకం చూసింది హారిక. తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది హారిక. తనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ.. తన ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. తమ కూతురు బతకాలని లక్షలు ఖర్చు పెట్టారు. అయినా కూడా ఫలితం దక్కలేదు. చివరకు కూతురే తనువును చాలించేసుకుందని ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.