Intinti Gruhalakshmi 9 Jan Today Episode : తులసి ఆరోగ్యం కుదుటపడుతుందా? సామ్రాట్ తన భర్తగా రాశాడని తెలిసి అందరూ షాక్.. సామ్రాట్ అసలు క్యారెక్టర్ తెలుస్తుందా?

Intinti Gruhalakshmi 9 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 జనవరి 2023, సోమవారం ఎపిసోడ్ 837 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మేము బిజినెస్ చేస్తామని.. పరందామయ్య, అనసూయ, తన పిల్లలకు చెబుతాడు నందు. దీంతో బిజినెస్ చేయి కానీ.. అతిగా ఆవేశపడకు అని చెబుతాడు పరందామయ్య. నీ పర్సులో వంద రూపాయల నోట్లు కూడా లేవు కానీ.. లక్షలు పెట్టి ఎలా బిజినెస్ చేస్తావు అని అంటాడు పరందామయ్య. దీంతో తప్పదు ఎలాగైనా ఏదైనా చేయాల్సిందే అంటాడు నందు. నా బిజినెస్ పెట్టుబడికి లాస్య ఫ్రెండ్ హెల్ప్ చేస్తానన్నది అంటాడు నందు. సంవత్సరం తిరిగే లోపు ఆ అప్పు తీర్చేస్తాం నాన్న అంటాడు నందు. దీంతో నీకు ఆ నమ్మకం ఉంటే సరి అంటాడు పరందామయ్య.

intinti gruhalakshmi 09 january 2023 full episode

ఇంతలో పరందామయ్యకు సామ్రాట్ కు కాల్ చేస్తుంటాడు. దీంతో చెప్పు బాబు అంటాడు. దీంతో అసలు విషయం మొత్తం చెబుతాడు సామ్రాట్. అసలు ఎలా జరిగింది. ఏ ఆసుపత్రి అని చెబుతాడు. ఇప్పుడే బయలుదేరుతాం అని చెబుతాడు. ఏమైంది అని అడుగుతుంది అనసూయ. దీంతో తులసికి లో బీపీ గా ఉండి కింద పడిపోయిందట. ఆసుపత్రిలో ఉందట. మీకు ఫోన్లు చేస్తే ఎవ్వరూ తీయలేదట అని అడుగుతాడు పరందామయ్య. దీంతో తమ ఫోన్లన్నీ సైలెంట్ లో ఉన్నాయని చెబుతారు అందరూ. తర్వాత అందరూ బయలుదేరుతారు. మరోవైపు తులసి తమ్ముడు దీపక్, తల్లి ఇద్దరూ ఆసుపత్రికి వస్తారు. ఇంతలో డాక్టర్ రావడంతో పరిస్థితి బాగోలేదు. పేషెంట్ కోమాలోకి వెళ్లడం కానీ.. పెరాలసిస్ రావడం కానీ జరగొచ్చు. మీరు ఇంత కేర్ లెస్ గా ఉంటే ఎలా.. ఆమెను ఒంటరిగా ఎలా వదిలేశారు అని డాక్టర్ సీరియస్ అవుతుంది.

ఇంతలో ప్రేమ్ వాళ్లు అందరూ వస్తారు. సామ్రాట్ గారు.. మా అమ్మకు ఎలా ఉంది అని అడుగుతాడు. దీంతో చావు బతుకుల్లో ఉంది. వెళ్లి చూడండిరా అంటూ ఆవేశపడతాడు దీపక్. రోజూ నిష్టగా పూజ చేసి భక్తితో మొక్కుకుంటే కానీ దేవుడు వరాలు ఇవ్వడురా అంటాడు దీపక్.

మీ అమ్మను అస్సలు పట్టించుకోరా.. కనీసం ఎలా ఉందో కూడా తెలుసుకోరా? స్పృహ తప్పి పడిపోయినప్పుడు మీ అమ్మ కు ఫోన్ చేసింది కదా. మీరు ఒక్కరు అయినా సరైన సమయానికి రెస్పాండ్ అయి ఉంటే ఇప్పడు మీ అమ్మకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని అంటాడు దీపక్.

మీ అమ్మకు ఇప్పుడు మీరు ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? పెరాలసిస్, కోమ అని చెబుతాడు దీపక్. తులసి మాజీ మొగుడు మౌనంగా ఉన్నాడు.. మధ్యలో ఈ కాకరపొత్తుగాడు ఏంటి తెగ ఆవేశపడుతున్నాడు అని మనసులో అనుకుంటుంది లాస్య.

Intinti Gruhalakshmi 9 Jan Today Episode : తులసి బాగుండాలని దేవుడిని ప్రార్థించిన కుటుంబ సభ్యులు

వాళ్లను ఏమనకురా అని అంటుంది సరస్వతి. తనను గాలికి వదిలేసింది నేనురా అంటుంది. దయచేసి ఎవ్వరినీ ఎవరూ నిందించుకోవద్దు అంటాడు సామ్రాట్. ముందు తులసి గారు ఈ గండం నుంచి బయట పడాలని ఆ దేవుడిని ప్రార్థించాలి అంటాడు సామ్రాట్.

ఇంతలో డాక్టర్ వస్తుంది. ఏమైంది అని అడిగితే ఇప్పుడే ఏం చెప్పలేమండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది డాక్టర్. మరోవైపు అందరూ బాధపడుతూ అక్కడే కూర్చొంటారు. అక్కడే ఉన్న గణపతి దగ్గరికి వెళ్లి అందరూ దేవుడిని వేడుకుంటారు. చేతులెత్తి నమస్కరిస్తారు.

జీవితంలో దాని సంతోషాన్ని మొత్తం లాక్కున్నా మొండిగా అది బతుకుతోంది. వదిలేయొచ్చు కదా అయ్యా. దాని బతుకు దానిని బతకనీయొచ్చు కదా అయ్యా అంటూ దేవుడిని వేడుకుంటుంది సరస్వతి. తప్పు మా వల్ల జరిగింది. మమ్మల్ని శిక్షించు.. అమ్మను కాదు అంటూ ప్రేమ్ వేడుకుంటాడు.

మరోవైపు డాక్టర్ వచ్చి అందరినీ చూస్తుంది. అదేంటి పేషెంట్ ఎలా ఉందని ఎవ్వరూ అడగడం లేదేంటి అని అడుగుతుంది డాక్టర్. దీంతో మీరు ఏం చెప్తారో అని భయపడుతున్నాం అంటాడు సామ్రాట్. నథింగ్ టు వర్రీ.. తను ఇప్పుడు బాగానే ఉంది అంటుంది.

ఇంతలో నర్సు వచ్చి తులసి గారి భర్త మీరే కదా. డాక్టర్ గారు మీతో మాట్లాడాలి అట. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెబుతుంది నర్సు. దీంతో అక్కడి నుంచి సామ్రాట్ వెళ్తాడు. దీంతో నర్సును పిలిచి ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటే.. ఆయనే కన్సెంట్ ఫామ్ లో భర్తగా రాశారు అని అంటుంది నర్సు.

దీంతో ఇప్పుడు ఏమంటారు అని అందరినీ అడుగుతుంది లాస్య. దాని అర్థం ఏంటి.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ బరి తెగించారా? అంటుంది లాస్య. ఇలాంటి సమయంలో కూడా మీరు సామ్రాట్ ను నిలదీయకపోవడం కరెక్ట్ గా లేదు నాన్న అంటాడు నందు.

నా అక్క గురించే మాట్లాడుతావా? నా అక్క గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. నువ్వు బజారు మనిషితో సమానం అని దీపక్ లాస్యపై సీరియస్ అవుతాడు. దీంతో దీపక్ అంటూ నందు చెంప చెళ్లుమనిపిస్తాడు నందు. దీంతో నందు అంటూ సరస్వతి సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

55 minutes ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

2 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

3 hours ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

4 hours ago

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

5 hours ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

6 hours ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

14 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

15 hours ago