Home » Exclusive » Wife Kills Her Husband With Her Facebook Friend In Up
Exclusive

Crime News : భర్తపై అసహనం పెరిగింది.. దీంతో ఎవరితో సొంత భర్తను చంపించిందో తెలిస్తే ఛీ అంటారు

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 10, 2023 8:05 am
Advertisement

Crime News : ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో చోటు చేసుకుంది. ఓ మహిళకు గత నాలుగేళ్ల కింద వివాహం జరిగింది. ఆమెకు రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. కొడుకు పుట్టిన తర్వాత, తన భర్తపై ఎందుకో చిరాకు వచ్చింది. అసహనం పెరిగింది. దీంతో ఏం చేయాలో ఆ మహిళకు అర్థం కాలేదు. విడాకులు తీసుకోవాలని అనుకుందో లేదో తెలియదు కానీ.. ఒక సంవత్సరం పాటు భర్తకు దూరంగా వెళ్లిపోయింది. అదే సమయంలో ఫేస్ బుక్ లో ఒక యువకుడు పరిచయం అయ్యాడు. ఆ యువకుడితో పరిచయం పెంచుకోవడమే కాదు.. అతడితో అక్రమ సంబంధం కూడా పెట్టుకుంది.

Advertisement

ఆ యువకుడితోనే జీవితాన్ని పంచుకోవాలని అనుకుంది. అందుకే తన భర్తను అతడితో చంపించాలని ప్లాన్ వేసింది. భర్తను చంపేస్తే ఇక తనకు తిరుగు ఉండదు అనుకుంది. అనుకున్న విధంగా ప్లాన్ అమలు చేసింది. చివరకు భర్తను చంపించింది కానీ.. భార్య, తన ప్రియుడు ఇద్దరూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు.

Advertisement

Crime News : భర్త హింసిస్తున్నాడని ప్రియుడితో చెప్పిన భార్య

తన భర్త తనను బాగా హింసిస్తున్నాడని.. అందుకే అతడి అడ్డు తొలగించుకుంటే తామిద్దరం సంతోషంగా ఉండొచ్చని తన ప్రియుడితో చెప్పింది. దీంతో తన మాటలు నమ్మిన ప్రియుడు ఆ మహిళ భర్తను చంపేందుకు ఓకే అన్నాడు. అనుకున్న విధంగానే ఆమె భర్తను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భార్యపై అనుమానంతో ఆమె ఫోన్ ను పరిశీలించారు. దీంతో  ఆమె ఎక్కువగా తన ప్రియుడితో మాట్లాడినట్టుగా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు నిజం అంగీకరించాడు. దీంతో భార్యను, తన ప్రియుడిని, తన భర్తను చంపడానికి సహకరించిన ప్రియుడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు వాళ్లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి