Intinti Gruhalakshmi 13 Oct Today Episode : సామ్రాట్ తో రహస్యంగా పరందామయ్య భేటీ.. తులసిని పెళ్లి చేసుకోమని సామ్రాట్ ను కోరుతాడా?

Intinti Gruhalakshmi 13 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 అక్టోబర్ 2022, గురువారం ఎపిసోడ్ 762 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బతుకమ్మ వేడుకల దగ్గర్నుంచి బాధపడుతూ తులసి ఇంటికి వస్తుంది. తన రూమ్ లోకి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. బయట కూర్చొని పరందామయ్య కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా పడుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు తాతయ్య అని అడుగుతాడు ప్రేమ్. తులసి పరిస్థితి ఏంట్రా.. తనను ఎవరు ఓదార్చాలిరా. తను నమ్మిన మనిషే మోసం చేసేసరికి తను ఎవరికి చెప్పుకుంటుందిరా బాధ. మనమంతా కలిసి తులసిని ఒంటరిదాన్ని చేశాంరా అంటాడు పరందామయ్య. దీంతో నేను అమ్మను ఒంటరిగా ఉంచను. తనకు నేనున్నాను అంటాడు ప్రేమ్. తనకంటూ ఎవ్వరూ లేకపోయినా.. ఒంటరిగా ఉన్నా సరే.. తులసికి ఏం సమస్య లేకుండా నేను ఏదో ఒకటి చేయాలి. అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉండదు అని అంటాడు పరందామయ్య. దీంతో ఏం చేస్తావు తాతయ్య అని అడుగుతాడు ప్రేమ్. దీంతో చెప్పడం కాదు. చేసి చూపిస్తాను అని చెప్పి పరందామయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

intinti gruhalakshmi 13 october 2022 full episode

కట్ చేస్తే తెల్లవారుతుంది. అత్తయ్య ట్యాబ్లెట్స్ వేసుకోండి అని అడుగుతుంది తులసి. దీంతో వేసుకుంటానులే.. నువ్వు అక్కడ పెట్టు అంటుంది అనసూయ. నా ఆరోగ్యానికి ఏదైనా అయితే మందు ఉంది కానీ.. కుటుంబం ఖరాబు అయితే ఎవరు ఏం చేస్తారు అని అడుగుతుంది. దీంతో ఏం కాదు కానీ.. వేసుకో అని అంటుంది తులసి. దీంతో ట్యాబ్లెట్లు వేసుకుంటుంది అనసూయ. ఇంతలో పక్కింటి వాళ్లు వచ్చి మా కోడలు శ్రీమంతం ఉంది. అందరూ రావాలని అనసూయ, తులసికి బొట్టు పెడతారు. పెళ్లయిన నాలుగు నెలలకే మా కోడలు నీళ్లు పోసుకుంది. మరి మీ కోడళ్లు ఎప్పుడు నీళ్లు పోసుకుంటారు అని అడుగుతుంది. ఆ తర్వాత మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్లిపోతారు.

ఆవిడ ఏం చెప్పిందో అర్థం అయిందా? ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దు అని ఏమైనా అనుకుంటున్నారా? అని అడుగుతుంది తులసి. అలా మొహం చూసుకుంటున్నారు ఏంటి.. ఉన్న విషయం చెప్పండి అని అడుగుతుంది తులసి.

ఎవ్వరూ మాట్లాడరు. దీంతో ముసుగులో గుద్దులాట ఎందుకు.. మా గొడవ గురించి నేను ఆంటీకి చెప్పేస్తాను అని అనుకుంటుంది శృతి. చెప్పబోతుంటే ఇంతలో ప్రేమ్ కల్పించుకొని అదేం లేదు అంటాడు. ఇంతలో అభి కూడా టైమ్ కలిసి రావడం లేదు కానీ.. అలా పిల్లలు ఇప్పుడు వద్దు అని ఎవ్వరం అనుకోవడం లేదు అంటాడు.

Intinti Gruhalakshmi 13 Oct Today Episode : సామ్రాట్ ఆఫీసుకు వెళ్తున్నా అని అనసూయకు చెప్పిన తులసి

కట్ చేస్తే తులసి ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతుంది. అనసూయ దగ్గరికి వెళ్లి ఏమైంది మామయ్య గారు కనిపించడం లేదు అని అడుగుతుంది. దీంతో నాకు తెలియదు. ఈ ఇట్లో ఎవరి పనులు వాళ్లు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు అని అంటుంది అనసూయ. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అనసూయ.

దీంతో ఆఫీసుకు అంటుంది. మళ్లీ ఆ సామ్రాట్ ఆఫీసుకు వెళ్లడం అవసరమా అంటుంది. దీంతో నేను ఇప్పుడు వెళ్లకపోతే పది మంది అనే మాటే నిజం అవుతుంది అంటుంది తులసి. నేను ఇప్పుడు నడిసంద్రంలో ఉన్నా అంది తులసి.

కట్ చేస్తే పరందామయ్య.. సామ్రాట్ దగ్గరికి వెళ్తాడు. మన ఇష్యూ ఎప్పటికీ చల్లారదు అంటాడు పరందామయ్య. దీంతో ఇష్యూ ఎవరితో అనసూయ గారితోనా అంటాడు సామ్రాట్. ఎవరైనా తన మనసును అగ్గి పెట్టి రెచ్చగొడితే తను ప్రశాంతంగా ఉండదు. ఎదుటివాళ్లను ప్రశాంతంగా ఉండనీయదు అంటాడు పరందామయ్య.

నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్లిపోయేది తెలియదు. తులసి గురించి ఆలోచిస్తుంటే నాకు దిగులుగా ఉంది అంటాడు. దీంతో తులసి గారికి నేను ఎప్పటికీ సపోర్ట్ గా ఉంటాను అంటాడు సామ్రాట్.

తులసి విషయంలో నేను నమ్మేది నిన్ను ఒక్కడినే. నీ స్నేహం తులసికి అండగా ఉంటుందనే ధైర్యమే నన్ను ఈ మాత్రమైనా సంతోషంగా ఉంచుతోంది. తులసి గారి మీదనే కాదు.. తులసి ఫ్యామిలీలో నాకు అందరి మీద గౌరవం ఉంది అంటాడు సామ్రాట్.

తులసి విషయంలో దేవుడు నాకు కూడా ఒక దారి చూపిస్తున్నాడు.. అని చెప్పి సామ్రాట్ కు ఏదో ఒక విషయం చెబుతాడు పరందామయ్య. ఒక ప్రాపర్టీ తనకు దక్కిందని చెబుతాడు పరందామయ్య.

మరి.. ఈ విషయం ఇంట్లో చెప్పలేదా అంటాడు. దీంతో చెప్పలేదు అంటాడు పరందామయ్య. సామ్రాట్ కు ఏదో చెప్పి మీరే ఈ సాయం చేయాలని, సామ్రాట్ కు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇస్తాడు పరందామయ్య.

మీరు ఈ పని చేసి పెట్టండి అని చెప్పి నేను బయలుదేరుతాను అంటాడు పరందామయ్య. కట్ చేస్తే తులసి ఆఫీసుకు వెళ్తుంది. మ్యూజిక్ స్కూల్ ఫైల్ కోసం వెతుకుతూ ఉంటుంది. మరోవైపు నందు, లాస్య ఇద్దరూ ఏదో ఫైల్ గురించి చెక్ చేస్తుంటారు.

ఇంతలో తులసి దగ్గరికి విజయ వస్తుంది. మ్యూజిక్ స్కూల్ ఫైల్ ఏదని విజయను అడుగుతుంది తులసి. దీంతో లాస్య తీసుకున్నారని చెబుతుంది. దీంతో నందు, లాస్య క్యాబిన్ కు వెళ్తుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

 

Recent Posts

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

2 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

4 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

6 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

8 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

9 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

10 hours ago

Periods | పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!

Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయరాదు,…

11 hours ago

Weight | బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా చదవాల్సిన వార్త.. అరటిపండు,యాపిల్‌ల‌లో ఏది బెస్ట్‌

Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…

12 hours ago