Intinti Gruhalakshmi 15 Sep Today Episode : లాస్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తులసి.. నందు, లాస్య ఉద్యోగాలు ఊస్ట్ అయ్యాయా? సామ్రాట్ షాకింగ్ నిర్ణయం

Intinti Gruhalakshmi 15 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 సెప్టెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 738 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి ఇంటి నుంచి కోపంగా తమ ఇంటికి వచ్చేస్తారు లాస్య, నందు. తులసి ఎంత పని చేసిందో చూశావా నందు.. ఆ విషయాన్ని సామ్రాట్ చెవిలో ఊదింది అంటుంది లాస్య. దీంతో తులసే ఆ విషయాన్ని సామ్రాట్ కు చెప్పిందని నువ్వెందుకు అనుకుంటున్నావు. ఇప్పుడు సమస్య అది కాదు. సామ్రాట్ కు అసలు విషయం తెలిసింది. ఇక నేను నా మొహాన్ని సామ్రాట్ కు చూపించలేను అంటాడు నందు. దీంతో నువ్వు టెన్షన్ పడకు. మన ఉద్యోగాలు ఎటూ పోకుండా ఉండేలా చేసే బాధ్యత నాది అంటుంది లాస్య. ఆ ఉద్యోగాలు పోతే మన జీవితాలు పోయినట్టే. నేను వెళ్లి సామ్రాట్ తో మాట్లాడుతా. సామ్రాట్ ఎమోషన్ ను అడ్డం పెట్టుకొని నేను ఆయనతో మాట్లాడుతా.. అని చెప్పి నందును కన్విన్స్ చేస్తుంది లాస్య.

intinti gruhalakshmi 15 september 2022 full episode

మరోవైపు తులసి కోసం ఆఫీసులో ఎదురు చూస్తూ ఉంటాడు సామ్రాట్. తులసికి నువ్వు దూరంగా ఉండాలన్నా హనీ ఉండనివ్వదు అని బాబాయి చెబుతాడు. తన రూమ్ బయటికి వచ్చి చూడగా తులసి బయట కుర్చీలో కూర్చొని ఉంటుంది. తనను చూసి సంతోషిస్తాడు సామ్రాట్. తన దగ్గరికి వెళ్తాడు సామ్రాట్. ఎప్పుడు వచ్చారు అని అడుగుతాడు సామ్రాట్. దీంతో ఇంతకుముందే వచ్చాను అంటుంది తులసి. మరి లోపలికి రాలేదు అంటాడు. దీంతో మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా. అందుకే రాలేదు అంటుంది తులసి. ఆ తర్వాత నేను ఇక్కడికి రాలేనేమో అని అనుకున్నారా అని అడుగుతుంది తులసి. మీకు మైండ్ రీడింగ్ కూడా తెలుసా అంటాడు సామ్రాట్. మీరు కొన్ని రోజులు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దూరంగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంటాడు సామ్రాట్. దీంతో ఒక పక్షికి స్వేచ్ఛగా ఎగరడం ఎంత ముఖ్యమో.. తన గూడు కూడా అంతే ముఖ్యం. నా వరకు నా గూడు నా ఇల్లు. నా బలం, నా ప్రపంచం నా కుటుంబం. నేను పైకి ఎగరాలని ఆశపడుతున్నారు కానీ.. నా వల్లను వదులుకొని కాదు. ఒకవేళ నేను అలా వెళ్లినా నా శరీరం ముందుకెళ్తుంది కానీ.. నా శ్వాస అక్కడే ఉంటుంది అంటుంది తులసి.

జరిగిందంతా మరిచిపోండి. మీ మనసు ఎలా చెబితే అలా నడుచుకోండి అంటాడు సామ్రాట్. దీంతో నా పార్టనర్ ఎలా చెబితే అలాగే అంటుంది తులసి. ఇంతలో లాస్య ఆఫీసుకు వస్తుంది. లాస్యను చూస్తారు తులసి, సామ్రాట్. తన దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది లాస్య.

మీతో మాట్లాడాలి. ఒక్క 5 నిమిషాలు చాలు అంటుంది లాస్య. మీరు బిజీగా ఉంటారని తెలుసు. కావాలంటే తులసి గారి ముందే మాట్లాడుదాం అంటుంది లాస్య. దీంతో నాకు అవసరం లేని విషయాల్లో నేను తలదూర్చను. నేను వెళ్తా అంటుంది తులసి. దీంతో ఒక అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాం. నువ్వు క్యాబిన్ లో వెయిట్ చేయి అంటాడు సామ్రాట్.

Intinti Gruhalakshmi 15 Sep Today Episode : నంద గోపాల్ మీకు చాలా అన్యాయం చేశాడని తులసితో అన్న సామ్రాట్

ఆ తర్వాత నంద గోపాల్ మిమ్మల్ని చాలా అన్యాయం చేశాడు అంటాడు సామ్రాట్. దీంతో ఆ విషయం ఇప్పుడు వద్దు అంటుంది తులసి. జీవితాన్ని డిస్టర్బ్ చేసిన వారితో కలిసి ఒకే ఆఫీసులో పనిచేయడం చాలా కష్టం. మీ ఇబ్బంది ఏంటో నాకు తెలుసు అంటాడు సామ్రాట్.

ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను మళ్లీ జాబ్ లోకి తీసుకోవడం నాకు ఇష్టం లేదు అంటాడు నందు. ఎంత కాదనుకున్నా.. వద్దనుకున్నా పర్సనల్ గొడవలు ఆఫీసులోనూ మొదలవుతాయి. స్టాఫ్ ముందు పరువు పోతుంది. మీ ఫ్యామిలీ గొడవలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. నందు, లాస్యను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలా అనేది పూర్తిగా మీ నిర్ణయం మీదికే వదిలేస్తున్నా అంటాడు సామ్రాట్.

మీ నిర్ణయం ఏంటో చెప్పండి అంటాడు సామ్రాట్. నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉందా అని అంటాడు సామ్రాట్. దీంతో నేను ఆలోచిస్తోంది నా గురించి కాదు.. మీ గురించి. నా గురించి దిగులు లేదు. కానీ.. నాకు హాని చేసిన వారికి చెడు జరగాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు కూడా అనుకోవడం లేదు.

నా బాధ మీ గురించే. నా కారణంగా మీరు అల్లరి అవుతున్నారు అని అంటుంది తులసి. దీంతో మీ మనసులో ఏముందో నాకు అర్థం అయింది తులసి గారు. లాస్యను నేను డీల్ చేస్తాను అని చెప్పి సామ్రాట్ లాస్య దగ్గరికి వెళ్తాడు. తెలియక చేసిన ఒక తప్పు వల్ల మా జాబ్స్ ప్రాబ్లమ్ లో పడింది అనిపించింది అంటుంది లాస్య.

నువ్వు ఏ తప్పు గురించి మాట్లాడుతున్నావు అని నిలదీస్తాడు సామ్రాట్. తులసి విషయంలో మీ భర్త నంద గోపాల్ చేసిన తప్పు గురించా.. లేక మీరు తులసికి చేసిన అన్యాయం గురించా అంటాడు సామ్రాట్. వాటి గురించి కాదు సార్. మా జాబ్స్ మాకు చాలా ముఖ్యం అంటుంది లాస్య.

సామ్రాట్ గారు.. మేం చేసిన తప్పును క్షమించి మా జాబ్స్ మిమ్మల్ని చేసుకోనివ్వండి సార్ అంటుంది లాస్య. దీంతో చేసుకోనిచ్చాను అంటాడు. మళ్లీ ఇలాంటి గొడవలు జరగవని ఏంటి గ్యారెంటీ. నా ఆఫీసు ప్రశాంతంగా ఉండాలి. నా ప్రాజెక్ట్ ప్రశాంతంగా జరగాలి. నా బిజినెస్ పార్టనర్ ప్రశాంతంగా ఇక్కడ పనిచేసుకోవాలి.

వీటిలో ఏ ఒకటి డిస్టర్బ్ అయినా నేను ఇలా ప్రశాంతంగా మాట్లాడను అంటాడు సామ్రాట్. నిన్న జరిగిన తమాషా లాంటిది మరోసారి జరగకూడదు. అలా అని మాటిస్తావా అని అడుగుతాడు సామ్రాట్. ఓకే అర్థం అయింది సార్. మీరు మిమ్మల్ని క్షమించినందుకు థాంక్స్ అంటుంది లాస్య.

దీంతో ఈ నిర్ణయం నాది కాదు. ఇది తులసిదే అంటాడు సామ్రాట్. దీంతో లాస్య షాక్ అవుతుంది. తర్వాత తులసి దగ్గరికి వెళ్తుంది లాస్య. నా జీవితం నాది.. ఎవరి గురించి పట్టించుకునే ఓపిక లేదు. ఇంకో సారి నా విషయంలో జోక్యం చేసుకోవద్దని నంద గోపాల్ గారికి చెప్పు అని లాస్యకు సీరియస్ వార్నింగ్ ఇస్తుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Farmers | రైతులకు విజ్ఞప్తి .. సెప్టెంబర్ 30 చివరి తేది… తక్షణమే ఈ-క్రాప్ నమోదు చేయండి!

Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…

1 hour ago

Modi | శ్రీశైలం సందర్శించనున్న ప్రధాని మోదీ .. ఇన్నాళ్ల‌కి వాటిని బ‌య‌ట‌కు తీసారు..!

Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…

3 hours ago

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…

5 hours ago

Prize Money | క‌ప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మ‌నీ ఎంత‌.. ర‌న్న‌ర‌ప్ పాకిస్తాన్ ప్రైజ్ మ‌నీ ఎంత‌?

Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…

7 hours ago

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

8 hours ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

9 hours ago

Papaya | రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…

10 hours ago

Cumin nutrition | జీలకర్ర ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాల వెంట కొన్ని ప్రమాదాలు కూడా

Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…

11 hours ago