intinti gruhalakshmi 16 october 2021 full episode
Intinti Gruhalakshmi 16 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 16 అక్టోబర్ 2021, శనివారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చివరిసారి శృతిని ఒప్పించడం కోసం తులసి ఇంటికి వెళ్తుంది. తులసి ఎక్కడికి వెళ్లిందని అందరూ కళ్యాణ మండపంలో టెన్షన్ పడతారు. నందు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు తులసి. నువ్వు ఇప్పటికీ నీ ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటే అది పెద్ద తప్పు. నువ్వు భయంతో ఇదంతా చేస్తున్నావు. నేను అండగా ఉంటాను అని చెప్పినా కూడా నువ్వు ఎందుకు వినడం లేదు. ప్రేమ్ మీద పెంచుకున్న ప్రేమను నువ్వెందుకు చంపుకోవాలి అంటుంది తులసి.
intinti gruhalakshmi 16 october 2021 full episode
ప్రేమ్ తో పెళ్లికి ఒప్పుకోకపోవడానికి అంకుల్ ఇచ్చిన మాట మాత్రమే కాదు. నా కారణాలు కూడా నాకు ఉన్నాయి. అవి నేను మీకు చెప్పలేను ఆంటి.. అంటుంది శృతి. ఏంటా కారణాలు.. వద్దు శృతి. అవతల ప్రేమ్, అక్షర పెళ్లి జరిగిపోతోంది.. అన్నా కూడా అస్సలు వినదు శృతి. మీరు ఏం చేసినా నేను మాత్రం ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టను.. అని ఖరాఖండిగా చెప్పేస్తుంది శృతి.
కళ్యాణ మండపంలో పెళ్లి లేట్ అవుతుండటంతో జీకే ఇక ఆగలేక తులసికి ఫోన్ చేస్తాడు. కానీ.. తన ఫోన్ కలవదు. ఇంతలో ప్రేమ్ రాసిన లెటర్.. జీకే కంటపడుతుంది. ఆ లెటర్ చదివి జీకే షాక్ అవుతాడు. అప్పుడు కానీ.. జీకేకు అర్థం కాదు.. ప్రేమ్.. వేరే ఎవరినో ప్రేమిస్తున్నాడని. అన్నీ గుర్తుకుతెచ్చుకుంటాడు. ఇప్పుడెలా అని టెన్షన్ పడుతుంటాడు.
పెళ్లి పీటల మీద ఉన్న ప్రేమ్ ను పిలుస్తాడు జీకే. నీకు అబద్ధాలు చెప్పే అలవాటు ఉందా? అని నిలదీస్తాడు జీకే. ఎందుకు అలా అడుగుతున్నారు అంకుల్ అంటే నీ నోటి నుంచి కొన్ని నిజాలను వినాలని అనుకుంటున్నా అంటాడు. నిజంగానే నువ్వు మా అక్షరను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావా? అని అడుగుతాడు జీకే. నేను ఒప్పుకుంటేనే నాకు, అక్షరకు పెళ్లి జరుగుతోంది అంటాడు. తెలివిగా సమాధానం చెప్పకు.. సూటిగా సమాధానం చెప్పు.. పెళ్లి అంటే ఆటబొమ్మలాట కాదు.. అని చెప్పి ప్రేమ్ రాసిన లెటర్ ను నందు మీద విసిరేస్తాడు జీకే.
అది తన స్వహస్తాలతో మీ వాడు మా అమ్మాయికి రాసిన లెటర్ అని చూపిస్తాడు జీకే. ప్రేమ్ మనసులో ఉంది అక్షర కాదు శృతి అని అంటాడు జీకే. దీంతో కళ్యాణ మండపంలో ఉన్నవాళ్లంతా షాక్ అవుతారు. ఇప్పుడేమంటారు నందు గారు.. అని ప్రశ్నిస్తాడు జీకే. అంటే అది ఒకప్పుడు ప్రేమ్, శృతిని ఇష్టపడటం నిజమే అంటాడు. కానీ.. శృతి తనకు తగిన సంబంధం కాదని అక్షరతో పెళ్లికి ఒప్పుకున్నాడు.. అని ఏదేదో చెప్పబోతే షట్ అప్ అని నందు మీద సీరియస్ అవుతాడు నందు.
intinti gruhalakshmi 16 october 2021 full episode
మీ స్వార్థం కోసం అతడి నోరు నొక్కి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారా? అని జీకే ప్రశ్నిస్తాడు. ఆ లెటర్ ను అక్షర కూడా చదువుతుంది. ఇంతలో అక్కడికి తులసి వస్తుంది. జీకేకు అసలు విషయం చెప్పేస్తుంది. ప్రేమ్… శృతిని ప్రేమించాడు అని చెబుతుంది. శృతి కూడా ప్రేమ్ ను ప్రేమించింది అంటుంది తులసి. వాళ్లిద్దరు ప్రేమించుకున్నప్పుడు అక్షర పరిస్థితి ఏంటి? నా కూతురి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు అని ప్రశ్నిస్తాడు జీకే. శృతి చివరి నిమిషంలో మాట మర్చి.. ప్రేమ్ ను ప్రేమించలేదని చెప్పడంతో.. అక్షరతో పెళ్లి సెట్ అయింది.
కానీ ఇప్పుడే తెలిసింది ఏంటంటే.. శృతిని బెదరించి ఈపని చేయించారని తెలిసింది.. అని మొత్తం స్టోరీ అంత జీకేకు చెప్పేస్తుంది తులసి. పెద్ద మనసుతో మీరే ప్రేమ్, శృతిని ఒక్కటి చేయాలని తులసి.. జీకేను కోరుతుంది. దీంతో వెళ్లి శృతిని తీసుకురా.. దగ్గరుండి పెళ్లి జరిపిద్దాం.. అని అంటాడు జీకే. దీంతో తులసి అతడికి దండం పెడుతుంది. వెంటనే వెళ్లి శృతిని తీసుకొస్తుంది. ఇంతలో జీకే.. నందుకు గడ్డి పెడతాడు. నీ స్వార్థం కోసం సొంత కొడుకునే పణంగా పెడతావా? అని నాలుగు అక్షింతలు వేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.