Home » Entertainment » Shannu Says Siri Does Not Have Character In Bigg Boss 5 Telugu
Entertainment

Bigg Boss 5 Telugu : నీకు కారెక్టర్ లేదు!.. సిరి పరువుతీసిన షన్ను

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 16, 2021 9:17 am
Advertisement

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్ను, జెస్సీలు ఓ గ్యాంగులా ఏర్పడ్డారు. వారికే వారే ఏదో సపరేట్ లోకంలో ఉంటున్నట్టు ఫీలవుతుంటారు. మిగతా వారితో సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. మధ్యలో ఓ వారం షన్ను కాస్త ఆలోచించి సిరికి దూరంగా ఉంటూ వచ్చాడు. షన్ను మాట్లాడటం లేదని,తనను దూరంగా పెడుతున్నాడని సిరి బాగానే ఫీలైంది. ఏడ్చేసింది. ఒంటరిగా కూర్చుని కన్నీరు పెట్టేసుకుంది. ఎప్పటిలానే నాగార్జున మధ్యలోకి దూరి సిరి, షన్నును కలిపేశాడు.

Advertisement

Shannu Says Siri Does not Have Character In Bigg Boss 5 Telugu

అలా మళ్లీ సిరి, షన్ను,జెస్సీ ఒక్కటయ్యారు. ఈ తొట్టిగ్యాంగ్ ఇప్పుడు ఇంట్లో గాసిప్, బిచ్చింగ్‌లకు అడ్డాగా మారింది. అయితే సిరి, షన్నులు మధ్య మధ్యలో కొన్ని కొన్ని మాటలు అనుకుంటారు. నిన్నటి ఎపిసోడ్‌లోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది. సిరికి కారెక్టర్ లేదు అని షన్ను అన్నాడట. దీంతో సిరి తెగ హర్ట్ అయింది. అదేతో జోక్‌లో అని ఉంటాడంటూ జెస్సీ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ సిరి మాత్రం అదే మూడ్‌లో ఉండిపోయింది.

Advertisement

Bigg Boss 5 Telugu : షన్ను, సిరి మధ్య గొడవ

Shannu Says Siri Does not Have Character In Bigg Boss 5 Telugu

సిరి ఒంటరిగా కూర్చుని ఏడ్చేసింది. తానేమీ హర్ట్ కాలేదని చెబుతూ ఏడ్చేసింది. అలాంటి మాటలు ఎందుకు అంటాడు.. వేరే వాళ్లతో ఎందుకు పోల్చుతాడు.. కారెక్టర్ లేదు అని ఎలా అంటాడు అని జెస్సీతో తన బాధను చెప్పుకుంది సిరి. అయితే చివరకు సిరిని షన్ను నవ్వించేశాడు. సిరిని ఇకపై ఏమీ అనొద్దు..అది జోక్‌గా అయినా సరే.. సీరియస్‌గా అయినా సరే.. ముందుగా నేను హర్ట్ అవుతాను అంటూ షన్నుకు జెస్సీ స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చేశాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి