intinti gruhalakshmi 18 january 2023 wednesday full episode
Intinti Gruhalakshmi 18 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 జనవరి 2023, బుధవారం ఎపిసోడ్ 845 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు.. ఇంటర్వ్యూ కోసం కారులో వెళ్తుంటాడు. ఇంతలో తన కారును ఓవర్ టేక్ చేసి మరో కారు రోడ్డు మీద ఆగుతుంది. కొందరు కారులో నుంచి దిగి మరీ.. నందు కారు కీస్ లాక్కుంటారు. దీంతో ఎవరు మీరు అంటూ సీరియస్ అవుతాడు నందు. దీంతో బ్యాంకు నుంచి అని చెబుతాడు. లోన్ తీసుకొని 4 నెలల నుంచి లోన్ కట్టకుండా తిరుగుతున్నావా? అని తనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి నందు కారును తీసుకొని వెళ్తారు. నందు ఎంత చెప్పినా కూడా వినరు. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. నడి రోడ్డు మీద నందును వదిలేసి వెళ్తారు. చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. దీంతో ఇంటర్వ్యూకు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటాడు నందు.
intinti gruhalakshmi 18 january 2023 wednesday full episode
మరోవైపు బోర్డ్ మీటింగ్ ఉంది. ఇప్పుడు సడెన్ గా సామ్రాట్ గారు ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటుంది. ఇంతలో వీడియో కాల్ చేస్తాడు సామ్రాట్. నాకు అర్జెంట్ పని ఉంది బయటికి వచ్చాను. ఈ రోజు స్పెషల్ బోర్డ్ మీటింగ్ ఉంది. హైదరాబాద్ కు సమీపంలోని శంకర పల్లిలో సీడ్స్ కు సంబంధించిన మానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి మీటింగ్ ఉంటుంది. వాళ్లను మీరు కన్విన్స్ చేయాలి. అక్కడే ఎందుకు అని మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడుగుతారు. వాళ్లను కన్విన్స్ చేయాల్సింది మీరే అంటాడు. నేనా అంటే నేనే.. నేను కూడా ఆన్ లైన్ లో కనెక్ట్ అవుతాడు. మీ టేబుల్ మీద అన్ని వివరాలు ఉన్నాయి. చూసుకోండి అంటాడు. దీంతో సరే అని చెప్పి పేపర్స్ అన్నీ చదువుకొని మీటింగ్ కు అటెండ్ అవుతుంది. నేను రాలేదు.. కానీ.. మన బోర్డ్ మీటింగ్ ను తులసి గారు జనరల్ మేనేజర్ కంటిన్యూ చేస్తారు అని చెబుతాడు సామ్రాట్.
ఆ తర్వాత బోర్డ్ మీటింగ్ లోని వాళ్లంతా ఇంగ్లీష్ లో ప్రశ్నలు సంధిస్తారు. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. దీంతో అలాగే వాళ్ల ముందు నవ్వుతూ ఉంటుంది. దీంతో ఏంటి మేడమ్ మేము ప్రశ్నలు అడుగుతుంటే మీరు నవ్వుతున్నారు అంటారు.
దీంతో మీకు ఆవేశం వస్తేనే ఇంగ్లీష్ లో మాట్లాడుతారా? ఇక్కడున్న వాళ్లం అందరం తెలుగు వాళ్లమే. మరి.. తెలుగులో మాట్లాడుకుంటే మీకు వచ్చిన సమస్య ఏంటి అని అడుగుతుంది. తెలుగు మన భాష మాత్రమే కాదు.. మన అమ్మ లాంటిది. దాన్ని మనమే అవమానించుకుంటే వేరే వాళ్లు ఇంకెలా చూస్తారు అంటుంది.
దీంతో తన మాటలు విని సామ్రాట్ చప్పట్లు కొడతాడు. దీంతో అందరూ చప్పట్లు కొడతారు. ఆ తర్వాత వాళ్లు అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ సమాధానం చెబుతుంది తులసి. మీరు చెప్పిన సమాధానాలు అన్నింటికీ మేము సాటిస్పై అయ్యాం. మీ కొత్త ప్రాజెక్ట్ కు మేము ఆమోదం తెలుపుతున్నాం. పనులు మొదలు పెట్టండి అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
నెత్తి మీది నుంచి పెద్ద బరువు దింపినట్టు అనిపిస్తోంది అంటుంది సామ్రాట్ తో. వాళ్లు ఇంగ్లీష్ లో అడగడంతో మీరు కంగారు పడ్డారు అని అనుకున్నా కానీ.. వాళ్లకు సరైన సమాధానాలు చెప్పారు అని మెచ్చుకుంటాడు సామ్రాట్. ఒక నాలుగు అయిదు రోజులు నేను రాలేను. నువ్వే మేనేజ్ చేయాలి అంటాడు.
మరోవైపు దివ్య డల్ గా కూర్చొంటుంది. దీంతో లాస్య ఇదే అవకాశం అనుకుంటుంది. నేను దగ్గవడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు అని అనుకుంటుంది. నాన్నా అంటుంది. దీంతో ఏంటి అంటుంది దివ్య. జరిగిందంతా చూశాను. చాలా బాధగా అనిపించింది అంటుంది లాస్య.
తల్లి అలా ప్రవర్తిస్తుందా? అంటుంది. అవసరాలు ఏంటో తెలుసుకొని తీర్చాలి కదా. పిల్లలు మాత్రం తల్లిని కాక ఎవరిని అడుగుతారు. నువ్వు అడిగిన దాంట్లో తప్పేం లేదు అంటుంది లాస్య. దీంతో కదా ఆంటి.. తప్పేం లేదు కదా. మరి ఎందుకు మామ్ నన్ను అర్థం చేసుకోవడం లేదు అంటుంది.
దీంతో నాకు అర్థం కాని విషయం అదే కదా అమ్మ. పెద్ద చదువులు చదివిస్తున్నప్పుడు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి కదా అంటుంది లాస్య. పరీక్ష కోసం లాప్ టాప్ మాత్రమే అడిగావు అంతే కదా. సర్దుకుపో.. అంటూ ఆ మాటలు ఏంటో.. అయ్యయ్యో ఎలా భరిస్తున్నావు నాన్న అంటుంది లాస్య.
చూశారా ఆంటి.. నేనంటే పడని మీరు కూడా నన్ను అర్థం చేసుకున్నారు అంటుంది దివ్య. దీంతో నువ్వంటే నాకు పడక కాదు అమ్మ. నువ్వే నన్ను దూరం పెడుతూ వచ్చావు అంటుంది లాస్య. దీంతో సారీ ఆంటి అంటుంది. మా అమ్మ మారే అవకాశం లేదా అంటుంది.
దీంతో నువ్వేం టెన్షన్ పడకు. లాప్ టాప్ నేను కొనిస్తాను అంటుంది లాస్య. దీంతో నిజంగానా ఆంటి అంటుంది. అవును.. కొత్త లాప్ టాప్ కాస్ట్ ఎంతుంటుంది అని అడిగితే.. జస్ట్ 1.5 లక్షలు ఆంటి అంటుంది. దీంతో లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. ఏ బ్రాండ్ కొందామని డిటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేశాను.. అంటుంది.
మీ మొబైల్ కు సెండ్ చేయనా? అంటుంది. దీంతో సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య. కట్ చేస్తే రాత్రి పూట ఇంటికి వచ్చిన తర్వాత తను మీటింగ్ లో ఎలా పార్టిసిపేట్ చేసిందో చెబుతుంది. అసలు నేనేనా అలా మాట్లాడింది అని అందరితో చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.