Intinti Gruhalakshmi 19 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 ఏప్రిల్ 2022, మంగళవారం ఎపిసోడ్ 610 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందుకు దివ్య కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి.. పేరెంట్స్ మీటింగ్ కు రావాలని చెబుతుంది. దీంతో సరే అంటాడు. బాగా దొరికింది తులసి అని అనుకుంటాడు. ఏమైంది అని అడుగుతుంది లాస్య. దీంతో దివ్య కాలేజీ నుంచి ఫోన్ చేశారు. పేరెంట్స్ మీటింగ్ కు రావాలంటూ చెప్పారు అంటాడు. దీంతో అదేంటి ఎప్పుడూ తులసే కదా వెళ్తుంది. మరి.. ఇప్పుడు నీకు ఎందుకు కాల్ చేశారు అంటుంది. దీంతో ఈసారి ఇద్దరూ రావాలట అంటాడు నందు.
కట్ చేస్తే తులసికి కూడా ఫోన్ చేస్తుంది కాలేజీ ప్రిన్సిపల్. ఇద్దరూ కలిసి రండి అని చెబుతుంది తులసికి. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. ఏమైంది అని అడుగుతాడు పరందామయ్య. దీంతో అసలు విషయం చెబుతుంది. ఏం కాదు.. నువ్వు ఒక్కదానివే వెళ్లు అంటాడు పరందామయ్య. ఇంతలో నందు వస్తాడు. దివ్య అని పిలుస్తాడు. దీంతో దివ్య వస్తుంది. తులసి కూడా అక్కడికొస్తుంది. ఇఫ్పుడు దాన్నెందుకు పిలుస్తున్నారు అంటుంది తులసి. దీంతో పిలిచే హక్కు నాకుంది. నీకు మగ తోడు అవసరం లేకపోవచ్చు కానీ.. తండ్రి అవసరం తనకు ఉంది అంటాడు నందు.
ఇంతలో దివ్య అక్కడికి వస్తుంది. దివ్య.. ఏం చేస్తున్నావమ్మా అంటాడు. చదువుకుంటున్నాను డాడ్ అంటుంది దివ్య. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అమ్మ. లేకపోతే కుట్టు మిషన్ పెట్టుకొని కుట్టుకోవాల్సి వస్తుంది అంటాడు నందు. చూడు దివ్య.. మీ ప్రిన్సిపల్ కాల్ చేశారు. పేరెంట్స్ మీటింగ్ ఉంది రావాలని చెప్పారు అంటాడు నందు.
కనీసం వాళ్లు అయినా నన్ను తండ్రిగా గుర్తించారు. సంతోషం అనిపించింది అంటాడు నందు. నువ్వు టెన్షన్ పడతావేమో.. మీటింగ్ కు వస్తున్నాను అని చెప్పడానికి వచ్చాను. మీటింగ్ టైమ్ కు నేను వచ్చి పికప్ చేసుకుంటాను అంటాడు నందు.
దీంతో అవసరం లేదు అంటుంది తులసి. చూడండి మిస్టర్ నందగోపాల్ గారు. దివ్య బాధ్యత నాది. కేవలం నాది. శ్రమ పడి మీరు పేరెంట్స్ మీటింగ్ కు రానక్కర్లేదు నేను వెళ్తాను అని అంటుంది తులసి. దీంతో నేను దివ్య తండ్రిని అంటాడు. దీంతో అది కేవలం రికార్డ్స్ వరకే పరిమితం అంటుంది తులసి.
దివ్యను మెడిసిన్ లో జాయిన్ చేశాక.. తను ఏ బాధ్యత తీసుకున్నారో చెప్పమనండి మామయ్య అంటుంది తులసి. కనీసం అది ఏ ఇయర్ చదువుతుందో చెప్పమనండి.. అంటుంది తులసి. దీంతో ఒకప్పుడు దివ్యకు నేనూ ఫీజులు కట్టాను. మరిచిపోయారా అని అడుగుతాడు నందు.
అయినా నాకు కావాల్సింది మీ డిసిజన్ కాదు.. దివ్య ఒపినియన్. నేను పేరెంట్స్ మీటింగ్ కు రావాలా వద్దా అని దివ్య చెబుతుంది అని దివ్యను అడుగుతాడు నందు. దీంతో దివ్యకు ఏం చేయాలో అర్థం కాదు. ఏ నిర్ణయం చెప్పాలో కూడా అర్థం కాదు.
చూడు తల్లి ఎవరో ఏదో అంటారని.. ఎవరికీ భయపడి నువ్వు డిసిజన్ తీసుకోకు. నీ మనసుకు ఏది నచ్చితే అది చేయి. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అంటాడు నందు. ఇప్పుడు నన్ను వద్దు అనుకుంటే.. తర్వాత కావాలని బతిమిలాడినా పట్టించుకోను అంటాడు నందు.
ఐయామ్ సారీ డాడ్. నేను ఇప్పుడు మామ్ నీడలో బతుకుతున్న బిడ్డను. తనేం చెబితే నేను అదే చేస్తాను అంటుంది దివ్య. మామ్ నిర్ణయమే నా నిర్ణయం అంటుంది దివ్య. దీంతో నందుకు కోపం వస్తుంది. కూతురు నిర్ణయం ప్రకారం నడుచుకుంటా అన్నావు కదా.. ఇప్పటికైనా అర్థం అయిందా అంటాడు పరందామయ్య.
దివ్యకు కేవలం తల్లి మాత్రమే ఉంది అని కాలేజీలో చెబుతాను అంటుంది తులసి. కేవలం దివ్యకు తండ్రి అన్న ఒక్క కారణాన్ని అడ్డు పెట్టుకొని నా మీద పెత్తనం చెలాయిస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను. ఇక విడాకులకు అర్థం ఏముంటుంది అంటుంది తులసి.
ఆ తర్వాత ఇంట్లో నుంచి నందు వెళ్లిపోతాడు. మరోవైపు పాట కంప్లీట్ చేస్తాడు ప్రేమ్. ఉదయమే ఆ పేపర్ కు పూజ చేస్తుంది శృతి. ప్రేమ్ టెన్షన్ పడుతుండటం చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటుంది. దీంతో మొదటి సారి పాట రాశాను కదా.. అంటాడు ప్రేమ్.
నాకైతే గొప్ప రచయిత రాసినట్టు ఉంది అంటుంది శృతి. ఆ తర్వాత పేపర్ తీసుకొని ఆఫీసుకు వెళ్తాడు ప్రేమ్. మరోవైపు.. దివ్య.. తన తండ్రి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దీనంగా ఉన్న దివ్యను చూసి తులసి ఏమైంది అని అడుగుతుంది.
నేను నార్మల్ గానే ఉన్నాను అంటుంది దివ్య. నేను నీ డిసిజన్ కు సపోర్ట్ చేశా కదా మామ్ అంటుంది దివ్య. నువ్వు తప్పనిసరై నిర్ణయం తీసుకున్నావు అని అనిపించింది. నీ మనసులో ఏమనుకుంటున్నావో నిర్మోహమాటంగా చెప్పు. మీ నాన్న పేరెంట్స్ మీటింగ్ కు రావాలి అనుకుంటే ఓపెన్ గా చెప్పు అంటుంది తులసి. దీంతో ఏం చెప్పాలో అర్థం కాదు దివ్యకు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.