pragathi stunning looks in birthday celebrations
Pragathi : నటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ అభిమానులకి దగ్గరైంది. ఇటీవల ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన తాజా క్షణాలు, వర్కౌట్ మూమెంట్‌లను తన అనుచరులతో పంచుకోవడానికి ఇష్టపడుతుంది. ఆమె ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో ఆమె అంకితభావాన్ని నెటిజన్లు .. ఆమె అనుచరులు ప్రశంసిస్తున్నారు. ప్రగతి ఫిట్‌నెస్ ఫ్రీక్ అని, జిమ్‌లో వర్కవుట్‌లు చేస్తూ ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా నటి ప్రగతి బర్త్ డే జరగగా, బర్త్ డే ఫోటోలు నెట్టింట్లో కాక పుట్టిస్తున్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తన స్నేహితులరాళ్లతో కలిసి బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రగతి ధరించిన దుస్తులు, పోజులిచ్చిన తీరు వైరల్ అవుతోంది. నటి ప్రగతిని ఇంత నాటుగా ఎప్పుడు చూసి ఉండరు అని కామెంట్ల వర్షం కురుస్తుంది. వయస్సు పెరుగుతున్నా కూడా ప్రగతి రచ్చ ఆగడం లేదు. ప్రగతి 1976 మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాలో జన్మించింది.
pragathi stunning looks in birthday celebrations
నటనపై మక్కువతో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ సరసన హీరోయిన్‌గా నటించే చాన్స్ కొట్టేసింది. ‘వీట్ల విశేశాంగ’ మూవీతో ప్రగతి హీరోయిన్‌గా తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అదే సమయంలో ఆమె 7 తమిళ సినిమాలతో పాటు ఒక మలయాళ మూవీలో కూడా నటించింది. కెరీర్ సాఫీగా సాగుతున్న క్రమంలో ఆమె పెళ్లి చేసుకుంది. కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చిన ఆమె ఆ తర్వాత మహేశ్ బాబు బాబీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.ప్రగతి ఇప్పటికీ పలు సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తుంది. ఎఫ్ 2 చిత్రంలో ప్రగతి పర్‌ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.