Intinti Gruhalakshmi 21 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 అక్టోబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 769 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు మీరు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ ఇంటిని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు అని పరందామయ్యను అడుగుతుంది తులసి. దీంతో నీకంటూ ఒక ఇల్లు ఉండాలి. నీదంటూ ఒకటి ఉండాలి. ఇప్పుడు మా దగ్గర నువ్వు ఉన్నట్టు కాదు. నీ దగ్గర మేము ఉన్నాం. ఈ ఇల్లు నీది అంటాడు పరందామయ్య. మరోవైపు అనసూయ వచ్చి మమ్మల్ని ఉన్నపళంగా ఇక్కడికి తీసుకొచ్చావు. సామాన్లు తెచ్చుకోవద్దా అంటుంది అనసూయ. దీంతో ఇంటికి తీసుకొచ్చిన వాడిని.. మిగితా ఏర్పాట్లు చూసుకోనా అంటాడు పరందామయ్య.
ఇంతలో సామాన్ల షిఫ్టింగ్ కు ఏజెన్సీతో మాట్లాడా.. అని ప్రేమ్, అభిని అక్కడికి వెళ్లి సామాన్లు తెప్పించమంటాడు పరందామయ్య. కట్ చేస్తే నందు జాబ్ కోసం నోటిఫికేషన్లను సెర్చ్ చేస్తుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భాగ్య.. దేనికైనా రాసిపెట్టి ఉండాలి. మీకేమో ఉన్నవి ఊడుతున్నాయి. ఆమెకేమో లేనివి వస్తున్నాయి అంటుంది. ఆవిడ సంతోషంగా గృహ ప్రవేశం చేసుకుంటోంది అంటుంది. తులసి అక్క అమ్ముకున్న ఇంటిని మామయ్య గారు కొని తులసి అక్కకు గిఫ్ట్ గా ఇచ్చారట అంటుంది భాగ్య. దీంతో లాస్య నమ్మదు. దీంతో లాస్యకు ప్రూఫ్స్ చూపిస్తుంది భాగ్య. దీంతో షాక్ అవుతుంది లాస్య. ఫోన్ లో ఆ వీడియోను చూపిస్తుంది. అక్కడ ఇంటిల్లి పాది సంబురాలు చేసుకుంటున్నారు అంటుంది భాగ్య.
కనీసం నందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని అంటుంది భాగ్య. అక్కడ సామ్రాట్ చేసిన అవమానం కన్నా ఇది పెద్ద అవమానం అంటుంది లాస్య. దీంతో గృహ ప్రవేశం చేసింది తులసి. మనల్ని పిలవాల్సిన అవసరం ఏంటి అంటాడు నందు.
అంత విలువైన ఇంటిని తులసి అక్కకు గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి. మామయ్య గారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా. ఎవ్వరూ ఆయనకు కనిపించలేదా. మీరు వదిలేసిన తులసక్కకు ఆయన గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి అంటుంది భాగ్య.
వెంటనే ఫోన్ చేసి అడుగు నందు అంటుంది లాస్య. దీంతో ఫోన్ చేసి అడగడం కాదు.. అక్కడికి వెళ్లి తేల్చుకోవాలి అంటుంది భాగ్య. వెంటనే వెళ్దాం పదా అంటుంది. దీంతో నేను రాను అంటాడు నందు. కానీ.. వచ్చి మాకు సపోర్ట్ గా ఉండు. మేమే మాట్లాడుతాం అంటారు భాగ్య, లాస్య.
మరోవైపు సామాన్లు వచ్చాక పూజలు చేయడం స్టార్ట్ చేస్తుంది తులసి. అందరూ ఇంట్లో సంతోషంగా ఉంటారు. హారతి తీసుకోండి అని అందరికీ ఇవ్వబోతుండగా అప్పుడే సామ్రాట్ వచ్చి తన హారతి తీసుకుంటాడు.
ఈ ఇంట్లో మొదటి హారతి కళ్లకు హద్దుకునే అదృష్టం నాకే దక్కింది అంటాడు సామ్రాట్. అతడిని చూసి తులసి షాక్ అవుతుంది. నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది తులసి.
దీంతో ఇప్పుడు మనం ఇక్కడ ఉండటానికి కారణమే ఆయన అంటాడు పరందామయ్య. కోర్టులో ఉన్న లిటిగేషన్ లాండ్ ను ఆయన కొనబట్టే మనం ఈ ఇంటిని కొనగలిగాం అంటాడు పరందామయ్య.
ఇంతలో అక్కడికి లాస్య, భాగ్య, నందు వస్తారు. మీది ఎంత గొప్ప మనసో.. ముచ్చటేస్తోంది సామ్రాట్ అంటుంది లాస్య. గౌరవం పోగొట్టుకున్నావు. నేనేం చేయను చెప్పు.. అంటుంది లాస్య. మా ఇంటికి వచ్చి మా అతిథిని అగౌరవ పరిచే హక్కు నీకు లేదు అంటుంది తులసి.
సోది ఆపి.. అసలు విషయం ఏంటో చెప్పు లాస్య అంటాడు పరందామయ్య. దీంతో మేము బయటి వాళ్లం కాదు కదా మామయ్య. నీ కొడుకు, కోడలే కదా అంటుంది లాస్య. తులసిని నిలదీస్తుంది లాస్య.
మీరు మాట్లాడరు ఏంటి అత్తయ్య అంటుంది భాగ్య. ఈ ఇంట్లో ఎవరి ఇష్టం వారిది అయిపోయింది. నా పెద్దరికానికి విలువ లేకుండా పోయింది అంటుంది అనసూయ. నన్ను అడగకు అంటుంది అనసూయ.
దీంతో నాతో ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు పరందామయ్య. ఈ ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులో నీ వాటా నువ్వు తీసుకెళ్లావు కదా.. మళ్లీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంటుంది తులసి.
నా స్వార్జితంతో ఇల్లు కొని నేను తులసికి ఇచ్చాను. ఇందులో వాటా అడిగే హక్కు ఎవరికీ లేదు అంటాడు పరందామయ్య. మేము మిమ్మల్ని చూసుకోవడానికి రెడీగా ఉన్నాం. కానీ.. తులసి అడ్డు పడింది. ఇదిగో ఇలా ఆస్తి కోసమే అంటుంది లాస్య.
దీంతో పట్టుపట్టాం కాబట్టే తులసి మమ్మల్ని తన దగ్గర ఉంచుకుంటోంది. మేము బలవంతం చేయబట్టే ఈ ఇంటిని తన పేరు మీద రాసేందుకు ఒప్పుకుంది. పరాయి మనిషి అయినా ఈ ఇంటితో సంబంధం లేకపోయినా సామ్రాట్ హెల్ప్ చేశాడు అంటాడు పరందామయ్య.
అసలు మా ఇంటి విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వు ఎవరు అని నందు.. సామ్రాట్ ను నిలదీస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
This website uses cookies.