
Oppo A17K smart phone was launched in the budget
Oppo A17k : భారత్ లో ఒప్పో ఏ17కే స్మార్ట్ ఫోన్ వచ్చింది. బడ్జెట్ రేంజ్ లో లాంచ్ అయింది. మీడియా టెక్ వీడియో జీ35 ప్రాసెసర్ తో ఈ ఫోన్ ను ఒప్పో తీసుకొచ్చింది. హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ సహాయంతో వర్చువల్ గా ర్యామ్ పొడిగించుకునే ఫీచర్ కూడా ఉంది. 6.56 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే తో ఒప్పో ఏ17కే వస్తుంది. స్టాండర్డ్ 60HZ రిఫ్రిష్ రేటు ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కోసం డిస్ప్లే టాప్ సెంటర్లో వాటర్ డ్రాప్ నాచ్ ను ఒప్పో ఉంచింది. ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 బేస్ట్ కలర్ ఓఎస్ 12.1.1 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
గరిష్టంగా 4జీబీ ర్యామ్ 64 జిబి స్టోరేజ్ తో వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్ గా 3జిబి వరకు అదనపు ర్యామ్ ని పొడిగించుకునే వీలుంది. ఒప్పో ఏ17కే స్మార్ట్ ఫోన్ వెనుక ఎనిమిది మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఐదు మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో ఈ ఫోన్ వస్తుంది. 4జీ ఎల్ టీఈ, వైఫై, బ్లూటూత్ 5.3, జీపిఎస్, మైక్రో యూఎస్ బీ పోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. పవర్ బటన్ కి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
Oppo A17K smart phone was launched in the budget
ఒప్పో ఏ17కే స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పది వాట్ల చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ 189 గ్రాముల బరువు ఉంటుంది. 3జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో ఉండే ఈ ఒప్పో ఏ17కే ధర రూ.10,499 గా ఉంది. నావి బ్లూ, గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. త్వరలో ఈ ఫోన్ సేల్ కు రానుంది. వివో ఇండియా ఆన్లైన్ స్టోర్ లో కమింగ్ సూన్ అని ఉంది. అయితే ఈ ధర రేంజ్ లో స్పెసిఫికేషన్లో పరంగా ఒప్పో ఏ17కె అంతగా లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా వెనుక సింగిల్ కెమెరా ఉండగా డిస్ప్లే రిజల్యూషన్ హెచ్డి ప్లస్ మాత్రమే ఉంది. అయితే లుక్ పరంగా బాగానే ఉంది.
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్బాట్లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
This website uses cookies.