intinti gruhalakshmi 23 february 2022 full episode
Intinti Gruhalakshmi 23 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 563 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బారు షాపులో మందు తాగుతున్న ఎస్ఐ కోసం వెతుకుతూ ఉంటుంది తులసి. ఇంతలో అక్కడ మందు తాగేవాళ్లు చాలామంది తనపై అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో పక్క సీటులో ఎస్ఐ ఉంటాడు. సార్ అంటుంది. ఏంటి.. కొడుకు కనిపించడం లేదన్న బాధతోటి మందు కొడదామని బార్ కు వచ్చావా అని అడుగుతాడు. దీంతో లేదండి.. మీ కోసమే వచ్చాను అంటుంది తులసి. ఎస్ఐ గారు మా అబ్బాయి మీ షర్ట్ పట్టుకోవడం తప్పే అంటుంది తులసి. ఒక పని చేద్దాం. నువ్వు నా పక్కన కుర్చొని ఒక పెగ్ వేయ్. సీన్ రీకన్ స్ట్రక్ట్ చేద్దాం. అప్పుడైనా గుర్తొస్తుందేమో అంటాడు. తనతో వచ్చిన వాళ్లు కూడా నవ్వుతూ ఉంటారు. రాకూడని టైమ్ లో రాకూడని మనిషి దగ్గరికి.. వచ్చినప్పుడే నేను సగం చచ్చిపోయాను.
intinti gruhalakshmi 23 february 2022 full episode
మీ వెటకారాలు సహిస్తూ.. ఓర్చుకొని పూర్తిగా చచ్చిపోయాను. ఒక తల్లి మానసిక క్షోభతో ఆడుకొని తప్పు చేశారు. ఒక ఆడదాన్ని ఆత్మాభిమానాన్ని చంపి ఇంకా తప్పు చేశారు. నా కన్నీళ్లతో మీ మనసు కరుగుతుందేమోనని ఆశతో వచ్చాను. ఇదంతా నా కొడుకును రక్షించుకోవాలన్న తాపత్రయంతో. ఒక తల్లి ఊసురు పోసుకొని మీరు ప్రశాంతంగా బతకలేరు.. అంటుంది తులసి. దీంతో అవునా.. నేను చచ్చిపోతానా.. నాకు భయమేస్తుందిరా అని అంటాడు ఎస్ఐ. చూడు.. కన్నీళ్లకు కరిగిపోయే క్యారెక్టర్ కాదు నాది. నీ ఈగోను టచ్ చేసినందుకు నీ కొడుకు అనుభవిస్తున్నాడు. అది చల్లారితే కానీ.. ఏం చేయాలో డిసైడ్ చేయను. నువ్వు నా కొడుకును ఏడు సముద్రాల అవతల దాచినా నా కొడుకును ఎట్టిపరిస్థితుల్లోనూ వెతికి పట్టుకుంటాను అంటుంది తులసి.
అచ్చా.. చాలెంజ్ చేస్తున్నావా అని అంటాడు పోలీస్. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ కోసం ఒక తల్లి ఏదైనా చేస్తుంది. అనుమానం ఉంటే మీ తల్లిని అడగండి. ఒక బిడ్డ కోసం ఏం చేయగలదో తనే చెబుతుంది అంటుంది తులసి. దీంతో కోపంతో ఇంకా మందు ఎక్కువ తాగుతాడు. నన్నే చాలెంజ్ చేస్తావా అని కోపంతో రగిలిపోతాడు ఎస్ఐ.
మరోవైపు తులసి ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. రోడ్ల మీద పడి వాడి కోసం తిరుగుతున్నావా అని అంటాడు. దీంతో ఎస్ఐ ఉన్న బార్ కి వెళ్లాను. ఎస్ఐని బతిమిలాడాను అని నందుతో అంటుంది. దాదాపు కాళ్లు పట్టుకున్నాను. అతడి మనసు మార్చడానికి ప్రయత్నించాను అంటుంది తులసి.
చేసింది పనికిమాలిన పని.. పైగా గొప్పలు చెప్పుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు నందు. లేకపోతే మీలా ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చోవాలా.. అంటూ ప్రశ్నిస్తుంది. కోపంతో నందుపై విరుచుకుపడుతుంది తులసి. నా ప్రాణాలు పణంగా పెట్టి నేను పిల్లలను కన్నాను కానీ.. మీరు చేసిందేంటి అని ప్రశ్నిస్తుంది.
నీకు ఇప్పుడు కాదు.. నీకు ఎదురుదెబ్బలు తగిలినప్పుడు నా గురించి తెలుస్తుంది అంటాడు నందు. మీలా చేతులు ముడుచుకొని నేను చూస్తూ కూర్చోలేను అంటుంది తులసి. నిజంగా మీరు బాధ్యత గల తండ్రి అయితే ఏదో ఒకటి చేయండి.. అభి గురించి ఆలోచించండి.. నన్ను దెప్పిపొడవడం కాదు అంటుంది తులసి.
ఇంతలో నందు తన రూమ్ లోకి వచ్చేస్తాడు. అప్పటికే తులసితో జరిగిన గొడవ అంతా లాస్య వింటుంది. తులసి లాగ నీకు నేను మర్యాద ఇవ్వకుండా ప్రయత్నించలేను కదా.. అని అంటుంది. నిజంగానే నువ్వు చేతగాని వాడివని నిరూపించడం కోసం అంటుంది లాస్య.
నేనే నీ ప్లేస్ లో ఉంటే ముందు తులసిని మెడపట్టి గెంటేసేదాన్ని అంటుంది లాస్య. మరోవైపు అభిని ఓ ప్లేస్ లో కట్టేసి తన మనషులతో కొట్టిస్తాడు ఎస్ఐ. కానిస్టేబుల్స్ చెప్పినా కూడా వినడు. పాపం తగులుతుంది సార్ అంటారు. అయినా ఎస్ఐ వినడు.
ఆ ఎస్ఐ మరింత మూర్ఖంగా మారకముందే.. తెగించకముందే నేను తొందరపడాలి. నేనే ఏదో ఒకటి చేయాలి. ముందు అభి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అనుకుంటుంది తులసి. ఇంట్లో అందరూ తప్పు నాదే అంటున్నారు. నేను డబ్బు కోసం అభిని బలవంతం చేయబట్టే ఇలా జరిగింది అంటున్నారు.. అని అనుకుంటుంది తులసి.
కట్ చేస్తే పోలీస్ స్టేషన్ ముందు టెంట్ వేసి అరెస్ట్ చేసిన తన కొడుకును చూపించండి.. అంటూ బోర్డు పట్టుకొని కూర్చుంటుంది తులసి. నువ్వు కూడా పోలీస్ స్టేషన్ ముందు ఇలా టెంట్ వేసుకొని కూర్చొని నా ఈగోను టచ్ చేస్తున్నావు అంటాడు పోలీస్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.