intinti gruhalakshmi 24 january 2023 tuesday full episode
Intinti Gruhalakshmi 24 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 జనవరి 2023, మంగళవారం ఎపిసోడ్ 850 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తనకు అన్నం తినిపిస్తూ ఉంటుంది తులసి. తనకు స్వేచ్ఛ గురించి చెబుతుంది. బంగారం కన్నా కూడా ఆడపిల్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని దివ్యకు చెబుతుంది తులసి. మృగాలు తిరుగుతున్న సమాజం ఇది. ఏ మృగం ఎప్పుడు ఎటు వైపు నుంచి దాడి చేస్తుందో తెలియదు అని అంటుంది తులసి. అబద్ధం చెప్పి తల్లిదండ్రులను ఏమార్చడం పెద్ద విషయం కాదు. కానీ.. అది మీకు మీరు నష్టం చేసుకోవడమే అవుతుంది. మిమ్మల్ని కళ్లలో పెట్టి చూసుకునే అమ్మానాన్నల కళ్లు కప్పడం అంటే దేవుడి కళ్లను మోసం చేయడమే అవుతుంది.
intinti gruhalakshmi 24 january 2023 tuesday full episode
నిన్ను భయపెట్టాలని ఇదంతా నీకు చెప్పడం లేదు. మేము ఎంత భయపడతామో.. ఆ భయానికి కారణాలేంటో నీకు చెప్పడం కోసం చెబుతున్నాను అంటుంది తులసి. దీంతో జీవితంలో ఇంకెప్పుడూ నేను ఇలా చేయను. నిన్ను టెన్షన్ పెట్టను. నువ్వు చెప్పినట్టే వింటాను అని అంటుంది దివ్య. దీంతో తనకు భోజనం తినిపించి పడుకో బెడుతుంది తులసి. మరోవైపు వాకింగ్ కు వెళ్లడానికి నందు రెడీ అవుతుంటాడు. దీని పక్కన మొగుడు లేకపోయిన పట్టించుకోదు కానీ.. పక్కన పడుకొనేటప్పుడు మొబైల్ మాత్రం ఉండాలి అని అనుకుంటాడు నందు. పాటలు పెట్టుకొని లాస్య పడుకోవడం చూసి నందుకు చాలా కోపం వస్తుంది. వెళ్లి పాటలను ఆపుతాడు. దీంతో నిద్రలోనే లేచి ఆ ఫోన్ ను మళ్లీ ఆన్ చేసి పాటలు పెట్టుకుంటుంది.
ఇంతలో రాములమ్మ వస్తుంది. ఏంటి అంటాడు నందు. దీంతో ఉదయమే లేపమని చెప్పింది అంటుంది రాములమ్మ. ఆమె నిద్ర లేస్తుందా. వాకింగ్ కు వస్తా అని నన్ను లేపమని చాలా రోజుల నుంచి అడుగుతోంది కానీ.. ఎన్నడూ లేవలేదు అంటాడు.
దీంతో రాములమ్మ వెళ్లి తనను లేపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ.. అస్సలు లేవదు లాస్య. దీంతో చెప్తా నీ పని అని బకెట్ లో నీళ్లు తీసుకొచ్చి తన ముఖం మీద కొడుతుంది. దీంతో లేచి కూర్చొంటుంది లాస్య.
ఏంటి ఇలా నీళ్లు కొట్టావు అంటే.. మీరే కదా లేవకపోతే బకెట్ నీళ్లు కొట్టి అయినా లేపమన్నారు అంటుంది రాములమ్మ. అవును కదా. ఈరోజు నుంచి నేను తులసిలా రెడీ అవ్వాలి అని అనుకుంటుంది లాస్య.
మరోవైపు మాకు కాఫీ ఇస్తా అన్నావు కదా ఏమైందమ్మా అని అడుగుతుంది అనసూయ తులసిని. దీంతో ఇస్తాను అత్తయ్య.. కొంచెం పనిలో పడి మరిచిపోయా. అంకిత.. నువ్వు వెళ్లి తీసుకురా కాఫీ అంటుంది తులసి.
దీంతో కాఫీ చేయడానికి సమస్య ఏం లేదు కానీ.. ఫ్రిడ్జ్ లు, ర్యాక్స్ అన్నింటికీ తాళాలు ఉన్నాయి అంటుంది రాములమ్మ. దీంతో మళ్లీ తాళాలు వేసిందా ఎందుకు అంటుంది తులసి. దీంతో ఈసారి ఇంట్లో ఎవరికి ఏది కావాలన్నా తనే చేసి ఇస్తుందట అంటుంది రాములమ్మ.
మరోవైపు లాస్య.. తులసిలా రెడీ అవుతుంది. తన రూమ్ లో ఇల్లు ఊడ్చుతూ ఉంటుంది. తనను గుర్తు పడతాడా నందు అనుకుంటుంది. కానీ.. నందు మాత్రం తనను చూసి రాములమ్మ అనుకుంటాడు.
ఇల్లు తుడవడం అయిపోయాక వెళ్లి నాకు కాఫీ పెట్టు రాములమ్మ అంటాడు. దీంతో తనకు చాలా కోపం వస్తుంది. మరోవైపు శృతి చీరకట్టుకుంటూ ఉండగా.. తనను చూసి టెంప్ట్ అవుతాడు ప్రేమ్.
వెనుక నుంచి వెళ్లి తనను గట్టిగా హత్తుకుంటాడు ప్రేమ్. దీంతో శృతి షాక్ అవుతుంది. ప్రేమ్ వదులు అంటే అస్సలు వదలడు తనను. చీర కట్టుకోవాలి వదులు అన్నా కూడా అస్సలు వదలడు.
ఇంతలో తులసి ఆ గదిలోకి వస్తుంది. వాళ్లను చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత లాస్య.. అందరికీ కాఫీ పట్టుకొని వచ్చి ఇస్తుంది. తన అవతారం చూసి అందరూ షాక్ అవుతారు. అందరికీ కాఫీ ఇస్తుంది.
దీంతో అందరూ తన అవతారం చూసి తమలో తామే నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.