Ramprasad – Getup Srinu : ఒకప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై అద్భుతమైన వినోదాల విందు కనిపించేది, కానీ ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కార్యక్రమం మూస కామెడీ పంచులతో ఆకట్టుకొని కామెడీ స్కిట్స్ తో సాగుతోంది అనడంలో సందేహం లేదు. కాస్త అలరిస్తారు అనే పేరు ఉన్న రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను కార్యక్రమం పై శ్రద్ధ పెడుతున్నట్లుగా లేరు. అందుకే వారి స్కిట్స్ కూడా అత్యంత నాసిరకంగా ఉంటున్నాయని తాజా ఎపిసోడ్ తో వెళ్లడయింది. వాల్తేరు వీరయ్య సినిమా యొక్క పేరడీని చేయాలని భావించారు కానీ అందుకు గాను వారు కాస్త డిఫరెంట్ గా స్క్రిప్ట్ ఎంపిక చేసుకుంటే బాగుండేది.
రాంప్రసాద్ గతంలో మాదిరిగా అద్భుతమైన పంచ్ డైలాగ్స్ ని రాయడం లేదు,కనీసం ఒక మోస్తరు పంచ్ డైలాగ్స్ నీ కూడా ఆయన రాయలేక పోతున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.సినిమాలకు రచయితగా వ్యవహరిస్తున్న రాం ప్రసాద్ ఈ మధ్య కాలంలో బుల్లి తెర విషయంలో కాస్త అశ్రద్ధ చూపుతున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఆయన స్కిట్స్ ఏ ఒక్కటి కూడా ఈ మధ్య కాలం లో సక్సెస్ సొంతం చేసుకోలేక పోయాయి. ఇక గెటప్ శ్రీను గెటప్ లు అయితే వేస్తున్నాడు కానీ అందుకు తగ్గట్లుగా స్కిట్ లు ఉండడం లేదు. రెగ్యులర్గా కనిపించినట్లుగానే ఆయన కొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు తప్పితే వావ్ అనిపించేంత మార్క్ చూపించలేక పోతున్నారు.
మొత్తానికి రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీనులు జబర్దస్త్ లో కనిపిస్తున్నారు.. కామెడీ చేస్తున్నారు కానీ, పూర్తి స్థాయి ఫోకస్ పెడుతున్నారా అనేది మాత్రం అనుమానంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సుడిగాలి సుదీర్ ఉన్న సమయంలో వీరి ముగ్గురు కలిసి చేసిన స్కిట్స్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వాటిల్లో కనీసం సగం సక్సెస్ క్రెడిట్ రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీనుకు ఉండేది. ఇప్పుడు వారిద్దరూ కలిసి కూడా సక్సెస్ ఫుల్ స్కిట్స్ నేను చేయలేక పోతున్నారు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా వీరి నుండి మంచి కామెడీ స్కిట్స్ వస్తాయేమో చూడాలి.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.