
intinti gruhalakshmi 26 april 2022 full episode
Intinti Gruhalakshmi 26 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 ఏప్రిల్ 2022, మంగళవారం ఎపిసోడ్ 616 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ప్లాన్ గురించి మీ ఆయనకు చెప్పావా అని అడుగుతుంది భాగ్య. దీంతో అమ్మో.. నేను ఈ విషయం చెబితే అడ్డుపడతాడు అంటుంది. ఇంతలో నందు వస్తాడు. ఏంటి అక్కాచెళ్లెళ్లు చాలా సంతోషంగా ఉన్నారు అని అడుగుతాడు. దీంతో తులసి ఫ్యాక్టరీ మూతపడింది అని చెబుతారు. వాట్.. అంటాడు. తులసికి ఇప్పుడు తెలుస్తుంది. తులసి అండ చూసుకొనే కదా అమ్మానాన్న మన దగ్గరకి రానిది. ఇప్పుడు తులసి ఎలా వాళ్లను చూసుకుంటుందో చూద్దాం అని అంటాడు. ఇక్కడ మాట్లాడుకుంటే ఏంటి లాభం. అక్కడికి వెళ్లి తులసి పడే కష్టాలను చూస్తేనే కదా మనకు కిక్కు వచ్చేది అంటుంది లాస్య. దీంతో సరే ఇప్పుడే వెళ్దాం అంటాడు నందు.
intinti gruhalakshmi 26 april 2022 full episode
కట్ చేస్తే తులసి దీనంగా ఇంటికి వస్తుంది. తను వచ్చి అలా బాధపడుతూ ఉండటం చూసిన పరందామయ్య.. ఏమైంది అని అడుగుతాడు. ఫ్యాక్టరీ మూతపడింది మామయ్య అంటుంది తులసి. దీంతో పరందామయ్య షాక్ అవుతాడు. మునిసిపాలిటీ వాళ్లు వచ్చు ఫ్యాక్టరీని సీజ్ చేసి తాళం వేశారు అంటుంది. దీంతో ఇప్పుడు ఎలా.. మనకు ఉన్న ఒక్క ఆధారం కూడా పోయిందా అంటుంది అనసూయ. ఫ్యాక్టరీని సీజ్ చేసేంత తప్పు ఏం జరిగిందమ్మా అంటాడు పరందామయ్య. ఇంతలో నందు, లాస్య అక్కడికి వస్తారు. చేతగాని పనులు చేయడమే తప్పు అంటాడు. తను ఏం చేస్తున్నా.. ముందు వెనుక ఆలోచించకుండా తనను నెత్తిన ఎక్కించుకున్నారు కదా. ఇప్పుడు చూశారు కదా ఏమైందో అంటాడు నందు.
నిన్ను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి అంటుంది అనసూయ. తులసితో పాటు ఉండటం అంటే చిలువ పడిన పడవలో ప్రయాణం చేసినట్టు అంటాడు నందు. చూశావా నందు.. మనం ఎంత గొంతు చించుకొని అరుస్తున్నా తను ఎలా మాట్లాడకుండా కూర్చుందో అంటుంది లాస్య.
దీంతో పొగరు అంటాడు నందు. నోరు విప్పితే తన చేతగానితనం బయటపడుతుంది. తను ఒప్పుకోవాల్సి వస్తుంది అంటాడు నందు. ఇంతలో అభి వస్తాడు. ఎవ్వరూ అక్కర్లేదు అంటూ ఒక్కొక్కరిని ఇంటి నుంచి తరిమేశావు. ఇప్పుడు చూడు.. ఏం జరిగిందో అంటాడు అభి.
నందు, లాస్య ఇద్దరూ తులసిని రెచ్చగొట్టినా కూడా తులసి ఏం మాట్లాడదు. ఫ్యాక్టరీ ఉన్న స్థలం గవర్నమెంట్ లాండ్ అని కోర్టులో రుజువు అయితే ఏమౌతుందో తెలుసా? జైలులో వేస్తారు. లేదా భారీగా ఫైన్ వేస్తారు అంటాడు అభి. ఇంతలో ప్రేమ్ వస్తాడు. కష్టాల్లో ఉన్న మనిషిని బెదిరించడం కాదురా చేయాల్సింది అంటాడు ప్రేమ్.
సమస్యకు పరిష్కారం చెప్పాలి అంటాడు ప్రేమ్. దీంతో తను మునగడం కాకుండా అందరినీ ముంచడం తనకు అలవాటే అంటాడు నందు. దీంతో నాన్న అంటాడు ప్రేమ్. ప్రేమ్ నువ్వు ఈ విషయాల్లో కలుగజేసుకోకు. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది.
నువ్వు ఏం చేసినా.. నేను నీతోనే ఉంటాను అంటాడు ప్రేమ్. మూతపడిన ఫ్యాక్టరీతోనే కదా ఇన్ని రోజులు ఇంటిని నడిపింది అంటాడు ప్రేమ్. మీరేంటి ఇప్పుడు వచ్చి మిస్టర్ క్లీన్ గా మాట్లాడుతున్నారు. మీరు, మీ ఆవిడ ఇద్దరూ ఉద్యోగాలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చొని తిన్నప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఫ్యాక్టరీ నుంచే కదా అంటాడు ప్రేమ్.
ఇప్పుడు మాట్లాడరు ఏంటి అంటాడు ప్రేమ్. దీంతో ప్రేమ్ మీద కోప్పడుతుంది తులసి. నువ్వు ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావంటే జీవితంలో నీ ముఖం చూడను. వెళ్లు అని అంటుంది తులసి. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్. నా మీద కోపం వాడి మీద చూపిస్తున్నావని నాకు తెలుసు తులసి అంటాడు నందు.
ఇలా పొగరుగా మాట్లాడబట్టే అందరికీ దూరం అవుతున్నావు అది ముందు తెలుసుకో అంటాడు నందు. ఇంత జరిగినా అమ్మానాన్నలు నాతో రారు. మా మధ్య అంత శతృత్వం పెంచావు అంటాడు నందు. నెల నెలా డబ్బులు పంపిస్తా అంటాడు నందు.
దీంతో అవసరం లేదు. నీ ముష్టి మాకు అవసరం లేదు అంటాడు పరందామయ్య. మేము చస్తే మా దహన సంస్కారాలకు కూడా నువ్వు రావద్దు. నీ డబ్బులు అవసరం లేదు అంటాడు పరందామయ్య. తులసిది పొగరు కాదు.. ఆత్మ గౌరవం. అది నీకు, నీ పెళ్లానికి అర్థం కాదు. ఎందుకంటే నీకు ఆత్మాభిమానం లేదు కాబట్టి అంటాడు పరందామయ్య.
అభిని కూడా తిడుతాడు పరందామయ్య. నువ్వు ఎదగాలని మీ అమ్మ అనుకుంది కానీ.. దిగజారాలని కాదు. ఇక వెళ్లు అంటాడు పరందామయ్య. అక్కడి నుంచి వెళ్తూ నందు చాలా బాధపడతాడు. తులసి పని అయిపోయింది నందు అంటుంది లాస్య.
తను ఇప్పుడు వానపాము. తన గురించి ఆలోచించడం వేస్ట్ ఆఫ్ టైమ్. ఒక విధంగా తులసి మీద మనం గెలిచినట్టే అంటుంది లాస్య. కానీ.. మా అమ్మానాన్న మన వైపునకు రావాలి అంటాడు నందు. దీంతో అది జరుగుతుంది అంటుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.