Intinti Gruhalakshmi 28 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 సెప్టెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 749 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ నిజం ప్రాణాలు పోయేంతవరకు తనలోనే దాచుకోవాలని అనుకున్నాడు. అందుకే ఎవరు ఎంత రెచ్చగొట్టినా.. తనలోనే దాచుకున్నాడు. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆమాట మీవాడికి చెప్పు అని బాబాయి అంటాడు. సామ్రాట్ కు చెల్లెలు అంటే చాలా ప్రాణం. వాడి అమ్మానాన్న చిన్నప్పుడే పోయారు. చిన్నప్పటి నుంచి చెల్లెలు అంటే సామ్రాట్ కు ప్రాణం. అన్నీ తనై చెల్లెలును గుండెల మీద పెట్టుకొని పెంచాడు. సునంద పెరిగి పెద్దదయింది. అన్న సామ్రాట్ కనుసన్నల్లో తిరుగుతోంది. ప్రేమ విషయంలో సునంద ఆన్న కళ్లు కప్పింది. సామ్రాట్ కంపెనీలో పనిచేసే మేనేజర్ నిరంజన్ ను ప్రేమించింది.. అని చెబుతాడు బాబాయి. చెల్లి ప్రేమ విషయం తెలుసుకొన సామ్రాట్ షాక్ అయ్యాడు. నిరంజన్ క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు సామ్రాట్. కానీ.. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఇద్దరి పెళ్లి చేశాడు సామ్రాట్.
సునంద భర్తకు క్యాష్ ఇవ్వడంతో పాటు ఆస్తిలో వాటా కూడా ఇచ్చాడు. సునందకు హనీ పుట్టింది. నిరంజన్ ఆస్తి మొత్తాన్ని తగులబెట్టి సునందను పుట్టింటి నుంచి డబ్బు తీసుకురా అనేవాడు. అన్నయ్య మాట విననందుకు దేవుడు తగిన సాక్షి చేశాడని అనుకుంది. హనీని సామ్రాట్ ఇంటి ముందు పడుకోబెట్టి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి సామ్రాట్ గుండె పగిలిపోయింది. ఆ నిరంజన్ ను జైలుకు పంపించాడు. అప్పటి నుంచి హనీనే తన లోకంగా, తన కోసం బతుకుతున్నాడు సామ్రాట్ అని అసలు నిజం చెబుతాడు బాబాయి.
అమ్మానాన్న లేరన్న నిజం హనీకి ఎప్పటికీ తెలియకూడదని నేను ప్రెస్ వాళ్ల ముందు మౌనంగా ఉన్నాను. ఐయామ్ సారీ అని అంటాడు సామ్రాట్. దీంతో లేదు సామ్రాట్ గారు మా వాడే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. వాడి తరుపున నన్ను క్షమించండి అని వేడుకుంటుంది తులసి.
దీంతో నాకు అభి మీద కోపం లేదు అంటాడు సామ్రాట్. ఏమీ అనుకోకపోతే ఒక మాట అడగొచ్చా బాబు అంటాడు పరందామయ్య. పాప కోసం ఒంటరిగా బతికే బదులు పెళ్లి చేసుకుంటే హనీకి తల్లిని తీసుకొచ్చినట్టు ఉంటుంది కదా అంటాడు పరందామయ్య.
కానీ.. నాకు హనీయే లోకం అంటాడు సామ్రాట్. ఒక్క రోజు కూడా హనీని వదిలి ఉండలేను. హనీని అందుకే మీ ఇంటికి పంపించకుండా మిమ్మల్ని మా ఇంటికి రమ్మన్నాను. మీరు నేను హనీకి తండ్రిని కాదు అనే నిజాన్ని మీరు మీలోనే దాచుకోండి.
తన బాధను చూసి నేను తట్టుకోలేను అంటాడు సామ్రాట్. మా అందరి తరుపున నేను మాటిస్తున్నాను.. ఈ నిజాన్ని మేము ఇక్కడే మరిచిపోతాం అంటుంది తులసి. నందు, లాస్య కూడా అదే చెబుతారు. ఇక మేము వెళ్లొస్తామండి అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఇంటికి వెళ్లాక పరందామయ్య, తులసి ఇద్దరూ మాట్లాడుకుంటారు. మనం తప్పు చేశాం మామయ్య అంటుంది తులసి. ఆయన సంతోషాన్ని మనం దూరం చేశాం. హనీ గతాన్ని ఇంకెప్పుడు సామ్రాట్ గారి ముందు తీసుకురావద్దు అని పరందామయ్యతో అంటుంది తులసి.
కట్ చేస్తే సామ్రాట్ తన చెల్లెలు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో హనీ అక్కడికి వస్తుంది. సామ్రాట్ ఏడ్వడం చూస్తుంది హనీ. ఎందుకు నాన్నా ఏడుస్తున్నావు అని అడుగుతుంది హనీ. దీంతో అదేం లేదమ్మా అంటాడు సామ్రాట్. దీంతో తనను హత్తుకుంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు.
మరోవైపు తులసి గురించి ప్రత్యేక కథనం టీవీలో వస్తుంది. సామ్రాట్, తులసి ఇద్దరి గురించి వార్తల్లో వస్తుంటుంది. అందరూ వాళ్ల స్టోరీని చూస్తారు. తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసిపోవడంలో తప్పేం లేదు. కానీ.. సామ్రాట్ గారు ఎందుకు ఓపెన్ గా వాళ్ల రిలేషన్ గురించి మాట్లాడలేదు. తులసి గారు మాత్రమే ఎందుకు మాట్లాడారు.
వీళ్ల రిలేషన్ షిప్ గురించి ఎప్పుడు అసలు నిజం బయటపడుతుందో వేచి చూడాలి. ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ అంటూ ఆ కథనం రావడంతో మామ్.. ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా అంటాడు అభి. కానీ.. అభి మాత్రం వినడు. వాళ్లెవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు.
ఒంటిరిని అయిపోతున్నా మామ్ బాధగా ఉంది అని అంటాడు అభి. కట్ చేస్తే తులసి ఇక మీ ఆఫీసులో పని చేయకూడదు అని సామ్రాట్ దగ్గరికి వెళ్లి చెబుతుంది అనసూయ. దీంతో తులసి గారికి అన్యాయం చేస్తున్నారేమో అని అంటాడు సామ్రాట్. దీంతో ఇందులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పి వెళ్లిపోతుంది అనసూయ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Dil Raju : పుష్ప 2 ప్రీమియర్ షో వివాదంలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి అందరికీ…
Cyber Crime : 39 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్ కు బలి అయ్యాడు. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు.…
Sukumar : లెక్కల మాస్టారు సుకుమార్ తాజాగా పుష్ప2 చిత్రంతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.…
Squid Game 2 Review : నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయిన కొరియన్ వెబ్ సిరీస్ లలో…
Loan : పరిస్థితుల కారణంగా చాలామంది తమ ద్రవ్య అవసరాలను తీర్చుకోవడానికి బాహ్య సహాయాన్ని కోరవలసి ఉంటుంది. కొందరు తమ…
Balakrishna Jr NTR : నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగింది అన్నది అందరు…
Rohit Sharma : మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భారత ఆటగాళ్లు…
Womens : మహిళలు రోజు దిన చర్యలో చిన్న చిన్న తప్పులే ఆ తర్వాత వేల వెలకట్టలేని మూలిం చెల్లించుకోవాల్సి…
This website uses cookies.