Intinti Gruhalakshmi 29 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 సెప్టెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 750 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను చూస్తూ ఉండలేను మామ్. ఐలవ్యూ మామ్ అంటూ.. తన కాళ్ల మీద పడతాడు అభి. దీంతో తులసి తట్టుకోలేదు. తను కూడా ఏడుస్తుంది. ఏం చేయాలో తనకు అర్థం కాదు. అభి కూడా ఏడుస్తాడు. దీంతో లే నాన్న అంటుంది. ఏడవకు అంటుంది. అబద్ధం చెప్పడం లేదు మామ్. నన్ను నమ్ము మామ్.. ఒట్టు అంటాడు అభి. దీంతో ఏడవకు నాన్న అంటుంది తులసి. తనను హత్తుకుంటుంది. ఆ తర్వాత ప్రేమ్ కూడా వచ్చి ఓదార్చుతాడు. నీ ఆరాటం అర్థం అయింది. నీ బాధ తెలిసింది. నువ్వు నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావో.. నా గురించి నేను అంతకంటే ఎక్కువ ఆలోచిస్తుంటాను అంటుంది తులసి. ఈ ఇంటి పరువు పోకూడదని నేను అంతకంటే ఎక్కువ కంగారు పడుతుంటాను. జీవితాన్ని అంత ఈజీగా తీసుకోను కానీ.. జీవితం విలువ నాకు తెలుసు అంటుంది తులసి.
నా విషయంలో ఏదైనా తప్పు జరుగుతుంది అనిపిస్తే.. తప్పు చేస్తున్నాను అనిపిస్తే అడిగే హక్కు, నిలదీసే హక్కు మీకు ఎప్పుడూ ఉంటుంది. మీకు, ఈ కుటుంబానికి తలవంపులు తెచ్చే పని నేను ఏనాడూ చేయను. అలా ఒకవేళ చేయాల్సి వస్తే అదే నా జీవితంలో ఆఖరి రోజు అవుతుంది. ఆ తర్వాత మీ అమ్మ మీకు కనబడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. మరోవైపు మా గురించి ఇంత హంగామా ఎందుకు అని బాబాయితో అంటాడు సామ్రాట్. దాన్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో ఉండదు అంటాడు బాబాయి. ఎథిక్స్ ఉండవా బాబాయి అంటే.. నువ్వు సెలబ్రిటీవి. సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూడాలని అందరూ అనుకుంటారు అంటాడు బాబాయి.
నా గురించి కాదు బాబాయి తులసి గురించి అని అంటాడు సామ్రాట్. తులసి ఉన్న పరిస్థితి వేరు. జీవితంలో ఎదురు దెబ్బలతో చాలా దూరం ప్రయాణం చేసింది. ఇంట్లో వాళ్లకు తులసి మీద చాలా గౌరవం ఉంది. అందుకే తనను అడ్డుకోరు అని అంటాడు బాబాయి.
కట్ చేస్తే అభి.. ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. దీంతో అంకిత భోజనం తీసుకొచ్చి కడుపు మాడ్చుకోకు.. అన్నం తిను. అప్పుడైనా ఇప్పుడైనా నీ మాటలను ఎవ్వరూ తప్పు పట్టడం లేదు. కానీ.. మాట్లాడే పద్ధతిని తప్పుపడుతున్నారు.. అని చెబుతుంది అంకిత.
దీంతో నేను కొన్ని సార్లు హార్ష్ గా మాట్లాడి ఉండొచ్చు కానీ.. ఆ పరిస్థితిని క్రియేట్ చేసిందే మీరు అంటాడు అభి. ఆ తర్వాత కూల్ అవుతాడు. అంకిత తినిపిస్తే తింటాడు. కట్ చేస్తే అనసూయ కూరగాయల కోసం బయటికి వెళ్తుంది అనసూయ. అక్కడ మీ మాజీ కోడలు వల్ల మీ ఫ్యామిలీకి బాగా పబ్లిసిటీ దొరుకుతోంది కదా అంటారు అక్కడి మహిళలు.
మొగుడిని వదిలేసిన నీ మాజీ కోడలు పద్ధతిగా ఉంటుందని అనుకున్నాం కానీ.. ఏంటి ఆ బాగోతం. అచ్చోసిన ఆంబోతులా ఊరిమీద వదిలేశారా అంటారు. మీ ఉత్తుత్తి కొడుకు సామ్రాట్ ఉన్నాడుగా. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా ఆ సామ్రాట్ ను వదలను అని ఎలా చెప్పింది అంటూ నాలుగు మాటలు అంటారు అందరూ.
మరోవైపు సామ్రాట్.. తులసికి ఫోన్ చేస్తాడు. మిమ్మల్ని ఆఫీసుకు రావద్దంటూ ఎవరైనా అడ్డు పడుతున్నారా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో నాకేం కంగారు లేదు అంటుంది తులసి. నా కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నారు అని అంటాడు సామ్రాట్.
నేను ఆఫీసుకే బయలుదేరుతున్నాను అంటుంది తులసి. రేపు మా హనీ బర్త్ డే అంటాడు సామ్రాట్. రేపు ఈవెనింగ్ పార్టీ. ఇంట్లో వాళ్లు అందరినీ తీసుకొని తప్పకుండా రావాలి అంటాడు. దీంతో సరే అంటుంది తులసి. కోపంతో ఇంటికి వస్తుంది అనసూయ. మన పక్కింటి అమ్మలక్కలకు ఏం పనిలేదు అంటుంది.
నా కోడలు గురించి ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుతున్నారు అంటూ అందరితో అంటుంది అనసూయ. ఎంతమందికి సమాధానం చెప్పాలి అని అంటుంది అనసూయ. ఇక లాభం లేదు.. తులసిని పిలిచి చెప్పేద్దాం. ఆ సామ్రాట్ తో కలిసి పనిచేయడం మానుకోమని చెబుతాను అంటుంది అనసూయ.
ఆంటీతో ఈ విషయం గురించి మాట్లాడుదాం అంటుంది అంకిత. వద్దు.. తులసి తన ఇష్టం ఉన్నట్టు చేసుకునే అధికారం తనకు ఉంది అని అంటాడు పరందామయ్య. అభితో పాటు నువ్వు కూడా ఇలా మారావా అంటారు అందరు. ఇంతలో తులసి రాబోతుండగా ఎవ్వరూ ఆ టాపిక్ మాట్లొద్దని అంటాడు పరందామయ్య.
ఇంతలో తులసి.. రేపు హనీ బర్త్ డే ఉందట.. సామ్రాట్ రమ్మన్నారు అని అంటుంది. దీంతో అనసూయకు కోపం వస్తుంది. కట్ చేస్తే తులసి ఆఫీసుకు వెళ్తుంది. జనరల్ మేనేజర్ కుర్చీలో కూర్చొని పని చేస్తుండగా చూసిన లాస్య, నందుకు కోపం ఎక్కువవుతుంది.
తులసిని ఎలాగైనా ఇరికించాలని ఓ ఫైల్ మీద తను సంతకం పెట్టేలా చేస్తారు లాస్య, నందు. దీంతో సామ్రాట్ ఈ విషయంలో తులసిపై నోరు పారేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.