Intinti Gruhalakshmi 3 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 సెప్టెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 728 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు అలా మాట్లాడకుండా వెళ్లిపోవడంలో తులసి ఉద్దేశం ఏంటి. తన పర్సనల్ విషయాలు నాకు అనవసరం అనా. తను అసలు ఏమనుకుంటుందో ఫోన్ చేసి ఇప్పుడైనా మాట్లాడొచ్చు కదా అని అనుకుంటాడు. అసలు తులసి గారి మౌనానికి అర్థం ఏంటి. నేనంటే నిర్లక్ష్యమా. అసలు నన్ను పట్టించుకోవడం లేదు ఏంటి.. అని ఓవైపు సామ్రాట్ అనుకుంటుండగా.. మరోవైపు సామ్రాట్ గారు ఇప్పటి వరకు ఫోన్ చేసి కూడా మాట్లాడలేదంటే ఆయన నా మీద ఇంకా కోపంగా ఉన్నట్టున్నారు అని అనుకుంటుంది తులసి. మరోవైపు తులసి గారికి నేనే ఫోన్ చేస్తాను అని అనుకుంటాడు సామ్రాట్. ఇంతలో తులసి మెసేజ్ చేస్తుంది. తులసి ఏం మెసేజ్ పెట్టిందో అని చూస్తాడు సామ్రాట్. ఆ మెసేజ్ చూసి షాక్ అవుతాడు సామ్రాట్.
ఏ సంతోషానికైనా ముగింపు బాధే అవుతుంది. మ్యూజిక్ స్కూల్ విషయంలో ఇంతవరకు మీరు చేసిన సాయానికి ధన్యవాదాలు. ఈరోజుతో మీ వ్యాపార భాగస్వామ్యాన్ని వదులుకుంటున్నాను… అంటూ దండం పెట్టిన ఎమోజీలు పెట్టి తులసి అని రాసి మెసేజ్ పంపిస్తుంది తులసి. ఇంతలో తులసికి మరో మెసేజ్ వస్తుంది. అది సామ్రాట్ పంపించిందేమో అని అనుకుంటుంది కానీ.. కాదు. వెంటనే బాబాయి దగ్గరికి వెళ్లి మీ తులసి గారు ఏమనుకుంటున్నారు. తను నా బిజినెస్ పార్ట్ నర్ గా ఉండరట. నా ప్రాజెక్ట్స్ అన్నీ పక్కన పెట్టి ఆవిడ కోసం నేను ఇంత చేస్తే తను ఏం చేసిందో తెలుసా? ఈరోజుతో మీ వ్యాపార భాగస్వామ్యాన్ని వదులుకుంటున్నాను అంటూ మెసేజ్ పెట్టింది అంటాడు సామ్రాట్. తప్పు చేసింది తను.. ఆత్మాభిమానం తులసి గారికే కాదు.. నాకు కూడా ఉంది అంటాడు. దీంతో తులసి ఏం తప్పు చేసిందిరా అని అడుగుతాడు.
దీంతో నందు గారు తన మాజీ భర్త అని ఎందుకు చెప్పలేదు అంటాడు. దీంతో నువ్వు అడిగావా.. పోనీ నువ్వు ఎవరివి చెప్పడానికి అంటాడు బాబాయి. పోనీ.. నీ జీవితంలో ఉన్న విషయాలను నువ్వు చెప్పావా? చెప్పలేదు కదా. నందు కూడా ఈ విషయం చెప్పలేదు కదా అంటాడు బాబాయి.
సరే.. అవన్నీ పక్కన పెట్టు.. మ్యూజిక్ స్కూల్ విషయంలో ఇలా చేయడం ఏంటి.. అలా చెప్పాపెట్టకుండా మ్యూజిక్ స్కూల్ ను ఆపేయడం ఏంటి అంటాడు సామ్రాట్. తులసి అంటే నీకు ఇష్టం కదా.. ప్రేమ కదా.. తను ఇక నీకు కనిపించదని ఇలా చేస్తున్నావు కదా అంటాడు బాబాయి.
దీంతో ఊరుకో బాబాయి. మధ్యలో నీ గోల ఏంటి అంటాడు సామ్రాట్. కట్ చేస్తే శృతి సూట్ కేసు తన రూమ్ లో ఖాళీగా కనిపిస్తుంది. నా చీరలు అన్నీ ఏమయ్యాయి అని టెన్షన్ పడుతుంది శృతి. ఇంతలో బయటికి వస్తుంది. ఏమైంది వదిన అని అడుగుతుంది దివ్య.
నా చీరలు కనిపించడం లేదు అని అంటుంది. దీంతో ఇంతకుముందు ప్రేమ్ అన్నయ్య నీ చీరలను తీసుకెళ్లడం చూశా అంటుంది. దీంతో నా చీరలతో ఏం చేస్తున్నాడు అని బయటికి వచ్చి చూస్తుంది. ఇంతలో ప్రేమ్ తన చీరలను గార్డెన్ లో వేస్తాడు.
నా చీరలను ఇక్కడ ఏం చేస్తున్నావు. వీటిని తీసుకొచ్చి ఇలా మట్టిలో పడేశావు ఏంటి అంటుంది. దీంతో నా ఇష్టం. నా రూమ్ లో ఉన్నాయి. అందుకే తీసుకొచ్చాను అంటాడు. ఇవి ఉతకని చీరలు అంటుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ ఆర్టికల్ చూశాను.
ఏ పనీ పాటా లేకుండా ఖాళీగా కూర్చొంటే కొవ్వుతో పాటు ఈగో కూడా పెరుగుతుందట అంటాడు. అందుకే ఈ చీరలను తడిపేద్దామనుకుంటున్నా అంటాడు. వద్దు అని బతిమిలాడుతుంది శృతి. అయినా కూడా వినడు ప్రేమ్. ఇవన్నీ నేను ఇప్పుడు ఉతకలేను అంటుంది. అయినా కూడా వాటి మీద నీళ్లు పోస్తాడు ప్రేమ్.
మరోవైపు నందు ఇంటికి వెళ్తుంది తులసి. నా ఆత్మాభిమానాన్ని రక్షించుకోవడానికి.. నా నిర్దోషితత్వాన్ని నిరూపించుకోవడానికి నేను ఇప్పుడు రావాల్సి వచ్చింది నందగోపాల్ గారు అంటుంది తులసి. సామ్రాట్ గారి బిజినెస్ పార్టనర్ అయిన తులసి ఎక్కడ.. ఆఫ్టరాల్ జీతగాడిని అయిన నేను ఎక్కడ. మీరు నా హెల్ప్ అడగడం ఏంటి అని అంటాడు నందు.
మనిద్దరి మధ్య ఒక పెద్దమనుషుల తరహా ఒప్పందం ఉంది అంటుంది తులసి. కానీ.. మీరే ఆ ఒప్పందాన్ని కాదని సామ్రాట్ గారికి మన విషయం తెలిసేలా చేశారు. నేను దాచడం వల్లనే తులసి ఈ విషయం చెప్పలేదు అని మీరు సామ్రాట్ గారికి చెప్పాలి అంటుంది తులసి.
దీంతో నందు, లాస్య ఇద్దరూ పగలబడి నవ్వుతారు. తులసి చెబితే నమ్మని సామ్రాట్ నేను చెబితే నమ్ముతారా. మన ప్రాజెక్ట్ పక్కనపెట్టి తులసి ప్రాజెక్ట్ ను ఫైనలైజ్ చేసిన సామ్రాట్ గారు.. అంటూ ఇద్దరూ తనను హేళన చేస్తారు. దీంతో తులసికి కోపం వస్తుంది.
తులసి ఎంత చెప్పినా నందు మాత్రం వినడు. సామ్రాట్ తో తన మధ్య ఏదో ఉందని హేళన చేస్తూ అనుమానంగా మాట్లాడటంతో తులసి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు తులసిని తప్పుగా సామ్రాట్ ముందు మాట్లాడుతారు నందు, లాస్య. నందు చెబుదామన్నా వద్దు అని తులసే అన్నదని చెబుతుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్‌లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
This website uses cookies.