
Good News : ప్రభుత్వం పిపిఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్పీఎస్ లేదా కిసాన్ వికాస్ పత్ర మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నివేదికల ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటులో మార్పులు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. రికార్డు స్థాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణంతో వడ్డీ రేటు పెరుగుదల మధ్య బ్యాంకుల వడ్డీ రేటు మునుపటి కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చని అంచనా. ప్రభుత్వం చేసిన మార్పులు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఆర్.బి.ఐ మూడుసార్లు రేపో రేటును 1.4% పెంచింది. దీని తర్వాత వివిధ బ్యాంకులు ఎఫ్ డి, ఆర్ డీ వడ్డీ రేటును పెంచాయి.
చిన్న పొదుపు పథకం పై వడ్డీ రేట్లపై ఈ సమీక్ష 2022 అక్టోబర్ నుండి డిసెంబర్ లో జరగనుంది. ఈసారి ప్రభుత్వం నుంచి పొదుపు పథకాలపై వడ్డీ రేటు పెరుగుతుందని అంచనా ఉంది. చాలా కాలంగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. రానున్న కాలంలో వడ్డీరేట్లలో మార్పు ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని పెంచడానికి బ్యాంకులు, ఆర్బిఐ రెండు అనుకూలంగా ఉన్నాయి. ఆర్బిఐ మే నుండి రెపో రేటును మూడుసార్లు పెంచింది. ఇది ప్రస్తుతం ఐదు పాయింట్ నాలుగు శాతం వద్ద కొనసాగుతుంది. రానున్న కాలంలో 25 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ పథకాల్లో ఎటువంటి మార్పులు రాలేదు.
Good News Govt may increase interest on PPF, sukanya samruddhi yojana schemes
అటువంటి పరిస్థితుల్లో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పై రాబడి కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేట్లు సవరించబడతాయి. చిన్న పొదుపు పథకాలపై వడ్డీని ప్రభుత్వం ప్రతి మూడు నెలలకి పరీక్షిస్తుంది. ఈ సమీక్ష సమయంలో వడ్డీ రేటును పెంచాలా తగ్గించాలా లేదా స్థిరంగా ఉంచాలనే నిర్ణయం తీసుకోబడుతుంది. ఈ వడ్డీ రేట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్ పై 7.1 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. అదే సమయంలో సుకన్య సమృద్ధి యోజన లో పెట్టుబడి పెట్టే వారికి 7.6% వార్షిక రాబడి ఇవ్వబడుతుంది. అదేవిధంగా కిసాన్ వికాస్ పత్ర పై వడ్డీ రేటు 6.9 శాతం గా ఉంది. అదే విధంగా మీరు నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ల ఖాతాలో 5.8% రాబడిన కలిగి ఉంటారు.
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
This website uses cookies.