Intinti Gruhalakshmi 30 May Today Episode : అంకిత బర్త్ డే పార్టీలో తులసికి అవమానం. దీంతో తులసి షాకింగ్ నిర్ణయం.. అభి ఏం చేస్తాడు?

Intinti Gruhalakshmi 30 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం అయింది. 30 మే 2022, సోమవారం ఎపిసోడ్ 645 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి కొన్ని బొమ్మలను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పరందామయ్య వస్తాడు. నువ్వేంటి వంటింట్లో బొమ్మల కొలువు పెట్టావు అని అడుగుతాడు. దీంతో ఇది బొమ్మల కొలువు కాదు.. ఎప్పటికీ అమ్మ గుండెల్లో ఉండే పిల్లల కొలువు. వీడు పెద్దోడు అభి. పక్కనే నా కోడలు అంకిత.. జంట ముద్దుగా ఉన్నారు కదా అంటుంది తులసి. పక్కనే నా చిన్నకొడుకు ప్రేమ్, నా కోడలు శృతి అని చెబుతుంది తులసి. వీడు అమ్మ కూచి అంటుంది. అమ్మను చూస్తే కానీ.. అమ్మతో మాట్లాడితే కానీ.. వీడికి తెల్లారినట్టు కాదు. పాపం ఇప్పుడు ఏం చేస్తున్నాడో అని అనుకుంటుంది తులసి. నా చిన్న కోడలు శృతి.. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంటారు కదా మామయ్య అంటుంది తులసి.

intinti gruhalakshmi 30 may 2022 full episode

దీంతో ప్రాణం ఉన్న మనుషులను దూరం పెట్టి.. ప్రాణం లేని బొమ్మలను చూసుకొని మురిసిపోతున్నావా తులసి అని అడుగుతాడు పరందామయ్య. ప్రాణం లేదని ఎందుకు అనుకుంటావు మామయ్య. వీటికి ప్రాణం ఉంది అంటుంది తులసి. దూరం చేసుకోవడం ఎందుకు.. దిగులు చెందడం ఎందుకు అంటాడు పరందామయ్య. దీంతో నాకే కాదు.. ఏ అమ్మకైనా ఈ బాధ తప్పదు అంటుంది తులసి. ఎన్నిసార్లు తుడిచినా అభి మీద దుమ్ము పడుతూనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సిందే అని అంటుంది తులసి. ఇంతలో ఆ బొమ్మ కింద పడబోతుంది. దీంతో ఆ బొమ్మను పట్టుకుంటుంది తులసి.

దీంతో చూశావా తులసి.. నువ్వు ఎంత పట్టుకుందామనుకున్నా.. అభి చేయి జారిపోతున్నాడు అంటాడు పరందామయ్య. దీంతో వాడు చేజారిపోవాలనుకున్నా.. నేను చేజారిపోనివ్వను అని అంటుంది తులసి. ఆ బొమ్మలను చూసి మురిసిపోతుంది.

కట్ చేస్తే.. నాకు ఇష్టం లేదు. ఈవిషయంలో నేను ఎవ్వరి మాట వినను అంటుంది అంకిత. నందు అంకుల్ వాళ్లు నా బర్త్ డే సెలబ్రేట్ చేయడం ఏంటి అంటుంది అంకిత. ఆయన మా డాడ్ అంటాడు అభి. ఆయన మీ మామ అంటుంది గాయత్రి.

అది ఒకప్పుడు అంటుంది అంకిత. మనం కలిసి ఉన్న రోజుల్లో ఎప్పుడైనా మన మీద ప్రేమ చూపించారా అంటుంది అంకిత. వాళ్లను ఎలా అర్థం చేసుకోవాలి. ఎందుకు నమ్మాలి అంటుంది అంకిత. అలా అని వాళ్ల నాన్నకు అభిని దూరంగా పెట్టడం తప్పు కదా అమ్మ అంటాడు వాళ్ల నాన్న.

Intinti Gruhalakshmi 30 May Today Episode : అంకితను బర్త్ డే పార్టీకి ఒప్పించిన అభి, గాయత్రి

ఇప్పటికే అరేంజ్ మెంట్స్ కూడా పూర్తయ్యాయట ఇప్పుడు వద్దంటే ఎలా అంటాడు. నువ్వు ఒప్పుకుంటావు కదా అని అరేంజ్ మెంట్స్ అన్నీ పూర్తి చేశారు అంటుంది గాయత్రి. మాటిచ్చి వెనక్కి తప్పుకుంటే.. మన పరువు మనం తీసుకోవడమే. ఈ సారి నామాట కాదనకు అమ్మ అని బతిమిలాడుతుంది గాయత్రి.

ఆపేక్షగా నీ బర్త్ డే జరిపిస్తామంటున్నారు కదా. ఇందులో తప్పేముంది అమ్మ. ఏది ఏమైనా.. నీకు తెలియకుండా ఇంకోసారి ఇలా చేయం అని మీ అమ్మ మాట ఇచ్చింది కదా. ఈసారికి ఒప్పుకో అమ్మ ప్లీజ్ అంటాడు అంకిత తండ్రి. అంకిత ప్లీజ్ అంటాడు అభి.

దీంతో అందరూ ఇంతగా బతిమిలాడుతున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. కానీ… ఫంక్షన్ టైమ్ లో నాకు ఇష్టం లేని పనులు చేయమనకూడదు. ఏది జరిగినా అంతా నా ఇష్ట ప్రకారం జరగాలి.. ఓకేనా అంటుంది అంకిత. దీంతో సరే బేబీ అంటుంది గాయత్రి.

మరోవైపు తులసి పిల్లలకు మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటుంది. దివ్య తనకు ఎలా నేర్పిస్తుందో అని చూస్తుంటుంది దివ్య. ఇంతలో లాస్య, నందు వచ్చి.. ఇది నీ సామర్థ్యం. ఇంతేనా నీ పనితనం అంటూ లాస్య తులసిని అంటుంది. దీంతో దివ్యకు కోపం వచ్చి.. అందుకే నీ కంపెనీ మూతపడింది కదా అంటుంది.

నీ కంపెనీ మూత పడటానికి కారణం నీ సామర్థ్యమే కదా అంటుంది. ఆ తర్వాత అనసూయ కూడా లాస్య మీద విరుచుకుపడుతుంది. అదంతా పక్కన పెట్టండి. అసలు.. వీళ్లెందుకు వచ్చారు అని అడుగుతాడు పరందామయ్య. దీంతో రేపు అంకిత బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం అని చెబుతాడు నందు.

పార్టీకి తులసిని పిలవడం లేదు. అమ్మానాన్న మీరిద్దరూ రావాలి అంటాడు నందు. దివ్యను కూడా రావాలి అంటాడు. మాకేమౌతుందని తులసిని పిలవాలి అంటాడు నందు. నీకేం కాదు కానీ.. అంకితకు అత్తయ్య అవుతుంది అంటాడు పరందామయ్య.

నీకేం సంబంధం లేదు అనుకున్న వాళ్లతో మాకు కూడా సంబంధం లేదు అంటుంది అనసూయ. వాళ్లంతా తులసి మాయలో ఉన్నారు లాస్య. మనం ఏం చేయలేం అంటాడు నందు. వాళ్లేం నష్టపోతున్నారో భవిష్యత్తులో వాళ్లకే తెలుస్తుంది పదా వెళ్దాం అంటాడు నందు.

దీంతో ఒక్క నిమిషం నందు అని చెప్పి అనసూయకు బొట్టు పెట్టబోతుంది లాస్య. దీంతో వద్దు అని వారిస్తుంది అనసూయ. రాని పేరెంటానికి ఇంత పద్ధతిగా పిలుపులెందుకు. వెళ్లు ఇక్కడి నుంచి.. వినపడిందా అని అంటుంది అనసూయ.

దీంతో లాస్యకు కోపం వస్తుంది. అక్కడి నుంచి ఇద్దరూ వెళ్లిపోతారు. మరోవైపు ప్రేమ్ వెనుకనుంచి వచ్చి శృతిని భయపెడతాడు. ఒకసారి కళ్లు మూసుకో అంటాడు ప్రేమ్. సర్ ప్రైజ్ ఇస్తా అంటాడు. దీంతో కళ్లు మూసుకుంటుంది శృతి. తన కోసం చీర కొనుక్కొని తీసుకొస్తాడు ప్రేమ్.

ఎందుకు కొన్నావు ఈ చీర అంటుంది శృతి. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంచెం ఖర్చు పెట్టి పెళ్లానికి చీర కొనడం తప్పా అంటాడు. దయచేసి ఈ చీరను తీసుకో అంటాడు. సంసారం, ఖర్చులు కూడా ఆలోచించాలి కదా. ప్రేమతో సంసారం గడవదు అంటుంది శృతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

40 minutes ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

2 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

4 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

5 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

6 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

7 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

8 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

9 hours ago