Intinti Gruhalakshmi 4 Nov Today Episode : తులసి కోసం తల్లి నెక్లెస్ తాకట్టు పెట్టిన శృతి.. ఆ డబ్బులను వద్దన్న తులసి.. అంకిత ఇచ్చిన డబ్బులు తీసుకున్న తులసి

Intinti Gruhalakshmi 4 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ నవంబర్ 4, 2021, గురువారం ఎపిసోడ్ 468 హైలైట్స్ ఏంటో చూద్దాం. నువ్వు మళ్లీ ఆఫీసుకు వెళ్లడం ఏంటి.. ఇదంతా తులసి ప్లాన్ అని లాస్య ఎంత చెప్పినా నందు వినడు. నువ్వు ఎందుకు ప్రాజెక్ట్ చేస్తా అని ఒప్పుకున్నావు అంటుంది లాస్య. ప్రాజెక్ట్ పూర్తి చేసి నేనేంటో నిరూపిస్తా అని చాలెంజ్ చేస్తాడు నందు. మంచి ప్లాన్ వేసి.. వాడిని ఆఫీసుకు తీసుకురావడానికి భలే ప్లాన్ వేశావమ్మా అని పరందామయ్య తులసితో అంటాడు.

intinti gruhalakshmi 4 november 2021 full episode

ఆఫీసు ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు తులసి తెగ టెన్షన్ పడుతుంది. జీతాలకు 5 లక్షలు కావాలి ఎలా అని ఆలోచిస్తుంది. తన ఫ్యాక్టరీ మేనేజర్ కు ఫోన్ చేస్తే 2.5 లక్షలే ఉన్నట్టు చెబుతాడు. మిగితా 2.5 లక్షలు పరిస్థితి ఎలా అని అనుకుంటుంది తులసి. ఇవన్నీ శృతి వింటుంది. ఎలాగైనా తనకు సాయం చేయాలని అనుకుంటుంది. తన తల్లి నెక్లెస్ ను తాకట్టు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. వెంటనే ప్రేమ్ ను పిలిచి.. అది తాకట్టు పెట్టమని చెబుతుంది. కానీ.. ప్రేమ్ వద్దంటాడు. అయినా కూడా శృతి వినదు. మన కోసం తనది కాని కష్టాన్ని మోస్తోంది. ఆంటి డబ్బుల కోసం ప్రయత్నిస్తోంది. ఇంకేం ఆలోచించకు ప్రేమ్.. తీసుకో అని చెప్పి నెక్లెస్ ను ఇస్తుంది.

కట్ చేస్తే అంకిత తన మమ్మీని డబ్బులు అడుగుతుంది. 2.5 లక్షలు ఇస్తుంది వెళ్లి తీసుకురా అని అభికి చెబుతుంది అంకిత. కానీ.. అభికి ఈ విషయం నచ్చదు. మీ ఇంట్లో నీ ముందే నన్ను ఎంతలా తిట్టిందో తెలుసు కదా.. అంటాడు అభి. ఆంటికి హెల్ప్ చేయాలి కదా.. వెళ్లు.. అని అభిని పంపిస్తుంది అంకిత.

Intinti Gruhalakshmi 4 Nov Today Episode : ప్రేమ్ ను అవమానించిన అంకిత

ఆంటికి హెల్ప్ చేయడానికి కాదు.. శృతి కన్నా ఎక్కువ మార్కులు కొట్టేసి.. తనను డామినేట్ చేయడానికి.. అని అభి పోయాక తనలో తాను అనుకుంటుంది అంకిత. మరోవైపు డబ్బుల కోసం తెగ టెన్షన్ పడుతుంటుంది తులసి. ఇంతలో శృతి, ప్రేమ్ వచ్చి.. అమ్మ అని అంటాడు. ఏంట్రా అనగానే డబ్బులు తీసి తనకు ఇస్తాడు. ఏంట్రా ఈ డబ్బులు అంటే.. జీతం డబ్బులు కాదమ్మా.. కంపెనీలో స్టాఫ్ కు జీతం తక్కువ పడిందని తెలిసింది. ఈ 50 వేలు తీసుకో అమ్మా అంటాడు. ఇంత డబ్బు ఎక్కడిదిరా అంటే.. కంపెనీలో అడ్వాన్స్ తీసుకున్నా అని చెప్పు అంటుంది శృతి. ఇంతలో అంకిత, అభి వస్తారు. నీలా అంత ఈజీగా అబద్ధం చెప్పలేడు ప్రేమ్… అని శృతితో అంటుంది అంకిత.

intinti gruhalakshmi 4 november 2021 full episode

వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకు.. నేను చెబుతాను ఆంటి. వాళ్ల అమ్మ నెక్లెస్ ను శృతి తాకట్టు పెట్టించింది అని చెబుతుంది అంకిత. దీంతో తులసి షాక్ అవుతుంది. ఏంటమ్మా శృతి.. అలా చేయకూడదు.. అంటుంది. ఇది పద్ధతేనా.. ఒక్క మాట ముందు నాకు చెప్పి ఉండాల్సింది కదా.. అని ప్రేమ్ తో అంటుంది తులసి. ఆ డబ్బు వెనక్కి ఇచ్చి మీ అమ్మ నెక్లెస్ తెచ్చుకో శృతి అంటుంది అంకిత.

అభి.. అలా చూస్తూ నిలుచున్నావేంటి.. ఆ రెండున్నర లక్షలు ఆంటీకి ఇవ్వు.. అంటుంది అంకిత. తీసుకో అమ్మ అంటాడు అభి. ఒక్కసారిగా 2.5 లక్షలు ఎక్కడివిరా అంటే.. లోన్ తీసుకున్నాడు ఆంటి అంటుంది అంకిత. నీ పెద్ద కొడుకు నీ బాధ్యతల్లో పాలు పంచుకోవడం కన్న గొప్ప మనసుకు మెచ్చుకోవాలి అని పరందామయ్య అంటాడు. దీంతో తులసి కూడా సంతోషపడుతుంది. కానీ.. ప్రేమ్ ను అంకిత హేళన చేసి మాట్లాడుతుంది. దీంతో ప్రేమ్ బాధపడిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

19 minutes ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

37 minutes ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

1 hour ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

2 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

3 hours ago

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!

Trump  : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…

4 hours ago

Spicy Food : కారం తిన్న వెంటనే నోరు మండుతుంది ఎందుకు? దీని వెనుక‌ శాస్త్రీయ కారణం ఇదే!

Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…

6 hours ago

Vastu Tips : ఇంట్లో పావురాల గూడు శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏమంటుంది తెలుసా?

Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…

7 hours ago