Intinti Gruhalakshmi 4 Nov Today Episode : తులసి కోసం తల్లి నెక్లెస్ తాకట్టు పెట్టిన శృతి.. ఆ డబ్బులను వద్దన్న తులసి.. అంకిత ఇచ్చిన డబ్బులు తీసుకున్న తులసి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 4 Nov Today Episode : తులసి కోసం తల్లి నెక్లెస్ తాకట్టు పెట్టిన శృతి.. ఆ డబ్బులను వద్దన్న తులసి.. అంకిత ఇచ్చిన డబ్బులు తీసుకున్న తులసి

Intinti Gruhalakshmi 4 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ నవంబర్ 4, 2021, గురువారం ఎపిసోడ్ 468 హైలైట్స్ ఏంటో చూద్దాం. నువ్వు మళ్లీ ఆఫీసుకు వెళ్లడం ఏంటి.. ఇదంతా తులసి ప్లాన్ అని లాస్య ఎంత చెప్పినా నందు వినడు. నువ్వు ఎందుకు ప్రాజెక్ట్ చేస్తా అని ఒప్పుకున్నావు అంటుంది లాస్య. ప్రాజెక్ట్ పూర్తి చేసి నేనేంటో నిరూపిస్తా అని చాలెంజ్ చేస్తాడు […]

 Authored By gatla | The Telugu News | Updated on :4 November 2021,12:40 pm

Intinti Gruhalakshmi 4 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ నవంబర్ 4, 2021, గురువారం ఎపిసోడ్ 468 హైలైట్స్ ఏంటో చూద్దాం. నువ్వు మళ్లీ ఆఫీసుకు వెళ్లడం ఏంటి.. ఇదంతా తులసి ప్లాన్ అని లాస్య ఎంత చెప్పినా నందు వినడు. నువ్వు ఎందుకు ప్రాజెక్ట్ చేస్తా అని ఒప్పుకున్నావు అంటుంది లాస్య. ప్రాజెక్ట్ పూర్తి చేసి నేనేంటో నిరూపిస్తా అని చాలెంజ్ చేస్తాడు నందు. మంచి ప్లాన్ వేసి.. వాడిని ఆఫీసుకు తీసుకురావడానికి భలే ప్లాన్ వేశావమ్మా అని పరందామయ్య తులసితో అంటాడు.

intinti gruhalakshmi 4 november 2021 full episode

intinti gruhalakshmi 4 november 2021 full episode

ఆఫీసు ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు తులసి తెగ టెన్షన్ పడుతుంది. జీతాలకు 5 లక్షలు కావాలి ఎలా అని ఆలోచిస్తుంది. తన ఫ్యాక్టరీ మేనేజర్ కు ఫోన్ చేస్తే 2.5 లక్షలే ఉన్నట్టు చెబుతాడు. మిగితా 2.5 లక్షలు పరిస్థితి ఎలా అని అనుకుంటుంది తులసి. ఇవన్నీ శృతి వింటుంది. ఎలాగైనా తనకు సాయం చేయాలని అనుకుంటుంది. తన తల్లి నెక్లెస్ ను తాకట్టు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. వెంటనే ప్రేమ్ ను పిలిచి.. అది తాకట్టు పెట్టమని చెబుతుంది. కానీ.. ప్రేమ్ వద్దంటాడు. అయినా కూడా శృతి వినదు. మన కోసం తనది కాని కష్టాన్ని మోస్తోంది. ఆంటి డబ్బుల కోసం ప్రయత్నిస్తోంది. ఇంకేం ఆలోచించకు ప్రేమ్.. తీసుకో అని చెప్పి నెక్లెస్ ను ఇస్తుంది.

కట్ చేస్తే అంకిత తన మమ్మీని డబ్బులు అడుగుతుంది. 2.5 లక్షలు ఇస్తుంది వెళ్లి తీసుకురా అని అభికి చెబుతుంది అంకిత. కానీ.. అభికి ఈ విషయం నచ్చదు. మీ ఇంట్లో నీ ముందే నన్ను ఎంతలా తిట్టిందో తెలుసు కదా.. అంటాడు అభి. ఆంటికి హెల్ప్ చేయాలి కదా.. వెళ్లు.. అని అభిని పంపిస్తుంది అంకిత.

Intinti Gruhalakshmi 4 Nov Today Episode : ప్రేమ్ ను అవమానించిన అంకిత

ఆంటికి హెల్ప్ చేయడానికి కాదు.. శృతి కన్నా ఎక్కువ మార్కులు కొట్టేసి.. తనను డామినేట్ చేయడానికి.. అని అభి పోయాక తనలో తాను అనుకుంటుంది అంకిత. మరోవైపు డబ్బుల కోసం తెగ టెన్షన్ పడుతుంటుంది తులసి. ఇంతలో శృతి, ప్రేమ్ వచ్చి.. అమ్మ అని అంటాడు. ఏంట్రా అనగానే డబ్బులు తీసి తనకు ఇస్తాడు. ఏంట్రా ఈ డబ్బులు అంటే.. జీతం డబ్బులు కాదమ్మా.. కంపెనీలో స్టాఫ్ కు జీతం తక్కువ పడిందని తెలిసింది. ఈ 50 వేలు తీసుకో అమ్మా అంటాడు. ఇంత డబ్బు ఎక్కడిదిరా అంటే.. కంపెనీలో అడ్వాన్స్ తీసుకున్నా అని చెప్పు అంటుంది శృతి. ఇంతలో అంకిత, అభి వస్తారు. నీలా అంత ఈజీగా అబద్ధం చెప్పలేడు ప్రేమ్… అని శృతితో అంటుంది అంకిత.

intinti gruhalakshmi 4 november 2021 full episode

intinti gruhalakshmi 4 november 2021 full episode

వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకు.. నేను చెబుతాను ఆంటి. వాళ్ల అమ్మ నెక్లెస్ ను శృతి తాకట్టు పెట్టించింది అని చెబుతుంది అంకిత. దీంతో తులసి షాక్ అవుతుంది. ఏంటమ్మా శృతి.. అలా చేయకూడదు.. అంటుంది. ఇది పద్ధతేనా.. ఒక్క మాట ముందు నాకు చెప్పి ఉండాల్సింది కదా.. అని ప్రేమ్ తో అంటుంది తులసి. ఆ డబ్బు వెనక్కి ఇచ్చి మీ అమ్మ నెక్లెస్ తెచ్చుకో శృతి అంటుంది అంకిత.

అభి.. అలా చూస్తూ నిలుచున్నావేంటి.. ఆ రెండున్నర లక్షలు ఆంటీకి ఇవ్వు.. అంటుంది అంకిత. తీసుకో అమ్మ అంటాడు అభి. ఒక్కసారిగా 2.5 లక్షలు ఎక్కడివిరా అంటే.. లోన్ తీసుకున్నాడు ఆంటి అంటుంది అంకిత. నీ పెద్ద కొడుకు నీ బాధ్యతల్లో పాలు పంచుకోవడం కన్న గొప్ప మనసుకు మెచ్చుకోవాలి అని పరందామయ్య అంటాడు. దీంతో తులసి కూడా సంతోషపడుతుంది. కానీ.. ప్రేమ్ ను అంకిత హేళన చేసి మాట్లాడుతుంది. దీంతో ప్రేమ్ బాధపడిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది