Intinti Gruhalakshmi 5 Dec Today Episode : ఒక్క రోజు మిడిల్ క్లాస్ వ్యక్తిగా సామ్రాట్ ఉంటాడా? బస్సులో ప్రయాణిస్తాడా? బస్సులో తులసి, సామ్రాట్ ఇద్దరూ ఏం చేస్తారు?
Intinti Gruhalakshmi 5 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 807 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరందామయ్య, అనసూయను బుట్టలో వేసుకుందామని ఎంత ప్రయత్నించినా లాస్యకు అస్సలు కుదరదు. ట్యాబ్లెట్లు ఇస్తే ఇవి ఇప్పటివి కావు.. సాయంత్రానివి అంటుంది అనసూయ. మమ్మల్ని కనీసం ఇలాగైనా బతకనివ్వు. కనీసం నా మనవరాలు పెళ్లి చూసేంత వరకు అయినా బతకనివ్వు అంటాడు పరందామయ్య. దీంతో లాస్యకు చాలా కోపం వస్తుంది. లాస్యకు భాగ్య సపోర్ట్ ఇస్తుంది. ఆ తులసి మనసు పెట్టి పని చేస్తే మనమేమో.. మనసు చంపుకొని పని చేస్తున్నాం అంటుంది భాగ్య. అది మనకు సెట్ అవడం లేదు అంటుంది భాగ్య. మరోవైపు బస్సులో వెళ్తుంటారు తులసి, సామ్రాట్. బస్సు ఎక్కారు కానీ.. ముందు మీ జేబులోని పర్సు, ఫోన్ చూసుకోండి అంటుంది.
దీంతో ఉన్నాయి అంటాడు సామ్రాట్. ఆ తర్వాత టికెట్ తీసుకో అని కండక్టర్ అంటాడు. దీంతో రెండు వేల రూపాయల నోటు ఇచ్చి హైటెక్ సిటీకి టికెట్ ఇవ్వు అంటాడు సామ్రాట్. దీంతో 20 రూపాయల టికెట్ కు 2000 రూపాయల నోటు ఇచ్చావా అని కండక్టర్ సీరియస్ అవుతాడు. ఆ తర్వాత దిగేటప్పుడు చేంజ్ తీసుకున్న సామ్రాట్.. 30 రూపాయలు తగ్గడంతో మళ్లీ బస్సును ఆపి తన 30 రూపాయలు తీసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అభికి లాప్ టాప్ బ్యాగ్ కొనడం కోసం షాపునకు వెళ్తారు. అక్కడ బ్యాగ్ 2000 చెబుతాడు అతడు.
దీంతో వెంటనే సరే తీసుకుందాం అంటాడు సామ్రాట్. దీంతో ఆగండి.. ఏంటి వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నారు అంటుంది తులసి. దీంతో ఇంకేం.. బ్యాగు బాగానే ఉంది కదా. తీసుకుందాం అంటాడు సామ్రాట్. కానీ.. తులసి మాత్రం వద్దు అంటుంది. వాళ్లు ఎక్కువ చెబుతారు అంటుంది.
500 కు అడగండి అంటుంది. దీంతో షాక్ అవుతాడు సామ్రాట్. 500 కు ఇవ్వు అంటాడు. దీంతో రాదు అంటాడు ఆ షాపు అతడు. దీంతో కోఠీలో తక్కువ ఉంటుంది ధర. అక్కడికి వెళ్లి తీసుకుందాం అంటుంది తులసి. దీంతో మళ్లీ బస్సు ఎక్కి కోఠికి వెళ్తారు ఇద్దరూ.
Intinti Gruhalakshmi 5 Dec Today Episode : షాపింగ్ చేసిన తులసి, సామ్రాట్
కోఠిలో కూడా షాపునకు వెళ్లి బ్యాగు ఎంత అని అడిగితే దానికి అక్కడ కూడా 2000 అంటాడు అతడు. దీంతో సామ్రాట్ కు నవ్వొస్తుంది. దీంతో తులసి ఆ బ్యాగును 300 కు అడుగుతుంది. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. ఆ తర్వాత చివరకు బేరం చేసి చేసి చివరకు 500 కు అడుగుతుంది తులసి.
దీంతో అతడు 500 కే బ్యాగు ఇస్తాడు. ఏంటండి.. అంతలా బేరం చేస్తున్నారు అంటాడు. దీంతో 500 రూపాయల వస్తువును 2000 కు అమ్ముతున్నారు అంటుంది. అటువంటి వాళ్ల దగ్గర బేరం చేయడం తప్పేం కాదు కానీ.. రోడ్డు మీద రోజుకు వందో రెండొందలో సంపాదించే వాళ్ల దగ్గర బేరాలు ఎందుకు అంటుంది తులసి.
దీంతో వావ్ కరెక్ట్ అండి అంటాడు సామ్రాట్. ఆ తర్వాత చాలా షాపులకు వెళ్లి షాపింగ్ చేస్తారు ఇద్దరూ. షాపింగ్ అంతా అయ్యాక సామాన్లు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటారు. అలాగే ఇద్దరూ కలిసి రోస్ మిల్క్ తాగుతారు. మొత్తానికి ఒక రోజు మొత్తం సామాన్యుడిలా ఉంటాడు సామ్రాట్.
కానీ.. రోస్ మిల్క్ సెంటర్ దగ్గర చాలా మంది ఉండటమే అస్సలు సామ్రాట్ కు నచ్చదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.