Intinti Gruhalakshmi 28 Dec Today Episode : దివ్య ఆత్మహత్య.. తులసికి షాక్.. రాజ్యలక్ష్మి ప్లాన్ వర్కవుట్.. తులసి ఇంట్లో లాస్య పెత్తనం స్టార్ట్
Intinti Gruhalakshmi 28 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 28 డిసెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 1139 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యను పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చాక అందరూ తనను తిడతారు. నీ వల్ల అందరం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది అంటారు. కేవలం నీ వల్ల విక్రమ్ పోలీస్ స్టేషన్ లో ఇరుక్కునే వాడు అని […]
ప్రధానాంశాలు:
దివ్య విషయంలో సంజయ్ కఠిన నిర్ణయం
నాన్న కోసం లాస్యను ఇంటికి తీసుకొస్తా అని చెప్పిన నందు
లాస్య ఇంటికొచ్చాక ఏం జరుగుతుంది?
Intinti Gruhalakshmi 28 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 28 డిసెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 1139 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్యను పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చాక అందరూ తనను తిడతారు. నీ వల్ల అందరం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది అంటారు. కేవలం నీ వల్ల విక్రమ్ పోలీస్ స్టేషన్ లో ఇరుక్కునే వాడు అని అంటుంది రాజ్యలక్ష్మి. ఇప్పుడు అక్కను ఏం అనకండి. తనను రెస్ట్ తీసుకోనివ్వండి అని అంటుంది ప్రియ. దీంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, దాని వల్ల ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలి కదా అంటాడు సంజయ్. నేనే కావాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లాను.. నాకు తెలిసే వెళ్లాను అంటుంది దివ్య. ఇప్పుడు దివ్యను మనం కాపలా కాస్తూ ఉండాలా అంటారు అందరూ. వదినను గదిలోకి వెళ్లమని చెప్పు అంటాడు సంజయ్. దీంతో నేను వెళ్లను.. ఇక్కడే ఉంటాను. నా ముందే మాట్లాడుకోండి అంటుంది దివ్య. విక్రమ్ ఇలా అయితే ఈ సమస్య తేలదు నాన్న అంటుంది రాజ్యలక్ష్మి. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు సంజయ్ అంటాడు విక్రమ్.
నాకు ఇబ్బందిగా ఉంది మామయ్య అంటాడు. రోజురోజుకూ వదినలో జబ్బు లక్షణాలు ముదిరిపోతున్నాయి. తన ఆలోచనలు కూడా తన కంట్రోల్ లో ఉండటం లేదు. అర్ధరాత్రి ఎవ్వరికీ చెప్పకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లిందంటే తన ఆలోచన ధోరణి ఎంత వైల్డ్ గా మారిందో ఆలోచించండి. ముందు ముందు పరిస్థితి ఇంకా తీవ్రంగా మారొచ్చు. ఉక్రోషంతో ఏదైనా చేయొచ్చు. వదినను స్వేచ్ఛగా వదిలేయడం కరెక్ట్ కాదు. మనకు సేఫ్టీ కాదు అంటాడు సంజయ్. దీంతో సంజయ్ అంటూ కోప్పడతాడు విక్రమ్. దీంతో అల్లుడు ఆవేశపడకు.. అంటాడు బసవయ్య. ఒక్కోసారి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. వదినను రూమ్ లో పెట్టి బంధించక తప్పదు అంటాడు సంజయ్. దానికి నేను ఒప్పుకోను అంటూ యాక్షన్ చేస్తుంది రాజ్యలక్ష్మి. వదిన నీ కోడలు అని కాకుండా పేషెంట్ గా ఆలోచించు అమ్మ అంటాడు సంజయ్. సంజయ్ చెప్పింది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. దివ్య, విక్రమ్ తో సహా అంటాడు బసవయ్య.
Intinti Gruhalakshmi 28 Dec Today Episode : నాన్న కోసం లాస్యను తీసుకొస్తా అని చెప్పిన నందు
మరోవైపు పరందామయ్య విషయంలో చాలా ఇబ్బంది పడతారు నందు, అనసూయ, తులసి. ఆయన అల్జీమర్స్ పేషెంట్ కాబట్టి ఆయన మాట్లాడే మాటలకు, చేసే చేష్టలకు అర్థాలు వెతుక్కోకూడదు అంటుంది తులసి. ఆ డాక్టర్ కూడా ఆయన ఏం చెబితే అదే చేయమంటాడు అంటుంది అనసూయ. ఇప్పుడు మనకు వేరే దారి లేదు అంటుంది తులసి. వ్యాధి లక్షణం వల్ల మీ మామయ్య అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ భూతాన్ని తెచ్చుకొని మళ్లీ ఇంట్లో పెట్టుకుందామా అంటుంది అనసూయ. చెప్పలేనంత మొండితనం చేస్తారు ఆయన. ఎంతకైనా తెగిస్తారు. కంట్రోల్ చేయడం చాలా కష్టం. మన వల్ల కాదు అంటుంది తులసి. మామయ్య కోసం లాస్యను ఇంటికి తీసుకురావాల్సిందే అంటుంది తులసి. తెలిసి తెలిసి మళ్లీ ఉరితాడులో తల పెడదామా? వాడి తలకు గుదిబండను కడదామా అంటుంది అనసూయ.
నేను ఒప్పుకోను అంటాడు నందు. నా మీద పగ తీర్చుకుందాం అనుకుంటున్నావా అంటాడు నందు. నీ మీద పగ తీర్చుకుంటే నాకు ఏం వస్తుంది అంటుంది తులసి. ఆయన మొండికేసి కూర్చొంటే ఆయన ఆరోగ్యం ఏం కావాలి. ఇప్పుడు కూడా మామయ్య ఆరోగ్యం గురించే ఆలోచించాలి కదా. ఎంత ఆలోచించినా చేయగలిగింది ఏం లేదు. ఆలోచించడం వల్ల మామయ్యకే ప్రమాదం. వెళ్లి దగ్గరుండి లాస్యను తీసుకురండి అంటుంది తులసి. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మన గురించి కాదు. మామయ్య ఆరోగ్యం గురించి. ఇప్పుడు మనం లాస్యను తీసుకురాకపోతే ఆయనే లాస్యను వెతుక్కుంటూ వెళ్తారు. అప్పుడు మన పరిస్థితి ఇంకా కఠినంగా మారుతుంది అంటుంది తులసి. దీంతో ఏది జరిగితే అది జరగనివ్వు.. నాన్న కోసం లాస్యను తీసుకొస్తాను అంటాడు నందు.
మరోవైపు సంజయ్ తాళం గొలుసు తీసుకొస్తాడు. అవి చూసి దివ్య, విక్రమ్ షాక్ అవుతారు. అంటే..నిజంగానే అంటాడు విక్రమ్. దీంతో తప్పదు అన్నయ్య అంటాడు సంజయ్. నాకంటే నీకే ఎక్కువ తెలివి ఉంది. నువ్వే బ్యాలెన్స్ గా ఆలోచిస్తావు. ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో నువ్వే నాకు గైడెన్స్ ఇచ్చావు. ఎదుటి వాళ్లకు సలహాలు ఇచ్చేటప్పుడు సరిగ్గా పని చేసే మన మనసు.. సొంత విషయాల్లో అంతగా ఆలోచించలేం. నీ చేత్తో వదిన కాళ్లు చేతులు కట్టేయ్ అంటాడు సంజయ్. సారీ వదిన అర్థం చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అప్పుడప్పుడు నా మనసు, ఆలోచనలు బ్యాలెన్స్ తప్పుతున్నాయి అనిపిస్తోంది. నాకు చెప్పడానికి మొహమాట పడుతున్నావు. నీకు చెప్పకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లడం తప్పు. అయినా సరే.. ఎందుకు ఇలా చేశావు అని ఒక్క మాట కూడా నువ్వు అనలేదు. కొప్పడలేదు. ఎందుకని అని విక్రమ్ ను అడుగుతుంది దివ్య. దీంతో నీకు నువ్వే చెబుతావు అని అంటాడు విక్రమ్. కాదు.. నా డిజార్డర్ గురించి నీకు తెలుసు కాబట్టి. నువ్వు ఊరుకున్నా.. ఇంట్లో వాళ్లు ఊరుకోరు కదా విక్రమ్. వాళ్లకు నచ్చే అబద్ధాన్ని నేను చెప్పలేను కదా అంటుంది దివ్య. నువ్వు నా చేతులకు సంకెళ్లు వేయి అంటుంది దివ్య.
జీవితంలో అన్నీసార్లు మనకు నచ్చిన జీవితం మాత్రమే ఉండదు. నచ్చని పనులు కూడా చేయాలి. అది దైవ నిర్ణయం అంటుంది దివ్య. రా.. సంకెళ్లు వేయి అంటుంది దివ్య. ఇంట్లో వాళ్ల నిర్ణయాన్ని ఫాలో అవ్వాల్సిందే. తప్పదు విక్రమ్ అంటుంది దివ్య. ఇంతలో దివ్య ఇంతలో ప్రియకు ఫోన్ చేస్తుంది. ప్రియను పిలుస్తుంది. ప్రియ ఆ సంకెళ్లు చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత రాత్రి పడుకుంటుంది దివ్య. మళ్లీ దెయ్యంగా వచ్చిన చందన తనను పిలుస్తుంది. నువ్వు నన్ను యాక్సిడెంట్ చేసి చంపినందుకు నువ్వే చచ్చిపో లేదంటే మీ ఆయన్ను చంపుతా అంటుంది దెయ్యం. దీంతో బిల్డింగ్ మీది నుంచి దూకి చనిపోయేందుకు ప్రయత్నిస్తుంది దివ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.