Intinti Gruhalakshmi 26 Dec Today Episode : దివ్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. దెయ్యంలా నటించి దివ్యను భయపెట్టిన చందన.. లాస్య లేకపోవడంతో చిరాకు పడ్డ పరందామయ్య | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Intinti Gruhalakshmi 26 Dec Today Episode : దివ్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. దెయ్యంలా నటించి దివ్యను భయపెట్టిన చందన.. లాస్య లేకపోవడంతో చిరాకు పడ్డ పరందామయ్య

Intinti Gruhalakshmi 26 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 26 డిసెంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 1137 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక అమ్మాయి చందనను దెయ్యం వేషం వేయిస్తుంది రాజ్యలక్ష్మి. ఆమె నిజంగానే దెయ్యం అనుకొని బసవయ్య భయపడతారు. దివ్యను పిచ్చిదాన్ని చేయాలనే తనకు ఈ వేషం వేయించా అని చెబుతాడు బసవయ్య. అవునా.. అయితే ఓకే అంటాడు బసవయ్య. తను […]

 Authored By gatla | The Telugu News | Updated on :26 December 2023,8:30 am

ప్రధానాంశాలు:

  •  దివ్యను భయపెట్టడానికి దెయ్యం గెటప్ వేసిన చందన

  •  లాస్య ఎక్కడ అని అడిగిన పరందామయ్య

  •  లాస్యను బతిమిలాడి ఇంటికి తీసుకొచ్చిన నందు

Intinti Gruhalakshmi 26 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 26 డిసెంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 1137 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక అమ్మాయి చందనను దెయ్యం వేషం వేయిస్తుంది రాజ్యలక్ష్మి. ఆమె నిజంగానే దెయ్యం అనుకొని బసవయ్య భయపడతారు. దివ్యను పిచ్చిదాన్ని చేయాలనే తనకు ఈ వేషం వేయించా అని చెబుతాడు బసవయ్య. అవునా.. అయితే ఓకే అంటాడు బసవయ్య. తను దెయ్యం వేషంలో ఉండటంతో ఆమె మనిషి అని తెలిసినా కూడా భయపడతారు బసవయ్య, ఆయన భార్య. ఆ తర్వాత నువ్వు మనిషి రూపంలో పుట్టిన దేవతవు అక్కయ్య. నీ ఆశీర్వాదం ఉంటే చాలు అక్కయ్య అంటాడు బసవయ్య. నువ్వు మన ప్రాజెక్ట్ పూర్తయ్యే సరికి నా రూమ్ లోనే ఉండాలి. ఒక్క దివ్యకు తప్పించి ఇంకెవ్వరికీ కనిపించకూడదు అంటుంది రాజ్యలక్ష్మి.

మరోవైపు పరందామయ్యను ఇంటికి తీసుకొస్తారు. తులసిని చూసి చిరాకు పడతాడు పరందామయ్య. అమ్మ లాస్య అంత దూరం ఉంటావెందుకు. నా దగ్గరికి రా. నన్ను నా రూమ్ లోకి తీసుకెళ్లు అంటాడు పరందామయ్య. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత పరందామయ్యను తీసుకెళ్లి తన రూమ్ లో పడుకోబెడుతుంది లాస్య. మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తుంది లాస్య. బయట తులసి, అనసూయ, నందు ఉంటారు. వాళ్లకు కోపం వస్తుంది. ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది. మామయ్య గారు నన్ను ఈ ఇంటి కోడలు అంటున్నందుకా? అబద్ధం ఎందుకు చెప్పాలి.. ఆయన అలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ.. అది కాసేపే.. కొద్ది క్షణాలే అంటుంది లాస్య. నేను ఈ ఇంటికి పరాయి మనిషినే. అది ఎప్పటికీ మరిచిపోను. అది ఇవాళ కాకపోతే రేపు అయినా మామయ్య గారికి ఖచ్చితంగా తెలుస్తుంది అంటుంది లాస్య. మా నాన్న గారిని మంచి డాక్టర్ కు చూపించినందుకు థాంక్స్ అంటాడు నందు. మామయ్య గారు నేను ఈ ఇంటి కోడలు అనుకోవడంలో నాకు సంబంధం లేదు కదా. నువ్వు కూడా అదే అనుకుంటున్నావా నందు. అందరూ ఫోర్స్ చేశారని కారు ఎక్కాను. అసలు ఇక్కడి దాకా వచ్చేదాన్నే కాదు. మిమ్మల్ని, డాక్టర్ ను కలపడంతో నా పని అయిపోయింది అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi 26 Dec Today Episode : దివ్యను భయపెట్టిన చందన

నిజం చెప్పు నందు. పరిస్థితులను నా స్వార్థం కోసం నా వైపు లాక్కోవడానికి నాకు అవసరం లేదు. నా జీవితాన్ని నాకు కాకుండా చేసింది అంటుంది. కానీ.. మనసులో మాత్రం ఇంకోటి అనుకుంటుంది. ఆ ముసలోడు ఇక నన్నే కోడలుగా ఫిక్స్ అయ్యాడు అని అనుకుంటుంది. లాస్యను ఇంటి కోడలు అని ఎందుకు అనుకుంటున్నారు అని అనసూయ అంటుంది. నెమ్మదిగా నచ్చచెబుదాంలే అంటాడు నందు. ఈరోజే కదా మొదటి సారి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లింది. చూద్దాం. కొద్ది రోజుల్లో ఆ ఫలితం ఎలా ఉంటుందో అంటుంది తులసి.

మరోవైపు దివ్య నిద్రపోకుండా కళ్లు తెరిచి చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. ఎందుకు ఇలా ప్రతి దానికి భయపడుతున్నావు అని అంటాడు విక్రమ్. ఈ మధ్య నీలో చాలా మార్పు కనిపిస్తోంది అంటే.. నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అంటుంది దివ్య. నువ్వు ఎలాంటి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా పడుకో అంటాడు విక్రమ్. దీంతో పడుకుంటుంది. మళ్లీ తనకు అదే యాక్సిడెంట్ గుర్తొస్తుంది. విక్రమ్ నిద్రపోతూ ఉంటాడు. ఇంతలో చందన రంగంలోకి దిగుతుంది. దెయ్యంగా చందన కనిపిస్తుంది. తనను చూసి షాక్ అవుతుంది. విక్రమ్ ను లేపుదామని అనుకున్నా వద్దులే అని ఇదంతా భ్రమ అని అనుకుంటుంది.

లేచి కిందికి వెళ్తుండగా తను కనిపిస్తుంది. మళ్లీ తనను వెంటాడుతుంది. నిన్ను వదిలిపెట్టను. నన్ను దారుణంగా చంపేశావు. నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటుంది. చందనను చూసి నిజంగానే దెయ్యం అనుకొని తెగ టెన్షన్ పడుతుంది. దీంతో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది దివ్య. దివ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవడంతో రాజ్యలక్ష్మి సంతోషిస్తుంది.

మరోవైపు దివ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి అర్జెంట్ గా నన్ను అరెస్ట్ చేయండి అని అంటుంది దివ్య. పోలీసులకు ఏం అర్థం కాదు. అసలు నిన్నెందుకు అరెస్ట్ చేయాలి అంటే నేను ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేసి చంపేశాను అంటుంది దివ్య. వాళ్లకు ఏం అర్థం కాదు. యాక్సిడెంట్ ఎప్పుడు చేశావు అంటే నిన్న అంటుంది. మరి ఇప్పటి వరకు కంప్లయింట్ ఇవ్వలేదు అంటుంది. చివరకు విక్రమ్ నెంబర్ తీసుకొని పోలీసులు తనను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక